చెన్నైపై రోహిత్ ధనాధన్ హిట్, మ్యాన్ రికార్డుల మోత

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పాత హిట్ మ్యాన్ గుర్తు చేస్తూ సిక్సర్ల మోత మోగించాడు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2025 | 06:00 PMLast Updated on: Apr 21, 2025 | 6:00 PM

Rohit Dhanadhans Hitman Record Against Chennai

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పాత హిట్ మ్యాన్ గుర్తు చేస్తూ సిక్సర్ల మోత మోగించాడు.వరుస వైఫల్యాలకు చెక్ పెడుతూ.. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన రోహిత్ శర్మ రికార్డుల మోత మోగించాడు. టీ20 క్రికెట్‌లో భారత గడ్డపై అత్యధిక సిక్స్‌లు బాదిన తొలి ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ అరుదైన ఘనత‌ను సొంతం చేసుకున్నాడు. ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 పరుగులతో చెలరేగాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో సీఎస్‌కేను చిత్తు చేసింది.

తాజా మ్యాచ్‌లో 6 సిక్స్‌లు బాదిన రోహిత్ శర్మ.. యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అరుదైన ఘనతను అధిగమించాడు. టీ20 క్రికెట్‌లో ఒకే దేశంలో అత్యధిక సిక్స్‌లు నమోదు చేసిన బ్యాటర్‌గా క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డ్‌ను రోహిత్ తాజా ఇన్నింగ్స్‌తో బ్రేక్ చేశాడు. వెస్టిండీస్ గడ్డపై క్రిస్ గేల్ 357 సిక్స్‌లు కొట్టగా.. రోహిత్ శర్మ భారత్ లోనే 361 సిక్స్‌లు బాదాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ , మహేంద్ర సింగ్ ధోనీ, కీరన్ పోలార్డ్, సంజూ శాంసన్, నికోలస్ పూరన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇదిలా ఉంటే ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకుంది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డ్స్ గెలుచుకున్న ఆటగాడిగానూ రోహిత్ రికార్డ్ సాధించాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ 20 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ గెలుచుకోగా.. విరాట్ కోహ్లీ 19, మహేంద్ర సింగ్ ధోనీ 18 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డ్స్ అందుకున్నారు. ఇందులో సీఎస్‌కే, కేకేఆర్‌పై ఐదేసి సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్న రోహిత్.. ఆర్‌సీబీ‌పై 4 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.కాగా చెన్నై సూపర్ కింగ్స్‌పై అత్యధిక సార్లు 50 ప్లస్ రన్స్ చేసిన ఆటగాడిగానూ హిట్ మ్యాన్ నిలిచాడు.