అమెరికన్లను బంగ్లాదేశ్ వెళ్లొద్దన్న ట్రంప్, ఇండియా యుద్ధానికి సిద్ధం అవుతోందా?
2.2 కోట్ల హిందూ జనాభా 1.3 కోట్లకు పడిపోయింది. ఏడు దశాబ్దాల కాలంలో పెద్ద ఎత్తున మత మార్పిళ్లు జరిగాయి. మతం మారకపోతే నరకం చూపించిన సందర్భాలూ ఉన్నాయి.

2.2 కోట్ల హిందూ జనాభా 1.3 కోట్లకు పడిపోయింది. ఏడు దశాబ్దాల కాలంలో పెద్ద ఎత్తున మత మార్పిళ్లు జరిగాయి. మతం మారకపోతే నరకం చూపించిన సందర్భాలూ ఉన్నాయి. షేక్ హసీనా సర్కార్ కూలిన తర్వాత జరుగుతున్న మారణకాండ గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగిన ప్రతిసారీ మోడీ సర్కార్ ప్రశ్నిస్తోంది. కానీ, హిందూ వ్యతిరేకి యూనస్.. భారత విజ్ఞప్తులను లెక్క చేయడం లేదు. పైగా భారత్‌లో మైనారిటీల అణచివేత జరుగుతోంద ని కారు కూతలు కూస్తోంది. ముర్షీదాబాద్ అల్లర్లపైనా కన్నింగ్ కామెంట్లు చేసింది. దీనికి మోడీ సర్కార్ సైతం అదే స్థాయిలో బదులిచ్చింది. కానీ, ఇలా ఎంత కాలం? ఏం చేస్తే యూనస్ సర్కార్ దారికొస్తుంది? టాప్ స్టోరీలో చూద్దాం..
ఫిబ్రవరి 13న ఐక్యరాజ్యసమితి ఒక నివేదిక బయటపెట్టింది. బంగ్లాదేశ్‌లో గతేడాది అక్కడి హిందువులు, అహ్మదీయ ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు ఇతర తెగలకు చెందిన పౌరులు మానవ హక్కులు ఉల్లంఘనలకు గురయ్యాయని ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది. జాతి వివక్ష వ్యతిరేక నిరసనల సందర్భంగాను, ఆ తర్వాత ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపింది. బంగ్లాదేశ్‌లో హసీనా సర్కార్ పతనమయ్యాక హిందూవులకు చెందిన గృహాలు, వ్యాపారాలు, ఆలయాలపై భారీగా దాడులు జరిగాయి. ముఖ్యంగా ఠాకుర్‌గావ్, లాల్‌మొనిర్‌హట్, దినాజ్‌పుర్, సిల్హెట్, కుల్నా, రంగ్‌పుర్ వంటి చారిత్రక ప్రాంతాలతోపాటు గ్రామాల్లో ఈ దారుణాలు చోటు చేసుకున్నాయి. అవామీలీగ్ మద్దతుదారులు లక్ష్యంగా ఈ విధ్వంసం జరిగిందని ‘ద ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్యాక్ట్-ఫైండింగ్’ నివేదిక తేల్చింది. మత ఘర్షణలకు భయపడి పలు గ్రామాలకు చెందిన సుమారు 4వేల మంది హిందువులు భారత్ సరిహద్దు వద్ద ఆశ్రయం పొందారని తెలిపింది. మైనారిటీలపై ఇన్ని దురాగతాలకి పాల్పడుతున్న ఒక దేశానికి.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ప్రశ్నించే అర్హత ఉందా? సిగ్గూ ఎగ్గూ లేని యూనస్ ప్రభుత్వం ఆ పని చేసింది.
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలు ముర్షిదాబాద్‌లో హింసాత్మకంగా మారాయి. ఆ హింసలో ఇద్దరు హిందువులు దారుణ హత్యకు గురయ్యారు. తండ్రీకొడుకులను ఇంట్లో నుంచి బయటకు లాగి మరీ దారుణంగా హత్య చేశారు. తర్వాత అల్లర్లు మరింత ఉధృతమయ్యాయి. ఈ వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం బంగ్లాదేశ్‌కు లేదు.. స్పందించే అర్హత కూడా యూనస్ ప్రభుత్వానికి లేదు. అయినప్పటికీ బెంగాల్ హింసపై బంగ్లాదేశ్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం రియాక్ట్ అయ్యాడు. భారత్‌లోని మైనారిటీలను రక్షించేందుకు కేంద్రంతో పాటు పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. నిజానికి బెంగాల్ హింసలో నష్టపోయింది, నలిగిపోయిందీ మైనారిటీలు కాదు, హిందువులు. ముర్షీదాబాద్ హింస తర్వాత ఏకంగా 400 హిందూ కుటుంబాలు ప్రాణ భయంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయాయి. ఇది తెలిసి కూడా యూనస్ సర్కార్.. మైనారిటీలను రక్షించాలంటూ మోడీ సర్కార్‌ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేసింది. దీనికి భారత్ కూడా అంతే దీటుగా బదులిచ్చింది.
యూనస్ సర్కార్‌కు మోడీ ఇచ్చిన కౌంటర్ ఇదే. అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడానికి బదులు బంగ్లా తమ దేశంలోని మైనార్టీల హక్కులను కాపాడటంపై దృష్టి సారించాలని విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ హితవు పలికారు. “పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఘటనలకు సంబంధించి బంగ్లా అధికారులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వారి వ్యాఖ్యలు అర్థరహితమైనవి. ఆ దేశంలోని మైనారిటీలపై జరుగుతున్న హింస గురించి భారత్ తన ఆందోళనను తెలుపుతోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి బదులు వారు తమ సొంత దేశంలో మైనారిటీల హక్కులను కాపాడటంపై దృష్టిసారిస్తే మంచిది” అని ప్రకటనలో పేర్కొన్నారు. ఇలా కౌంటర్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే బంగ్లాదేశ్‌లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న హిందూ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు భబేశ్ చంద్రరాయ్‌ను అత్యంత దారుణంగా హతమార్చారు.
ఉత్తర బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పుర్‌కు చెందిన 58 ఏళ్ల భబేశ్ చంద్రరాయ్‌కు ఈ నెల 17న సాయంత్రం ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాను ఇంట్లోనే ఉన్నానని భబేశ్ అవతలి వ్యక్తికి చెప్పారు. అరగంట తర్వాత నలుగురు వ్యక్తులు ఆయన ఇంటికి వచ్చి బలవంతంగా తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గాలింపుచర్యలు చేపట్టిన పోలీసులకు నరబరి గ్రామంలో భబేశ్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కన్పించారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారు. ఈ ఘటనపైనా మోడీ సర్కార్ తీవ్రంగా స్పందించింది. ‘బంగ్లాలో హిందూ మైనార్టీ నేత భబేశ్ చంద్ర రాయ్ కిడ్నాప్, దారుణ హత్య గురించి మా దృష్టికి వచ్చింది. బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వపాలనలో హిందూ మైనారిటీలపై జరుగుతోన్న దాడుల్లో ఇది ఇంకో ఘటన. గతంలో ఈ తరహా దాడులకు పాల్పడిన వారు ఎలాంటి శిక్ష లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ ఘటనను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలాంటి సాకులు, వివక్ష లేకుండా మైనారిటీలను రక్షించే బాధ్యత ఈ తాత్కాలిక ప్రభుత్వం నిర్వహించాలని మరోసారి గుర్తు చేస్తున్నాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తన ప్రకటనలో స్పష్టం చేశారు.
హిందువులపై దాడుల విషయంలో యూనస్ సర్కార్‌ను నిలదీయడం కొత్తేం కాదు.. యూనస్ సర్కార్ లెక్కచేయకపోవడమూ కొత్త కాదు. మరి ఏం చేస్తే బంగ్లాదేశ్ దారికొస్తుంది? అంతర్జా తీయ సమాజం మద్దతు కూడగట్టి బంగ్లాదేశ్‌ను దారికి తెచ్చుకోవడం మన ముందున్న మొదటి ఆప్షన్. ఇప్పటికే మోడీ సర్కార్ ఆ దిశగా ప్రయత్నాలు తీవ్రం చేసింది. ఇటీవల ట్రాన్స్‌షిప్‌మెంట్ ఫెసిలిటీ రద్దు చేసి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు భారత్ సాయం అవసరం ఏంటో తెలిసేలా చేసింది. అమెరికా వంటి మిత్ర దేశాలనూ ఢాకాకు దూరం చేస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను అమెరికా కూడా ప్రశ్నించింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం తమ దేశ పౌరులను బంగ్లాదేశ్‌కు వెళ్లొద్దని అడ్వైజరీ జారీ చేసింది. ఐక్యరాజ్యసమితి ఆల్రెడీ మైనారిటీల అణచివేతలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు కూడా యూనస్ దారికి రాకపోతే దాడి చేయడం ఒక్కటే భారత్ ముందున్న ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే, బంగ్లాదేశ్‌లో హిందువులపై అరాచకాలు మోడీ ప్రభుత్వంపైనా తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. 1971లో పాక్ నుంచి స్వేచ్ఛ కల్పించిన భారత్‌కు బంగ్లా బెండు తీయడం పెద్ద విషయం కాదు.