ఓవర్ నైట్‌లో స్టార్స్ ఇప్పుడు మాత్రం కనుమరుగు
ఇంటర్నెట్ అనేది ఓ వింత ప్రపంచం ఎప్పుడు ఎవరు ఎందుకు స్టార్స్ అవుతారో ఎవరూ ఊహించలేరు. ఎప్పుడు ఎవరి జీవితాలు ఎలా మారిపోతాయో ఎవరూ అంచనా వేయలేరు. అలా ఇప్పటి వరకూ చాలా మంది ఓవర్ నైట్‌లో స్టార్స్‌గా మారిపోయారు.
ఇంటర్నెట్ అనేది ఓ వింత ప్రపంచం ఎప్పుడు ఎవరు ఎందుకు స్టార్స్ అవుతారో ఎవరూ ఊహించలేరు. ఎప్పుడు ఎవరి జీవితాలు ఎలా మారిపోతాయో ఎవరూ అంచనా వేయలేరు. అలా ఇప్పటి వరకూ చాలా మంది ఓవర్ నైట్‌లో స్టార్స్‌గా మారిపోయారు. అంతే ఫాస్ట్‌గా కాలగర్భంలో కలిసిపోయారు కూడా. ఈ లిస్ట్‌లో అందరికంటే ఫస్ట్ ఉండేది కుమారి ఆంటీ. మీ బిల్ మొత్తం తౌసెండ్ అయ్యింది అనే ఒకే ఒక్క రీల్‌తో కుమారి ఆంటీ ఫేమస్ అయ్యింది. వ్యూస్ కోసం పడి చచ్చిపోయే ఛానల్స్ అన్నీ కుమారి ఆంటీ ఇంటికి క్యూ కట్టాయి.
సింగిల్ నైట్‌లో ఆమెను స్టార్‌ను చేశాయి. దీంతో సినిమావాళ్లు కూడా కుమారి ఆంటీ పబ్లిసిటీని వాడుకున్నారు. కానీ చివరికి ఆమెకు మిగిలింది మాత్రం శూన్యం. ఒకప్పుడు ఆమెకు హైటెక్‌సిటీలో షాప్ ఐనా ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా లేదు. అసలు ఆమె ఎక్కడుందో ఏం చేస్తుందో కూడా ఎవరికీ తెలియదు. కొల్లాపూర్‌కు చెందిన బర్రెలక్క అలియాస్ శిరీష కూడా అంతే. బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వడంలేదంటూ ఆమె చేసిన రీల్‌తో ఆమెను స్టార్‌ను చేశారు నెటిజన్లు. దీంతో ఆమె ఏకంగా ఎన్నికల్లో పోటీ చేసేదాకా వెళ్లింది. పోటీ చేయడం తప్పు కాదు.. కానీ ఆమెను వైరల్ చేసిన వాళ్లు ఆమె గెలుపుకు మాత్రం కృషి చేయలేకపోయారు. ఇంటర్నెట్‌లో స్టార్‌ని చేసి రియల్ లైఫ్‌లో మాత్రం ఆమెను ఒక ఫెయిల్యూర్‌లా నిలబెట్టేశారు.
వీళ్లిద్దరి కంటే కుర్చీ తాత కథ చాలా దారుణం. కుర్చిని మడతపెట్టి అనే ఒక్క డైలాగ్‌తో రోడ్డుపక్కన ముష్టి ఎత్తుకునేవాన్ని కూడా సెలబ్రిటీని చేసింది ఈ ఇంటర్నెట్ ప్రపంచం. ఆదరిస్తే మంచిదే.. కానీ ఆ ఆదరణ ఎక్కడి వరకూ వెళ్లింది వాళ్లను ఏం చేసింది అనేది కూడా ముఖ్యం. ఇంటర్నెట్‌లో కుర్చీ తాత వైరల్‌గా ఉన్నన్ని రోజులూ ఆయనను ప్రతీ ఒక్కరూ ఇంటర్వ్యూలు చేశారు. ఆయనతో వీడియోలు, రీల్స్ చేశారు. కానీ ఆయన ఆరోగ్యం పాడై హాస్పిటల్‌లో చేరినప్పుడు మాత్రం ఒక్కరు కూడా పట్టించుకోలేదు. కేన్సర్‌తో హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న కుర్చీ తాత ఎప్పుడు ఏమైపోతాడో కూడా తెలియని సిచ్యువేషన్. ఒకప్పుడు ఆయనను అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించినవాళ్లు, ఆయన పేరు చెప్పుకుని ఫేమస్ ఐనవాళ్లు ఎవరూ ఇప్పుడు ఆయన పక్కన లేరు. ఏకాకిని చేసి వదిలేశారు. కాస్త అటూ ఇటూగా వేణుస్వామి కూడా వీళ్ల కోవలోకే వస్తాడు. చాలా కాలం నుంచి సినీ ఇండస్ట్రీలో పేరున్న పూజారి అయినప్పటికీ కామన్ పీపుల్‌కు వేణుస్వామి పెద్దగా తెలియదు.
సమంత నాగచైతన్య విడిపోతారని వేణు స్వామి చెప్పిన జోస్యం ఆయనను స్టార్‌ను చేసింది. ఆయన చెప్పినట్టే జరగడంతో ప్రతీ ఒక్కరూ వేణుస్వామిని హైలెట్ చేశారు. ఆ తరువాత పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి వేణుస్వామి కూడా తమ ఫేమ్ పెంచుకునే ప్రయత్నాలు చేశాడు. ఎప్పుడూ సెలబ్రిటీల జాతకాలు చెప్పడం. వాళ్లనే టార్గెట్ చేసినట్టు మాట్లాడటం ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలు పెట్టాడు. కానీ ఎప్పుడైతే ప్రభాస్ విషయంలో వేణుస్వామి చెప్పింది వ్యతిరేకంగా జరిగిందో అప్పుడే ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. వరుసబెట్టి ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామిని వేసుకోవడం మొదలుపెట్టారు. కొందరైతే కనిపిస్తే కొట్టేస్తారేమో అనిపించే స్థాయిలో వీడియోలు చేశారు. జాతకాలే చెప్పడమే వృత్తిగా పెట్టుకున్న వేణుస్వామి ఇక సెలబ్రెటీల జోలికే వెళ్లను అనే స్థాయినలో ఆయనకు ట్రీట్‌మెంట్ ఇచ్చారు. కరెక్ట్‌గా చూస్తే వీళ్లందరినీ ఓవర్ నైట్‌లో లేపింది ఇంటర్నెట్ యూజర్సే. అదే టైంలో వీళ్లను కనుమరుగు చేసింది కూడా నెటిజన్లే. ఇంటర్నెట్‌లో వచ్చిన కొద్దిపాటి ఫేంను చూసుకుని ఏదో చేయాలని ఏం చేయలేక కనుమరుగైపోయారు ఈ నలుగురు.