రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫ్లాప్ వెనుక పెద్ద కుట్ర.. తమన్ సంచలన వ్యాఖ్యలు..!
రామ్ చరణ్ కెరీర్ లో మొన్నటి వరకు బిగ్గెస్ట్ ఫ్లాప్ అంటే జంజీర్ లేదంటే ఆరెంజ్ సినిమా పేర్లు చెప్పేవాళ్ళు. కానీ గేమ్ చేంజర్ వచ్చిన తర్వాత ఆ అవసరం లేకుండా పోయింది.

రామ్ చరణ్ కెరీర్ లో మొన్నటి వరకు బిగ్గెస్ట్ ఫ్లాప్ అంటే జంజీర్ లేదంటే ఆరెంజ్ సినిమా పేర్లు చెప్పేవాళ్ళు. కానీ గేమ్ చేంజర్ వచ్చిన తర్వాత ఆ అవసరం లేకుండా పోయింది. కేవలం చరణ్ కెరీర్ లో మాత్రమే కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీ లోనే టాప్ 5 డిజాస్టర్ లిస్టులో 4వ స్థానంలో నిలిచింది గేమ్ చేంజర్. శంకర్ లాంటి దిగ్గజ దర్శకుడు నుంచి వచ్చిన ఈ సినిమా ఇంత దారుణంగా ఫ్లాప్ అవుతుందని ఎవరు ఊహించలేదు. నిజం చెప్పాలంటే ముందు నుంచి ఈ సినిమా మీద పెద్దగా అంచనాలైతే లేవు. అలాగని మరీ ఈ స్థాయిలో డిజాస్టర్ అవుతుందని కూడా ఎవరు ఊహించలేదు. ఒకవేళ అయినా కూడా ఫ్లాప్ అవుతుందేమో.. కనీసం ఓపెనింగ్స్ వస్తాయి అనుకున్నారు అంతా. కానీ గేమ్ చేంజర్ విడుదలైన తర్వాత సీన్ అంతా మారిపోయింది. మార్నింగ్ షో నుంచి ఈ సినిమా కలెక్షన్స్ పడిపోవడం మొదలయ్యాయి. అసలు రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమా అయినా కూడా ప్రేక్షకులు చూడడానికి ఇంత కూడా ఆసక్తి చూపించలేదు. ఒక వర్గం ప్రేక్షకులు మొత్తం సినిమా బాగానే ఉంది అని చెప్పినా కూడా థియేటర్ వరకు రావడానికి ఆడియన్స్ అంతగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు.
దానికి ప్రధానమైన కారణం విడుదల రోజే HD ప్రింట్ బయటికి రావడం. ఈ విషయంలో దర్శక నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విడుదలైన మూడవరోజు బస్సులలో కూడా గేమ్ చేంజర్ సినిమా ప్రదర్శించారంటే ఈ సినిమా మీద ఏ రేంజ్ లో కుట్ర జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఇదే విషయం మీద మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఓపెన్ అయ్యాడు. ఈ సినిమా విడుదల సమయంలో దిల్ రాజు పడిన బాధ ఇంకా తన కళ్ళముందు ఉంది అంటూ చెప్పుకో చోటు తమన్. ఆయన అంతలా బాధపడటం తానెప్పుడూ చూడలేదు అన్నాడు ఈయన. సినిమా విడుదలకు ముందు తనకి టార్చర్ చూపించారని తమన్ తెలిపాడు. ఇది 4 ఏళ్ల క్రితం సినిమా అంటూ కామెంట్లు చేశారనీ.. పాత సినిమాను ఇప్పుడు విడుదల చేస్తే ఎవడు చూస్తాడు అంటూ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేశారు అంటూ అప్పటి పరిస్థితులు గుర్తు చేసుకున్నాడు తమన్. ఒక సినిమా తొందరగా విడుదలైనా, ఆలస్యంగా విడుదలైనా పరిస్థితులను బట్టే ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపాడు తమన్.
ఏ నిర్మాత తన సొంత సినిమాని చంపుకోడు.. గేమ్ చేంజర్ సినిమా విషయంలో కావాలని కొందరు ఆ సినిమాను చంపడానికి ప్రయత్నించారు అని సంచలన ఆరోపణలు చేశాడు తమన్. అది జరిగినప్పుడు ఎవరూ వచ్చి సపోర్ట్ గా నిల్చోలేదని చాలా బాధ పడ్డానని.. ఆ సమయానికి అందరు ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేసి ఉంటే బాగుండు అని చెప్పుకొచ్చాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. సినిమా పైరసి రావడం, బయట ప్లే చేయడం, బస్సుల్లో ప్లే చేయడం.. ఇదంతా చూస్తుంటే కావాలని ఈ సినిమాపై కుట్ర చేశారని అనిపిస్తుందనీ తెలిపాడు. ఇలా ఈ సినిమాకు నెగిటివిటీని స్ప్రెడ్ చేయటం వల్ల నిర్మాతకు ఏకంగా 140 కోట్ల నష్టాలు వచ్చాయని చెప్పుకొచ్చాడు తమన్. ఇండస్ట్రీలో నిర్మాత బాగుంటేనే సినిమాలు వస్తాయని.. అలాంటి నిర్మాతలనే చంపేయాలని చూస్తే ఇండస్ట్రీ అసలు బాగుండదు అని గుర్తు చేశాడు ఈయన. ఆ మధ్య ఒక సినిమా ఈవెంట్ లో కూడా బాగా ఫైర్ అయ్యాడు తమన్. సినిమాలు చంపేయడానికి ఒక వర్గం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అని అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ ఫ్లాప్ వెనక పెద్ద కుట్ర జరిగింది అంటూ మరోసారి సంచలనం రేపాడు తమన్.