“ఏటీఎం సైజ్ చేప” నీళ్ళ కోసం అమెరికా తగలబడుతుందా…?

అమెరికాలోని కీలక నగరమైన లాస్ ఏంజెల్స్ లో చెలరేగిన మంటలు క్రమంగా వ్యాపిస్తూ నగరం మొత్తానికి వ్యాపిస్తున్నాయి. ఇక ఈ మంటల్లో కాలిపోయిన వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 11, 2025 | 01:54 PMLast Updated on: Jan 11, 2025 | 1:54 PM

Will America Be Burned For Water By An Atm Sized Fish

అమెరికాలోని కీలక నగరమైన లాస్ ఏంజెల్స్ లో చెలరేగిన మంటలు క్రమంగా వ్యాపిస్తూ నగరం మొత్తానికి వ్యాపిస్తున్నాయి. ఇక ఈ మంటల్లో కాలిపోయిన వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. కనీసం 10 మంది ఈ మంటల్లో మరణించారని అక్కడి అధికారులు వెల్లడించారు. లాస్ ఏంజిల్స్ మెడికల్ ఎగ్జామినర్స్ డిపార్ట్మెంట్ దీనిపై కీలక ప్రకటనలు చేసింది. ఈ మంటల్లో డజన్ల కొద్దీ గాయపడ్డారని.. మంటలు ఇంకా అదుపులోకి రాలేదని పేర్కొంది. 1,79,783 మందిని తరలించామని.. 2,00,000 మందిని తరలించే అవకాశం ఉండవచ్చని లాస్ ఏంజెల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా తెలిపారు.

నగరం యొక్క దక్షిణాన చెలరేగిన మంటల్లో అతిపెద్దదైన పాలిసాడ్స్ లో వేలాది గృహాలు కాలిపోయాయి అని.. వ్యాపార, ఇతర నిర్మాణాలు కాలిపోయాయని అంచనా వేసారు. 10 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేసారు. క్యాపిటల్ రికార్డ్స్ భవనం, TCL చైనీస్ థియేటర్, హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ మరియు హాలీవుడ్ బౌల్‌తో సహా అనేక ల్యాండ్‌ మార్క్‌ లు కూడా ధ్వంసమయ్యాయి. మలిబుకు తూర్పున ఉన్న లాస్ ఏంజెల్స్ కౌంటీ పరిసర ప్రాంతంలోని పసిఫిక్ పాలిసాడ్స్‌ లో మంగళవారం ఉదయం పొదల్లో మంటలు చెలరేగాయి.

బుధవారం మధ్యాహ్నం నాటికి, కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్ ప్రకారం, ఇది 15,000 ఎకరాల్లో మంటలు విస్తరించాయి. ప్రస్తుతం, ఇది కనీసం 19,978 ఎకరాల వరకు విస్తరించింది. గురువారం లాస్ ఏంజెల్స్ సిటీ ఫైర్ చీఫ్ క్రిస్టిన్ క్రౌలీ మాట్లాడుతూ.. పాలిసాడ్స్‌ లో జరిగిన అగ్నిప్రమాదాన్ని లాస్ ఏంజిల్స్ చరిత్రలో అత్యంత విధ్వంసకర ప్రకృతి వైపరీత్యాలలో ఒకటి” అని పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితిపై అమెరికా కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు.

2019లో కాలిఫోర్నియాలో అటవీ నిర్వహణ విషయంలో గవర్నర్ న్యూసమ్ ను ట్రంప్ ఈ సందర్భంగా… తప్పుపట్టారు. ఆయన తనను కలిసినప్పుడు అటవీ భూముల్లో ఎండిపోయిన ఆకులు వంటివి తొలగించి శుభ్రం చేయించాలని సూచించాను అని… ప్రతీ ఏటా కాలిఫోర్నియాలో కార్చిచ్చులు వ్యాపించడం.. ఆయన ఫెడరల్ గవర్నమెంట్ దగ్గరకు నిధుల కోసం రావడం సాధారణ విషయంగా మారిపోయిందని.. ఇక అది కుదరదు అంటూ ట్రంప్ తేల్చేసారు. ఈ నష్టానికి కారణం కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ అని స్పష్టం చేసారు.

ఒక చిన్న చేపను కాపాడేందుకు దక్షిణ కాలిఫోర్నియాకు నీటి సరఫరాను తగ్గించి తీవ్ర నష్టానికి కారణమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేసారు. న్యూసమ్ రాజీనామా చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఇక ఎలాన్ మస్క్ కూడా ట్రంప్ కామెంట్లకు మద్దతు ఇచ్చారు. ట్రంప్ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందని అన్నారు. ఒక చేప కోసం నీటి సరఫరాను ఎలా తగ్గించారో ట్రంప్ పోస్ట్ వివరిస్తూ పోస్ట్ లు చేయగా.. వాటిని మస్క్ రీ పోస్ట్ చేసారు. ఏటీఎం కార్డు సైజులో ఉండే అరుదైన పప్డ్ ఫిష్ అనే చెప్పాను రక్షించుకోవడానికి కొన్నేళ్ల నుంచి కాలిఫోర్నియాకు నీటి సరఫరాలో కోతవేశారని… దీని సంరక్షణ కారణంగా దాదాపు లక్షల ఎకరాల్లో రైతుల పంటలు కూడా ప్రభావితం అవుతున్నాయంటూ ఆ పోస్ట్ లలో వివరించారు.