ఫిలిప్పీన్స్, వియత్నాంకు భారత బ్రహ్మాస్త్రం ,బ్రహ్మోస్‌తో చైనాను రౌండప్ చేసిన భారత్

తనవరకు వస్తే తప్ప నొప్పేంటో తెలీదని నానుడి. చాన్నాళ్లుగా ఆక్రమణకాంక్షతో రగిలిపోతున్న డ్రాగన్ కంట్రీకి కూడా ఆ నొప్పేంటో తెలియడం లేదు. ఇ

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 19, 2025 | 03:30 PMLast Updated on: Apr 19, 2025 | 3:30 PM

India Rounds Up China With Brahmastra And Brahmos For Philippines And Vietnam

తనవరకు వస్తే తప్ప నొప్పేంటో తెలీదని నానుడి. చాన్నాళ్లుగా ఆక్రమణకాంక్షతో రగిలిపోతున్న డ్రాగన్ కంట్రీకి కూడా ఆ నొప్పేంటో తెలియడం లేదు. ఇతర దేశాల భూభాగాల కోసం కుట్రలు చేస్తోంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం బీజింగ్ చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్నీ కావు. ఆర్ధిక సాయం పేరుతో శ్రీలంకను కీలు బొమ్మగా మార్చేసుకుంది. మహ్మద్ ముయిజ్జు అధ్యక్షుడు కాగానే మాలేను తన అడ్డగా చేసుకుంది. బంగ్లాదేశ్, నేపాల్ తదితర భారత పొరుగు దేశాలన్నింట్లోనూ డ్రాగన్ డర్టీ స్ట్రాటజీలు ఇలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఈ విషయంలో కాస్త ఆచి తూచి వ్యవహరిస్తూ వచ్చిన భారత్ ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రాన్ని ఫాలో అవ్వాలని డిసైడ్ అయింది. అంటే హిందూ మహాసముద్రంలో డ్రాగన్ దూకుడుకు, దక్షిణ చైనా సముద్రంలో చెక్ పెట్టడం అన్నమాట. అందు కోసం మోడీ సర్కార్ ఏం చేసిందో తెలుసా? టాప్ స్టోరీలో చూద్దాం..

గతేడాది ఇదే సమయంలో దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ను నిలువునా వణికించిన విజువల్స్ ఇవే. నిత్యం ఫిలిప్పీన్స్‌పై రెచ్చిపోయి దాడులు చేస్తున్న వేళ.. ఆ దేశానికి భారత్ అండగా నిలిచింది. మన బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిస్సైల్‌ను ఫిలిప్పీన్స్‌కు అప్పగించింది. భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి వ్యవస్థలను ఫిలిప్పిన్స్ మెరైన్ కార్పొరేషన్‌కు అప్పగించింది. బ్రహ్మోస్ క్షిపణులకోసం భారత్, ఫిలిప్పిన్స్ మధ్య 2022జనవరిలో 375 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఈ డీల్‌లో భాగంగా 3 ఎక్స్‌పోర్ట్ వేరియంట్ల బ్రహ్మోస్ మిస్సైల్ వెపన్ సిస్టమ్‌లను మనీలాకు అందజేశారు. ఒక్కో సిస్టమ్‌లో రెండు మిస్సైల్ లాంఛర్లతో పాటు ఓ రాడార్, ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఈ మిస్సైల్ లాంఛర్ల నుంచి కేవలం పది సెకన్ల వ్యవధిలోనే రెండు మిస్సైళ్లను ప్రయోగించొచ్చు. హిందూ మహాసముద్రంలో చైనా దూకుడుకు, సౌత్ చైనా సముద్రంలో చెక్ పెట్టే వ్యూహంలో ఇది తొలి అడుగు మాత్రమే. ఫిలిప్పీన్స్‌కు క్షిపణులు అందించిన అదే ఏడాదే డ్రాగన్ దిమ్మతిరిగి పోయే మరో వ్యూహం అమలు చేసింది భారత్. ఆ వ్యూహం మరేదో కాదు ఫిలిప్పీన్స్‌కు ఇచ్చినట్టే దక్షిణ చైనా సముద్ర తీరాన్ని పంచుకునే ఇతర దేశాలకూ బ్రహ్మోస్ క్షిపణులను అందివ్వడం.

వియత్నాం.. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా బాధిత దేశాల్లో ఇది కూడా ఒకటి. 2024 ఆగస్టులో ఆ దేశ ప్రధాని ఫామ్ మిన్ చిన్హ్ భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటన లక్ష్యం దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా భారత్‌ నుంచి సాయం పొందడమే. భారత్, వియత్నాం మధ్య శతాబ్దాల చారిత్రక, నాగరికత సంబంధాలున్నాయి. అవి 2018 తర్వాత మరింత బలపడ్డాయి. అందుకు కారణం డ్రాగన్ కంట్రీ చైనానే. సౌత్ చైనా సముద్రంలో తమను తీవ్రంగా వేధిస్తున్న చైనాకు భారత్ మాత్రమే చెక్ పెట్టగలదని వియత్నాం నమ్మింది. రక్షణ రంగంలో మోడీ సర్కార్ సహకారాన్ని కోరుకుంటున్నామని ఆ దేశం పదే పదే చెబుతోంది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదని చైనా వాదిస్తోండగా.. తీర దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ చైనా సముద్రంలోని అపార చమురు, సహజవాయు నిక్షేపాలను వెలికి తీయడం కోసం భారత్ పెట్టుబడులు పెట్టాలని 2018లో వియత్నాం ఆహ్వానించింది. నాటి నుంచీ భారత్-వియత్నాం అధినేతలు కలుస్తున్నారంటేనే బీజింగ్‌లో వణుకు మొదలవుతుంది. కానీ, సౌత్ చైనా సముద్రంలో తన కుట్రలను మాత్రం ఆపడంలేదు.

2022లో రాజ్‌నాథ్ సింగ్ వియత్నాంలో పర్యటించారు. ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో కీలక మలుపు అదే. ఆ పర్యటనలో రాజ్‌నాథ్ సింగ్ కోసం వియత్నాం అధ్యక్షుడు నుగుయెన్ జువాన్ ఫుసి ప్రోటోకాల్ నిబంధనలు పక్కన పెట్టి మరీ రాజ్‌నాథ్ చూసేందుకు వచ్చారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా.. భారత్, వియత్నాం సంతకాలు చేశాయి. ఇరు దేశాల సైన్యం తమ మిలటరీ బేస్‌లను పరస్పరం ఉపయోగించుకునేలా ఇండియా, వియత్నాం డీల్ చేసుకున్నాయి. మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ కోసం వియత్నాం ఒప్పందం కుదు ర్చుకున్న తొలి దేశంగా భారత్ అవతరించింది. ఈ ఒప్పందం ఫలితంగా ఇండియా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు ఇంధనం నింపుకోవడం కోసం, రిపేర్లు, ఇతర అవసరాల కోసం వియత్నాం మిలటరీ బేసులను భారత్ ఉపయోగించుకునే సౌలభ్యం ఉంటుంది. అంటే, చైనాతో యుద్ధం అంటూ వస్తే వియత్నాం మిలిటరీ బేస్‌ల నుంచి దాడులు చేయడానికి మనకు అవకాశం దొరుకుతుందన్నమాట. ఈ నిర్ణయం ఇప్పటికీ డ్రాగన్‌ను కలవరపెట్టేదే. కానీ, భారత్-వియత్నాం మధ్య అంతకుమించిన మరో డీల్‌కు రంగం సిద్ధమైంది. ఆ ఒప్పందం పూర్తయితే చైనా నిలువునా వణకడం ఖాయం.

గతేడాది ఫిలిప్పీన్స్ భారత బ్రహ్మాస్త్రం అందిన అదే సమయంలో వియత్నాంకు డెడ్లీ బ్రహ్మోస్ విక్రయాలకు రంగం సిద్ధమైంది. వియత్నాంతో 700 మిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు మోడీసర్కార్ రెడీ అయ్యింది. ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థల్ని నేవీలో చేర్చుకున్న రెండవ దేశంగా వియత్నాం అవతరిస్తుంది. 290 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ క్షిపణి వ్యవస్థ వియత్నాం తన సముద్ర సరిహద్దులను రక్షించుకోవడానికి, దక్షిణ చైనా సముద్రంలో చైనా యుద్ధనౌకల నుండి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి వీలు కల్పిస్తుంది. వియత్నాంతో ఈ డీల్ ఇప్పుడే తెరపైకి రావడం కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ట్రంప్ టారిఫ్స్ నుంచి బయట పడటానికి ఇటీవలే చైనా అధినేత వియత్నాంలో పర్యటించారు. ఆ పర్యటన జరిగి వారం కూడా పూర్తి కాకముందే ఆ దేశం భారత్‌తో బ్రహ్మోస్ ఒప్పందంపై చర్చలు వేగవంతం చేసింది. ఇక ఫిలిప్పీన్స్, వియత్నాం తర్వాత ఇండోనేసియా కూడా భారత బ్రహ్మాస్త్రాన్ని కొనుగోలు చేయాలనుకుంటోంది. సో.. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం రెచ్చిపోతున్న డ్రాగన్ కంట్రీని బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ రౌండప్ చేస్తోందన్నమాట.