బ్రేకింగ్: అసలు దొంగను నేను పట్టిస్తా విజయ్ సాయి షాకింగ్ ట్వీట్
ఏపీ లిక్కర్ కేసు పేపథ్యంలో మాజీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. లిక్కర్ స్కాంలో తన పాత్ర కేవలం విజిల్ బ్లోయర్ మాత్రమేనంటూ ట్వీట్ చేశారు.

ఏపీ లిక్కర్ కేసు పేపథ్యంలో మాజీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. లిక్కర్ స్కాంలో తన పాత్ర కేవలం విజిల్ బ్లోయర్ మాత్రమేనంటూ ట్వీట్ చేశారు. ఈ స్కాంకు సంబంధించిన వ్యవహారంలో తాను ఒక్క రూపాయి కూడా ముట్టలేదంటూ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకూ స్కాం దొంగల బట్టలు సగమే విప్పారని.. మొత్తం గుట్టు విప్పేందుకు తాను పూర్తిగా సహకరిస్తానంటూ ట్వీట్ చేశారు విజయ్‌సాయి. విజయ్‌సాయి రెడ్డి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ కేసులో ఇప్పటికే విచారణకు హాజరయ్యారు విజయ్‌సాయి రెడ్డి. విచారణ అనంతరం వైసీపీ మీద రాజ్ కేసిరెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌సాయి వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్ కేసిరెడ్డి కూడా ఆడియో రిలీజ్ చేశారు. తాను కూడా విచారణకు హాజరవుతానంటూ చెప్పారు. కానీ ఈ గ్యాప్‌లోనే కేసిరెడ్డిన పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో స్కాంకు సంబంధించిన మరిన్న కీలక విషయాలు బయటికి వస్తాయని అనుకుంటున్న నేపథ్యంలో విజయ్‌సాయి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది.https://x.com/vsreddy_mp?lang=en