అనంతబాబుకు మూడింది.. ఎమ్మెల్సీకి బాబు మార్క్ ట్రీట్మెంట్

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. డ్రైవర్ ను చంపి.. డోర్ డెలివరి చేసిన వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 18, 2025 | 01:00 PMLast Updated on: Apr 18, 2025 | 8:18 PM

Anantha Babus Death Babu Mark Treatment For Mlc

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. డ్రైవర్ ను చంపి.. డోర్ డెలివరి చేసిన వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. 2022 మే 18 డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరగగా.. ఆ తర్వాత అనంతబాబుని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎమ్మెల్సీ ఆరు నెలలపాటు ఉన్నారు. తర్వాత జరిగిన పరిణామాలతో బెయిల్ పై బయటికి వచ్చారు అనంతబాబు. అప్పట్లో ఇది రాజకీయ దుమారం కూడా రేపిన సంగతి తెలిసిందే.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు పై టిడిపి తీవ్ర ఆరోపణలు చేస్తూ రాగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేస్తామని టిడిపి నేతలు హామీ కూడా ఇచ్చారు. ముందు.. వైసీపీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయగా.. ఆ తర్వాత ఆయన మళ్ళీ అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ వచ్చారు. ఇక పోలీసులు కూడా అనంత బాబు సుబ్రహ్మణ్యాన్ని ఉద్దేశపూర్వకంగా చంపలేదని బహిరంగ ప్రకటన చేయడం సంచలనం అయింది.

ఇక ప్రభుత్వం తరఫున ఛార్జిషీట్ దాఖలు చేయడంలోను గత ప్రభుత్వం పట్టించుకోలేదని టిడిపి ఆరోపించింది. ఇక ఈ కేసు వ్యవహారంలో సుబ్రహ్మణ్యం కుటుంబం తరపున తొలి నుంచి అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు పోరాడుతూ వస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం చంద్రబాబు.. సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని కలిశారు.. ఇప్పుడు అదే అడ్వకేట్ ను ప్రాసిక్యూషన్ కి సలహాలు ఇవ్వడానికి అపాయింట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మరోసారి ఈ కేసును విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది.

తమ ఎమ్మెల్సీ కావడంతో అనంతబాబు కేసు వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని టిడిపి తొలినుంచి ఆరోపిస్తోంది. ఇక దానికి అనుగుణంగా గతంలో జరిగిన విచారణపై నివేదిక తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. పోలీసులు అప్పట్లో అనంతబాబుకు సహకరించారు. ఇక ఇప్పుడు అనంతబాబు బెయిల్ మీద ఉండగా ఆయన బెయిల్ క్యాన్సిల్ అయ్యే విధంగా వర్కౌట్ చేస్తోంది ప్రభుత్వం.

ఈ కేసును తొలి నుంచి ఫాలో అవుతున్న అడ్వకేట్ ను ప్రాసిక్యూషన్ లో భాగం చేసారు. బాధితుల డిమాండ్ అంటూ పునర్విచారణ చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. పిన్ టు పిన్ ఒక క్లారిటీగా తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.మొత్తానికి సుబ్రహ్మణ్యం హత్య కేసు పై కొత్త ట్విస్ట్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.. ఎమ్మెల్సీ అనంత బాబు ను కార్నర్ చేయడానికి రంగం సిద్దమైంది. ప్రభుత్వం మారిన తర్వాత తమకు న్యాయం జరిగింది అనే విధంగా కుటుంబంతో చెప్పించడానికి ప్రభుత్వం సిద్దమైనట్టు తెలుస్తోంది.