Top Story: ఇరాన్‌ను చుట్టుముట్టేసిన యుద్ధ నౌకలు, ట్రంప్ అన్నంత పనీ చేయబోతున్నాడా?
USS కార్ల్ విన్సన్.. అమెరికా సెకండ్ అండ్ పవర్‌ఫుల్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్. దీని గురించి కాస్త వివరంగా చెప్పాలంటే.. ప్రపంచాన్ని గడగడలాడించిన అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ డెడ్ బాడీని సముద్రంలో ఖననం చేయడానికి ఈ యుదధ నౌకనే ఉపయోగించారు.

USS కార్ల్ విన్సన్.. అమెరికా సెకండ్ అండ్ పవర్‌ఫుల్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్. దీని గురించి కాస్త వివరంగా చెప్పాలంటే.. ప్రపంచాన్ని గడగడలాడించిన అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ డెడ్ బాడీని సముద్రంలో ఖననం చేయడానికి ఈ యుదధ నౌకనే ఉపయోగించారు. అలాంటి పవర్‌ఫుర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇప్పుడు ఇరాన్ దిశగా దూసుకెళుతోంది. అదికూడా అణు నిరాయుధీకరణ డీల్‌పై రోమ్‌లో రెండో విడత చర్చలు మొదలవ్వడానికి ముందే. దీంతో ట్రంప్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో తెలీక టెహ్రాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇంతకూ, అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అరేబియా సముద్రంలోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? మొన్న బీ-2 బాంబర్లు, ఇప్పుడు యుద్ధనౌక తరలింపు వెనుక ట్రంప్ ప్లాన్ ఆఫ్ యాక్షనేంటి? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..
ఈ నెల 12వ తేదీన ఒమన్ రాజధాని మస్కట్‌లో ఇరాన్, అమెరికా మధ్య అణు నిరాయుధీకరణ ఒప్పందంపై తొలి విడత చర్చలు జరిగాయి. అప్పుడే మరోసారి చర్చలు జరపాలని ఇరు వర్గాలు డిసైడ్ అయ్యాయి. ఈ సారి చర్చలకు రోమ్‌ను ఎంచుకున్నాయి. ఇటలీ రాజధానిలో ఏప్రిల్ 19న రెండో విడత చర్చలు జరుగుతాయి. మరోవైపు ఈ పరిణామాలపై సంప్రదింపులు, సలహాల కోసం ఇరాన్ టీమ్ ఒకటి ఇప్పటికే రష్యా వెళ్లింది. ఇక ఇరుదేశాల తొలి సమావేశం తర్వాత ట్రంప్ స్పందిస్తూ ర్యాడికలైజేషన్ ఐన దేశాల వద్ద అణుబాంబులు ఉండకుండా చేయడమే తమ ఉద్దేశం అన్నారు. ఇక ఇరాన్‌పై సైనిక చర్య ఆప్షన్‌ను ఆయన కొట్టిపారేయలేదు. మరోవైపు.. అమెరికాతో జరుగుతోన్న అణు చర్చలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తొలిసారి స్పందించారు. తొలివిడత చర్చలు సానుకూలంగానే సాగినట్లు వెల్లడించారు. “మరీ అంత ఆశావాదంగానూ మరీ అంత నిరాశా వాదంగానూ లేము” అని అలీ ఖమేనీ పేర్కొన్నారు. సానుకూలం అనే పదం వాడుతూనే.. అమెరికాపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
అణు నిరాయుధీకరణ ఒప్పందపై టెహ్రాన్‌తో సంతకం పెట్టించడం ఒకటి రెండు విడతల చర్చలతో కొలిక్కి వచ్చేది కాదు. ఒక యుద్ధాన్ని ఆపడానికి ఎన్ని చర్చలు అవసరమో. న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయకుండా ఇరాన్‌ను నిలుపుదల చేయడానికి కూడా అన్నే చర్చలు అవసర మవుతాయి. ఈ నిజం అమెరికాకూ తెలుసు. అందుకే, ట్రంప్ వ్యూహం మార్చారు. చర్చల పేరుతో టైం వేస్ట్ చేయడం ట్రంప్‌కు ఇష్టం లేదు. అందుకే టెహ్రాన్‌పై ఒత్తిడి పెంచాలని డిసైడ్ అయ్యారు. అణు నిరాయుధీకరణకు అంగీకరిస్తే సరే సరి. లేదంటే బాంబు దాడులు చేస్తానని హెచ్చరించడం అందులో భాగమే. శత్రువుల విషయంలో ట్రంప్ మాటలకే పరిమితం అయ్యే రకం కాదు.. చేతల్లోనూ చెప్పింది చేస్తారు. అందులో భాగంగానే ఇండో-పసిఫిక్ రీజియన్‌లో అమెరికా, బ్రిటన్ జాయింట్ మిలిటరీ బేస్
డియాగో గార్సియాలో పవర్‌ఫుల్ బీ-2 ఫైటర్లని సైలెంట్‌గా మోహరించారు. ఆ తర్వాతే మస్కట్‌లో చర్చలకు టెహ్రాన్ అంగీకారం తెలిపింది. ఇప్పుడు టెహ్రాన్‌పై మరింత ఒత్తిడి పెంచాలని ట్రంప్ డిసైడ్ అయ్యారు. ఈసారి చర్చలకు అంగీకరించేలా చేయడం కాదు.. అణు నిరాయుధీకరణ డీల్‌పై టెహ్రాన్‌తో సంతకం చేయించడమే ట్రంప్ టార్గెట్.
ఇరాన్ వెన్నులో వణుకుపుట్టించే విజువల్స్ ఇవే. దీని పేరే USS కార్ల్ విన్సన్. అమెరికా సెకండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్. ఈ యుద్ధ నౌక ప్రస్తుతం ఇరాన్ దిశగా దూసుకెళుతోంది. దీంతోపాటు క్యారియర్ స్ట్రైక్ గ్రూపులోని పటాలం మొత్తం అరేబియా సముద్రం దిశగా ప్రయాణిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ USS హారీ ఎస్ ట్రూమన్ కూడా ఇటీవలే యెమెన్ హౌతీలపై దాడులు ప్రారంభించింది. USS కార్ల్ విన్సన్ యుద్ధనౌకకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అమెరికా నౌకాదళంలో USS కార్ల్‌విన్సన్ విమాన వాహక నౌకను 1980లో ప్రవేశపెట్టారు. జార్జియాకు చెందిన ప్రముఖ నాయకుడు కార్ల్ విన్సన్ US నౌకాదళానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఈ నౌకకు ఆయన పేరు పెట్టారు. 1983 నుంచి ఈ యుద్ధ నౌక సేవలందిస్తోంది. సాధారణ విమాన వాహక నౌకలతో పోలిస్తే దీని పరిమాణం భారీగా ఉంది. అంతేకాదు, శత్రువుపై దాడులు చేయడంలోనూ ఇది పవర్‌ఫుల్.
USS కార్ల్ విన్సన్ నుంచి క్షిపణులను కూడా ప్రయోగించవచ్చు. యుద్ధనౌక లక్ష్యంగా వచ్చే క్షిపణులను, టార్పెడోలను క్షణాల్లో గుర్తించగలిగే అధునాతన వ్యవస్థలన్నీ ఇందులో ఉన్నాయి. శత్రుదేశాలపై ఒక్కసారిగా దాడి చేయడానికి వీలుగా దీనిపై అధునాతన యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు ఉంటాయి. ఈ నౌక ఇరాక్ యుద్ధంతోపాటు డిసర్ట్ స్ట్రైక్, సదరన్ వాచ్, ఎండ్యూరింగ్ ఫ్రీడం తదితర ఆపరేషన్లలో కీలకపాత్ర పోషించింది. ఈ నౌకలోనే బిన్ లాడెన్ మృతదేహాన్ని సముద్రంలో బరియల్ చేయడానికి తీసుకెళ్లారు. అలాంటి మాన్‌స్టర్ నౌకను అరేబియా సముద్రంలోకి పంపడం టెహ్రాన్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టడమే. ఇదొక్కటే కాదు.. USS కార్ల్ విన్సన్ గ్రూపులో USS ప్రిన్స్‌టన్, USS స్ట్రెట్, USS విలియమ్ పి లార్సెన్స్ ఉన్నాయి. వీటికితోడు అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ కూడా దాడులకు సన్నాహాలు చేస్తోంది. సో.. అణు నిరాయుధీకరణ చర్చలు కొలిక్కి రాకపోతే టెహ్రాన్‌పై దాడి చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారన్నమాట. ఈ నెల 19న చర్చలు కొలిక్కి రాకపోతే మిడిల్ ఈస్ట్‌లో మరో విధ్వంసకర యుద్ధం మొదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.