పొంగులేటి వర్సెస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ లో కొత్త సంక్షోభం

తెలంగాణ కాంగ్రెస్ లో ఏం ఏం జరుగుతుంది? పదిమంది ఎమ్మెల్యేలు సీక్రెట్ గా సమావేశం పెట్టి... మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో తాడోపేడో తేల్చుకుందామని అనుకున్నారంటే ఆ పార్టీలో కనిపించని సంక్షోభం ఏదో రగులుతోందని అర్థమవుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 4, 2025 | 11:05 AMLast Updated on: Feb 04, 2025 | 11:05 AM

Ponguleti Vs Mlas A New Crisis In Congress

తెలంగాణ కాంగ్రెస్ లో ఏం ఏం జరుగుతుంది? పదిమంది ఎమ్మెల్యేలు సీక్రెట్ గా సమావేశం పెట్టి… మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో తాడోపేడో తేల్చుకుందామని అనుకున్నారంటే ఆ పార్టీలో కనిపించని సంక్షోభం ఏదో రగులుతోందని అర్థమవుతుంది. ఒక సీనియర్ మంత్రి కి వ్యతిరేకంగా పార్టీ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టి…. హాయ్ కమాండ్ కి ఫిర్యాదు చేయాలని డిసైడ్ చేశారంటే… ఈ మీటింగ్ వెనక పెద్ద హస్తమే ఉంటుందని గుసగుస లు నడుస్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల రహస్య భేటీ పొగలు సెగలు పుట్టిస్తుంది. రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు పెట్టిన రహస్య సమావేశాన్నీ లీడ్ చేసింది ఎవరు..? ఆ ఎమ్మెల్యేల వెనుక ఉన్నదెవరు..? స్వతహాగానే సమావేశం ఏర్పాటు చేసుకున్నారా..? అసలు ఎందుకు మంత్రికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టాలి? ఇలా రకరకాల యాంగిల్స్ లో అటు సర్కార్ లోను ఇటు పార్టీలోనూ చర్చ నడుస్తోంది.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హైదరాబాదులోనీ ఓ హోటల్లో పదిమంది ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. క్యాబినెట్ లో కీలకమైన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహార శైలిని బయటకు తేవాలని ఈ రహస్య సమావేశం ఏర్పాటు చేసినట్లు వాళ్ళు చెప్తున్నారు. భూములకు క్లియరెన్స్ ఇచ్చే విషయంలో మంత్రికి ఎమ్మెల్యేలకు మధ్య వివాదం ఉంది అనేది ఆల్రెడీ బయటికి పొక్కింది. గడచిన కొద్ది రోజులుగా ఎమ్మెల్యేలు సమస్యని ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసిన అది సద్దుమనగలేదు. అందుకే ఈ విషయాన్ని హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లడానికి ముందస్తుగా మీటింగ్ పెట్టామని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న సమస్యలని అటెండ్ చేయటానికి పార్టీలో ఎవరు ముందుకు రాలేదా..? వచ్చినా… సమస్య పరిష్కారం కాలేదా ..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూర్తి స్థాయిలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని… తమకు సమాచారం లేకుండా అన్ని తానే చక్కబెట్టుకుంటున్నారంటూ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. రెవిన్యూ శాఖలో జరుగుతున్న అవినీతిపై సీఎం జోక్యం చేసుకోవాలని… లేదంటే ఎమ్మెల్యేలు ఇబ్బంది పడక తప్పదనే వాదనను బయటకు తీసుకురావాలన్నది ఎమ్మెల్యేలు వ్యూహం. అయితే ఎమ్మెల్యేలు కొందరు మేం సమావేశం లో ఉన్నామని, మరి కొందరు మేము రాలేదని…. మేము మీటింగ్లో లేమని, ఇంకొందరు సమావేశమైతే తప్పేంటని రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. ఎమ్మెల్యేలు డిన్నర్ కు, లంచ్ కు కలిస్తే తప్పేం కాదు. అది అది అడపా జరిగేది . కానీ క్యాబినెట్లో అత్యంత కీలక శాఖ నిర్వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టడమే ఇక్కడ అసలైన పాయింట్. దీంతో ఎమ్మెల్యేల రహస్య సమావేశం పార్టీకి పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టింది.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అందరిని సమన్వయ పరుస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేశారనేది అందరికీ తెలిసిపోయిన విషయం. ఎమ్మెల్యేల సమావేశం జరిగిన మరుసటి రోజు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు పరిష్కరించుకుందామని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మీటింగ్ ని రహస్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. అయినా మరుసటిరోజే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మీటింగ్ లో విషయాలన్నీ మీడియాకి లీకులు ఇవ్వడంతో ఈ వ్యవహారంపై రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అనిరుద్ రెడ్డి స్వతహాగా తానే ఇదంతా చేస్తున్నారా …? ఆయన వెనుక ఎవరైనా ఉండి నడిపిస్తున్నార..?… అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. నెలలో ఎక్కువ రోజులపాటు హైదరాబాదులోనే ఉండే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీప దాస్ మున్షి ఈ వ్యవహారం జరిగి మూడు రోజులు కావస్తున్న ఇప్పటివరకు హైదరాబాద్కు రాలేదు. జరుగుతున్న వ్యవహారం పై ఫోకస్ చేయాల్సిన ఎఐసిసి నేతలు మౌనంగా ఉన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కేవలం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కే ఫోన్ చేసి మాట్లాడారు. అయితే ఈ వ్యవహారం అంతా ఆయనే బాధ్యుడని పార్టీ నాయకత్వం ఆలోచిస్తుందా..? లేదంటే మిగిలిన ఎమ్మెల్యేలతో పార్టీ ఇంచార్జి ఎందుకు మాట్లాడలేదు…అనే చర్చ కూడా తెర పైకి వచ్చింది.

సమావేశానికి వెళ్లిన ఎమ్మెల్యేలలో కొందరు మీటింగ్లో ప్రత్యేక ఏజెండా ఏమీ లేదని కేవలం డిన్నర్ కి పిలిస్తేనే వెళ్లామంటూ చెప్తున్నారు.
రహస్య సమావేశం అంత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వెనుక ఉండి నడిపించారని సమావేశంకు వెళ్లిన ఎమ్మెల్యే లు చెప్తున్నారు. పార్టీ పెద్దల దగ్గర ఇదే అంశాన్ని ఎమ్మెల్యేలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం.. ఇటు పార్టీ పెద్దల దగ్గర ఉంది. కేవలం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మాత్రమే లక్ష్యంగా చేసుకునీ ఈ సమావేశం జరిగిందా..? లేదంటే మంత్రుల దగ్గర ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫైల్స్ పెండింగ్లో ఉండి.. ఇలా చేస్తున్నారా..? అనే చర్చ కూడా నడుస్తోంది. కారణమేదైనా కావచ్చు.. కానీ పార్టీకి ఎమ్మెల్యేల రహస్య సమావేశం మాత్రం నెగిటివ్ చర్చకు దారితీసింది. ప్రతిపక్షానికి ఇది అస్త్రంగా మారింది.

రహస్య భేటీకి హాజరైన ఎమ్మెల్యేల వ్యవహారంలో పార్టీ అధిష్టానం ఏం చేయబోతుంది? ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన పొంగిలేటిపై చర్య తీసుకుంటారా ఆయన పిలిచి మాట్లాడుతారా? అసలు ఎమ్మెల్యేలు వెనక ఉన్నది ఎవరు ఎవరి ప్రమేయం లేకుండానే ఈ మీటింగ్ జరిపారా ఇవన్నీ తేల్చుకోవాల్సింది కాంగ్రెస్ అధిష్టానం. అసలే ప్రభుత్వ మీద జనంలో వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో, మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా ఫైల్ క్లియరెన్స్ కోసం సిగబాటలు పట్టడం తెలంగాణలో కాంగ్రెస్ కి మరో దెబ్బ కానుంది.