సితార ఘట్టమనేని ఎంట్రీకి రంగం సిద్ధమైందా.. ఫస్ట్ సినిమా ఎప్పుడో తెలుసా..?
స్టార్ హీరోల పిల్లలకు వాళ్లు అడక్కుండానే అదిరిపోయే ఫాలోయింగ్ వస్తుంటుంది. దాన్ని మెయింటేన్ చేసే సత్తా కూడా వాళ్లలో ఉండాలి. ఈ విషయంలో సితార ఘట్టమనేని ఆరితేరిపోయింది.

స్టార్ హీరోల పిల్లలకు వాళ్లు అడక్కుండానే అదిరిపోయే ఫాలోయింగ్ వస్తుంటుంది. దాన్ని మెయింటేన్ చేసే సత్తా కూడా వాళ్లలో ఉండాలి. ఈ విషయంలో సితార ఘట్టమనేని ఆరితేరిపోయింది. 12 ఏళ్ళకే సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయింది సితార. తండ్రి మహేష్ బాబు పేరు నిలబెడుతూ.. తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుంది. చిన్న వయసు నుంచే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే పనిలో పడింది సితార. నాన్న సపోర్ట్ ఉన్నా కూడా.. తనకంటూ స్పెషల్ రూట్ క్రియేట్ చేసుకుంటుంది. సోషల్ మీడియాలో డాన్సులు, డైలాగులతో ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో ఉంటుంది సితార. స్టార్ కిడ్ కాబట్టి సోషల్ మీడియా అటెన్షన్ అంతా భారీగా ఉంటుంది సితారపై..! దాన్ని బాగా బ్యాలెన్స్ చేయడమే కాకుండా.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది సితార. ఈ బ్రాండ్‌తోనే సితారకు కొన్ని యాడ్స్ కూడా వచ్చాయి. మహేష్ బాబు లేకుండా సితారతోనే కొన్ని బ్రాండింగ్స్ చేయిస్తున్నాయి కంపెనీలు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు సితార రేంజ్.
ఈ మధ్యే తండ్రి మహేష్ బాబుతో ఓ క్లోత్స్ బ్రాండ్ యాడ్ చేసింది సితార. అందులో ఈమె లుక్స్ చూసి అంతా ఫిదా అయిపోయారు. కళ్లముందే పుట్టిన పాప.. చూస్తుండగానే ఎదిగిపోయి హీరోయిన్ మెటీరియల్‌గా మారిపోయింది. దాంతో సితార టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అప్పుడే ప్రశ్నలు కూడా మొదలైపోయాయి. ముందు గౌతమ్ ఉన్నా కూడా సితార గురించే ఎక్కువగా ఆరా తీస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. ఇదే ప్రశ్న నమ్రతకు కూడా ఎదురైంది. ఈ మధ్యే ఓ కార్యక్రమంలో సితారతో కలిసి వచ్చింది నమ్రత శిరోద్కర్. అప్పుడే సితార ఎంట్రీ గురించి అడిగేసింది మీడియా. అంతేకాదు.. ఇదే క్వశ్చన్ సితారను కూడా అడిగారు. దానికి ఆమె చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది. తన వయసు ప్రస్తుతం కేవలం 12 సంవత్సరాలు మాత్రమే అని.. దాని గురించి ఆలోచించడానికైనా, చర్చించడానికైనా చాలా టైమ్ ఉందని చెప్పింది సితార. మరోవైపు నమ్రత శిరోద్కర్ కూడా ఇదే చెప్పుకొచ్చింది. సితార ఎంట్రీకి ఇంకా చాలా టైమ్ ఉందని చెప్పింది. ప్రస్తుతానికైతే బ్రాండింగ్‌లోనే బిజీగా ఉంది ఈ పాప.
ఆ మధ్య ఆమె టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డ్‌లో కన్పించిన అతి పిన్న వయస్కురాలైన స్టార్ కిడ్‌గా చరిత్ర సృష్టించింది సితార. ఫ్యూచర్‌లో ఇలాంటి రికార్డులు ఇంకా ఇంకా క్రియేట్ చేసేలాగే కనిపిస్తుంది సితార జోరు చూస్తుంటే..! మూడేళ్ళ కింద మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’లోని ‘పెన్నీ’ పాటలో ఇప్పటికే మెరిసింది సితార. అంతేకాదు ఆమె ‘ఫ్రోజెన్ 2’ అనే హాలీవుడ్ యానిమేషన్ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో బేబీ ఎల్సాకు డబ్బింగ్ చెప్పింది సితార. తన మొదటి రెమ్యూనరేషన్ కోటి రూపాయలను విరాళంగా ఇచ్చి చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకుంది సితార. ఇలా సినిమాల్లోకి అఫీషియల్ ఎంట్రీ ఇవ్వలేదనే మాటే గానీ.. అన్ అఫీషియల్‌గా మాత్రం అప్పుడే స్టార్ అయిపోయింది సితార. దాన్ని ఫ్యూచర్‌లో కంటిన్యూ చేస్తే చాలు.. వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే ఉండదు..!