12000 కోట్ల ప్రెస్ మీట్.. 55000 థియేటర్స్ లో గ్లింప్స్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటలీ వెకేషన్ నుంచి వచ్చేశాడు. హైద్రబాద్ లో ల్యాండ్ అయ్యాడు. దీంతో ఇక ఎస్ ఎస్ ఎమ్ బీ 29 వ మూవీ ప్రెస్ మీట్ కి రంగం సిద్దమైనట్టే నని తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటలీ వెకేషన్ నుంచి వచ్చేశాడు. హైద్రబాద్ లో ల్యాండ్ అయ్యాడు. దీంతో ఇక ఎస్ ఎస్ ఎమ్ బీ 29 వ మూవీ ప్రెస్ మీట్ కి రంగం సిద్దమైనట్టే నని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 55 వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోయే, మొట్ట మొదటి ఇండియన్ మూవీ తాలూకు ప్రెస్ మీట్ అంటే, అందరి అటెన్షన్ అటు వైపే ఉంటుంది. ప్రెస్ మీట్ లో కాన్సెప్ట్, స్టార్ కాస్ట్, టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఉంటుందనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. లాంచింగ్ అయితే సీక్రెట్ గా చేశారు. కాని ప్రెస్ మీట్ లో మాత్రం చాలా విషయాలు తేల్చేస్తారనే అంచనాలున్నాయి. ఇలాంటి టైంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 మూవీ గ్లింప్స్ బాంబులా పేలే ఛాన్స్ కనిపిస్తోంది. అసలు టైటిలే ఏంటో తేల్చకుండా గ్లింప్స్ వదులుతున్నారా? ప్రోమో వచ్చే డేటేంటి? 55 సెకన్ల గ్లింప్స్ కి సూపర్ స్టార్ మహేశ్ బాబు డబ్బింగ్ చెప్పటమే మిగిలిందా..? టేకేలుక్
సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ కొత్త షెడ్యూల్ ప్లాన్ జరుగుతోంది.జనవరిలో మొదలై ఈ సినిమా ఇప్పటికి 3 షెడ్యూల్స్ షూటింగ్ పూర్తిచేసుకుంది. చిన్న బ్రేక్ ఇచ్చి ఇటలీకి వెళ్లిన మహేశ్ బాబు, ఇప్పడు తిరిగి హైద్రబాద్ చేరుకున్నాడు. ప్రియాంక చోప్రాకూడా యూఎస్ కి వెళ్లి తిరిగొస్తోంది.. రాజమౌళి రాక తర్వాత కొత్త షెడ్యూల్ మొదలౌతుందనుకున్నారు.కాని ముందుగా జరగబోయేది ప్రెస్ మీట్.. ఈ ప్రెస్ మీట్ కోసమే ఇండియన్ మీడియా తెగ వేయిట్ చేస్తోంది. రాజమౌళి ఏం ఎనౌన్స్ చేస్తాడు..? టైటిలా, స్టార్ కాస్టా..? లేదంటే కాన్సెప్ట్ ఏమైనా రివీల్ చేస్తాడా..?అన్న డౌట్లు మీడియాలోనే కాదు, ఫ్యాన్స్ లో కూడా ఉన్నాయి. వాటినే ఎనౌన్స్ మెంట్ తో క్లియర్ చేయటానికి ఇంటర్నేషనల్ మీడియాను కూడా పిలిపించాడు.
మొత్తానికి మండే రోజున సూపర్ స్టార్ మహేశ్ బాబు 29వ మూవీ ప్రెస్ మీట్ జరగొచ్చు… అయితే ఈలోపు ఒక న్యూస్ షాకిస్తోంది. 55 సెకన్ల డ్యూరేషన్ తో ఓ గ్లింప్స్ ని ఫిల్మ్ టీం రెడీ చేసిందట. దానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు డబ్బింగ్ చెబితే సరిపోతుందట. ఆల్రెడీ ఎడిట్ చేసిన అంతా రెడీ చేసిన ఆ గ్లింప్స మరేంటో కాదు, షూటింగ్ టైంలో లీకైన వీడియోనే ఇప్పుడు గ్లింప్స్ రూపంలో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.2027 లో రిలీజ్ అయ్యే సినిమా అంటే, ఆల్ మోస్ట్ రెండేళ్ల తర్వాత విడుదలయ్యే సినిమాకు సంబంధించిన, గ్లింప్స్ లేదంటే ప్రోమో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉండదు.. ఏదో సినిమారిలీజ్ కి ఐదునెల్ల ముందో, రెండు నెల్ల ముందో గ్లింప్స్ రిలీజ్ చేస్తే ఏమో అనుకోవచ్చు.. కాని రిలీజ్ కి రెండేళ్ల ముందే గ్లింప్స్ ని రిలీజ్ చేయటం వెనక గట్టి స్ట్రాటజీనే ఉంది.
జనం, మీడియా, మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ మీడియా ఈ న్యూస్ కవర్ చేయాలంటే, వాళ్లకి కంటెంట్ కావాలి… సో ఇండియా నెంబర్ వన్ డైరెక్టర్ తీస్తున్న సినిమా ఇలా ఉంటుందని వాల్లకు రుచి చూపించాలి కాబట్టే, ప్రెస్ మీట్ టైంలో ఎస్ ఎస్ ఎమ్ బీ 29 గ్లింప్స్ ని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా 55 వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న తొలి ఇండియన్ మూవీగా, ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా ఈ సినిమాకు రికార్డు క్రియేట్ అవుతోంది. 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆల్రెడీ 5 వేల కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ని రీచ్ అయ్యిందని తెలుస్తోంది. ఇన్ని వింతలు, విశేషాలు ఉన్నాయి కాబట్టే, ఇంటర్నేషనల్ మీడియా మతిపోగొట్టేలా గ్లింప్స్ తో శాంపిల్ విసరబోతున్నాడు రాజమౌళి. ఇదోరకంగా మహేశ్ ఫ్యాన్స్ కి ఊహించని ఫీస్ట్ లాంటిది… మరో వారంలో ఈ వింత జరగబోతోంది.