ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ ,చెన్నై కథ ముగిసినట్టేనా ?

ఐపీఎల్ 18వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. టైటిల్ ఫేవరెట్ గా భారీ అంచనాలతో బరిలోకి దిగిన సీఎస్కే ఆరో ఓటమిని చవిచూసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2025 | 07:00 PMLast Updated on: Apr 21, 2025 | 7:00 PM

Rohit Dhanadhans Hitman Record Against Chennai 2

ఐపీఎల్ 18వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. టైటిల్ ఫేవరెట్ గా భారీ అంచనాలతో బరిలోకి దిగిన సీఎస్కే ఆరో ఓటమిని చవిచూసింది. వాంఖడే స్టేడియం వేదికగా బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం పాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మరోసారి చెన్నై టాపార్డర్ ఆశించిన మేర రాణించలేకపోయింది. శివమ్ దూబే, జడేజా హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో పర్వాలేదనిపించే స్కోరు చేసింది.

53 పరుగులు చేసిన జడేజా టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముంబై బౌలర్లలో బుమ్రా రెండు.. సాంట్నర్, అశ్వని కుమార్, దీపక్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు. ఛేజింగ్ లో ముంబై 15.4 ఓవర్లలో వికెట్ కోల్పోయి టార్గెట్ ను ఫినిష్ చేసింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ హోంగ్రౌండ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో మ్యాచ్ వన్ సైడ్ గా ముగిసింది. ఈ ఓటమితో చెన్నై తన ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్ లో ఆ జట్టుకు ఇది ఆరో ఓటమి.. మొత్తం 8 మ్యాచ్ లు ఆడిన సీఎస్కే కేవలం రెండు విజయాలనే అందుకుంది. చెన్నై రన్ రేట్ కూడా దారుణంగా ఉంది. ప్రస్తుతం -1.392 రన్ రేట్ తో చెన్నై పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచింది.

ఈ టోర్నీలో చెన్నైసూపర్ కింగ్స్ ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఆరు మ్యాచ్ లలోనూ విజయం సాధిస్తేనే సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒక్క మ్యాచ్ ఓడితే ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. అదే సమయంలో రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌లు ఓడితే మాత్రం అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

మిగిలిన ఆరు మ్యాచ్ లలో చెన్నై మూడింటిన హోంగ్రౌండ్ లో ఆడనుండడం కాస్త అడ్వాంటేజ్… చెన్నై సూపర్ కింగ్స్ తమ తర్వాతి మ్యాచ్‌లను సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ, కోల్ కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ , గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. ప్రస్తుతం చెన్నై ఫామ్ చూస్తుంటే ఆ జట్టు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.