బ్రేకింగ్: జగన్ కు మ్యూజిక్ స్టార్ట్, ఈడీ సంచలనం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులను ఈడీ జప్తు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులను ఈడీ జప్తు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతి సిమెంట్స్ కార్పొరేషన్ కు సంబంధించి ఈ డి కీలక ఉత్తర్వులను జారీ చేసింది. పునీత్ దాల్మియా కంపెనీలకు చెందిన మొత్తం 793 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. దాల్మియా భారత్ ఆస్తులను జప్తు చేసిన ఈ డి.. ఆస్తుల్లో దాదాపు 377 కోట్లు విలువైన భూమి భారతి సిమెంట్స్ లో క్విడ్ ప్రో కో జరిగిందన్న విషయాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది.
కడప జిల్లాలో అక్రమంగా సున్నపురాయి గనులు, భారతీయ సిమెంట్స్ లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడి పెట్టిందని 2011లో సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. 2013లో చార్జిషీట్ దాఖలు చేశారు. సిబిఐ ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈ కేసులో ఈడి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి.. భారతీ సిమెంట్స్ లో పెట్టుబడులు పెట్టిన వారిపై దర్యాప్తు జరిపింది. సన్నపు రాయి గనుల లీజులో ఆయాచిత లబ్ధి పొందిన వారి ఆస్తులను కూడా జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
పునీత్ దాల్మియాకు విజయసాయిరెడ్డికి మధ్య డీల్ కుదిరింది అన్న విషయాన్ని సిబిఐ అప్పట్లో చెప్పింది. ఫ్రాన్స్ కు చెందిన పాసిఫామ్‌కు వాటాలో కొంత భాగాన్ని దాల్మియాకు అమ్మినట్లుగా గుర్తించారు. వచ్చిన సొమ్ములో 55 కోట్ల రూపాయలను జగన్ కు బదిలీ చేశారని సిబిఐ తమ అభియోగాల్లో పేర్కొంది. 2010 నుంచి 2011 మధ్య హవాలా ద్వారా లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు. ఐటీ సోదాల్లో.. డీల్ కు సంబంధించిన వివరాలు ఆధారాలను గుర్తించారు. దీంతో మొత్తం 793 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది ఈడి.