ఆ క్రికెటర్ చెల్లితో లవ్ ఎఫైర్, ధావన్ డేటింగ్ ఆమెతోనేనా ?

టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ క్రికెట్‌కు దూరం అయి రెండేళ్లకు పైగానే అవుతోంది. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధావన్ లెజెండ్స్ లీగ్, మాస్టర్స్ లీగ్ వంటి వాటిలో ఆడుతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2025 | 07:00 PMLast Updated on: Apr 16, 2025 | 7:00 PM

Is Dhawan Dating The Cricketers Sister

టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ క్రికెట్‌కు దూరం అయి రెండేళ్లకు పైగానే అవుతోంది. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధావన్ లెజెండ్స్ లీగ్, మాస్టర్స్ లీగ్ వంటి వాటిలో ఆడుతున్నాడు. అదే సమయంలో పలు ఇంటర్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. తన లవ్ స్టోరీస్ తోనూ గబ్బర్ వార్తల్లో నిలుస్తున్నాడు. ధావన్ ప్రస్తుతం సోఫీ షైన్‌ అనే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి తరచూ దర్శనం ఇస్తున్నారు. సోఫీ షైన్ ఐర్లాండ్‌కు చెందిన ఒక ప్రొడక్ట్ కన్సల్టెంట్. ఆమె ధావన్‌తో కలిసి దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో కనిపించడంతో వారిద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అప్పటి నుండి వారిద్దరూ కలిసి పలుమార్లు కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే తాజాగా ఓ షాకింగ్ వార్త ఒకటి వైరల్ అవుతుంది. ధావన్‌ డేటింగ్ చేస్తుంది సోఫీ షైన్‌తో కాదని మరో అమ్మాయితో అనే ప్రచారం జరుగుతుంది.

ఇంగ్లాండ్ క్రికెటర్ లివింగ్‌స్టన్ సోదరి లియానా లివింగ్‌స్టన్‌తో ధావన్‌ రిలేషన్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది.ఇటీవల జరిగిన టైమ్స్ నౌ సమ్మిట్ 2025లో తన ప్రేమ జీవితం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ధావన్ తాను ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నానని పరోక్షంగా వెల్లడించాడు. అయితే, తన భాగస్వామి పేరును నేరుగా చెప్పకుండా, ఈ గదిలో ఉన్న అందమైన అమ్మాయే నా గర్ల్‌ఫ్రెండ్ అని చమత్కారంగా బదులిచ్చాడు. ఆ సమయంలో కెమెరాలు సోఫీ షైన్‌పై కేంద్రీకరించగా, ఆమె సిగ్గుపడుతూ కనిపించింది.
అయితే ఈ ఇంటర్య్వూలో సోఫీ షైన్‌తో పాటు లియానా లివింగ్‌స్టన్‌ కూడా హాజరయ్యారని తెలుస్తోంది. దీంతో ధావన్ ప్రస్తుతం ఆమెతో ప్రేమలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ధావన్ గతంలో ఐపీఎల్‌లో పంజాబ్ జట్టుకు ప్రతినిధ్యం వహించాడు. లివింగ్‌స్టన్ కూడా అదే తరుఫున ఐపీఎల్ ఆడుతున్నాడు. దీంతో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటానికి లివింగ్‌స్టన్ సోదరి లియానా లివింగ్‌స్టన్‌ ఇండియాకు వచ్చిందని , ఆ సమయంలోనే ధావన్‌,లియానా లివింగ్‌స్టన్‌ మధ్య పరిచయం ఏర్పడిందని అనుకుంటున్నారు. దీనిపై ఎటువంటి క్లారిటీ లేనప్పటికి.. తాజాగా వీరు కలిసి దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శిఖర్ ధావన్‌ తన భార్య అయేషా ముఖర్జీతో ధావన్ విడాకులు తీసుకున్నారు. భార్యతో విడాకులు తీసుకున్న అనంతరం ధావన్ లియానా లివింగ్‌స్టన్‌తో రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. కాగా భారత జట్టుకు ధావన్ 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ ట్వంటీల్లో ప్రాతినిథ్యం వహించాడు. అలాగే 222 ఐపీఎల్ మ్యాచ్ లలోనూ ఆడాడు.