తెలుగోడిపై గంభీర్ కుట్ర…!
ఒకపక్క అందరూ ఐపిఎల్ తో బిజీగా ఉన్న సమయంలో భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్, ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి..

ఒకపక్క అందరూ ఐపిఎల్ తో బిజీగా ఉన్న సమయంలో భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్, ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి.. భారత జట్టు మేనేజ్మెంట్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు తెచ్చాయి. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. భారత క్రికెట్ ప్రమాణాలను మాజీ కోచ్ ద్రావిడ్, మూడేళ్లుగా ఎక్కడకొ తీసుకు వెళితే గంభీర్ మొత్తం నాశనం చేశాడని మండిపడ్డారు.
దీనిపై సోషల్ మీడియాలో ఇప్పటికీ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో అలాగే ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ తిరుగులేని విజయాలు సాధించినా సరే.. గంభీర్ మాత్రం హెడ్ కోచ్ గా పనికిరాడు అంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇక తాజా గంభీర్ చేసిన ఓ నిర్వాహకంపై అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. తనను తాను కాపాడుకోవడానికి బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ లను గంభీర్ పక్కన పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి.
అభిషేక్ నాయర్ బ్యాటింగ్ కోచ్ గా జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించలేకపోయినా.. ఫీలింగ్లో మాత్రం టీ దిలీప్ అంచనాలకు మించి రాణించాడు. ద్రావిడ్ ప్రధాన కోచ్ గా ఉన్న సమయంలో కూడా దిలీప్ ఫీల్డింగ్ కోచ్ గా సేవలు అందించాడు. ఆ తర్వాత బీసీసీ అతనిపై నమ్మకంతో మళ్ళీ కోచ్ గా కంటిన్యూ చేసింది. ఫీల్డింగ్ పరంగా భారత్ పై పెద్దగా విమర్శలు వచ్చిన సందర్భాలు లేవు. టి 20 ప్రపంచ కప్ లో భారత్ గెలవడానికి కూడా ఫీల్డింగ్ కారణం. దీనితో ఇప్పుడు కూడా తెలుగువాడు భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలను మరింత పెంచుతాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు తనని తాను కాపాడుకోవడానికి గంభీర్.. అభిషేక్ నాయర్, దిలీప్ సహా కొంతమంది పై వేటు వేయించాడు అని మండిపడుతున్నారు.