ఇప్పుడు కేసీఆర్, హరీష్ వంతు..?

చివరి దశకి చేరుకుంది కాళేశ్వరం కమిషన్ ఎంక్వయిరీ. ఈ నెల 19 కి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చేంద్ర ఘోష్ చేరుకోనున్నారు. రెండు నుంచి మూడు వారాల పాటు హైదరాబాద్ లోనే కమిషన్ చైర్మన్ ఉండనున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 11, 2025 | 01:48 PMLast Updated on: Jan 11, 2025 | 1:48 PM

Now Its Kcr And Harishs Turn

చివరి దశకి చేరుకుంది కాళేశ్వరం కమిషన్ ఎంక్వయిరీ. ఈ నెల 19 కి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చేంద్ర ఘోష్ చేరుకోనున్నారు. రెండు నుంచి మూడు వారాల పాటు హైదరాబాద్ లోనే కమిషన్ చైర్మన్ ఉండనున్నారు. ఈ సారి ప్రజా ప్రతినిధులను బహిరంగ విచారణ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఐఏఎస్ లు.. స్మిత సభర్వాల్, ఎస్కే జోషీ, సోమేశ్ కుమార్, రజత్ కుమార్, వికాస్ రాజ్ లను కమీషన్ విచారించింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం లో ప్రభుత్వ స్థాయి నిర్ణయాలు అమలు చేయటం లో కీలకంగా వ్యవహరించిన బ్యూరోక్రేట్ ల నుంచి కీలక సమాచారం రాబట్టిన కమిషన్.. ఈ మేరకు విచారణ చేయనుంది. దాని ఆధారంగా ఇరిగేషన్ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల తో పాటు మాజీ సిఎం కేసీఆర్ ను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. పక్కా సమాచారం తోనే ప్రజా ప్రతినిధులను విచారణకి పిలవనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సగానికి పైగా కాళేశ్వరం ఎంక్వయిరీ ఫైనల్ రిపోర్టును జస్టిస్ ఘోష్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.