జగన్ కంటే నా తండ్రే ఎక్కువ.. షాక్ ఇచ్చిన ఎంపీ…?
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఎప్పుడు ఎవరు షాక్ ఇస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాజకీయంగా ఆ పార్టీ ఇప్పుడు క్రమంగా బలహీనపడే సంకేతాలు కనపడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఎప్పుడు ఎవరు షాక్ ఇస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాజకీయంగా ఆ పార్టీ ఇప్పుడు క్రమంగా బలహీనపడే సంకేతాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ నాయకత్వం పై కొంతమంది నాయకులకు నమ్మకం లేదు అనే ప్రచారం జరుగుతోంది. దీనితో ఎప్పుడు ఎవరు బయటికి వెళ్లిపోతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాజకీయంగా జగన్ తీసుకునే నిర్ణయాలపై పార్టీ నేతల్లో అసహనం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కాకపోవడాన్ని కొంతమంది నేతలు సీరియస్ గా తీసుకుంటున్నారు.
ప్రజల్లోకి జగన్ ప్రసంగాలు వెళ్లాలంటే కచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ జగన్ మాత్రం సమావేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. పార్టీ కీలక నేతలు కూడా ఇప్పుడు ప్రజల్లోకి రావడం లేదు. కేసుల భయంతో చాలామంది నాయకులు వెనకడుగు వేస్తున్నారు. ఇక కొంతమంది నాయకులు అయితే బయటకు వెళ్లిపోయి తమ రాజకీయ భవిష్యత్తును నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగానే తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఇప్పుడు రాజకీయాల్లో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తన తండ్రిని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసిన నేపథ్యంలో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి కాస్త వ్యూహాత్మక వ్యవహరిస్తున్నారట. ఆయన బిజెపిలోకి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. రాజకీయంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో వైసీపీ ఇప్పట్లో బలపడే అవకాశం లేకపోవడంతోనే పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టిగానే టార్గెట్ చేశారు. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి నాయకత్వాన్ని లేకుండా చేయాలని పవన్ కళ్యాణ్ టార్గెట్ పెట్టుకున్నట్టుగానే తెలుస్తోంది.
దీనితో మిధున్ రెడ్డి బిజెపి కి దగ్గరై తన తండ్రిని కాపాడుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా సమాచారం. కొన్ని కీలక కారణాలు… పెద్దిరెడ్డిని జగన్ కు దూరం చేశాయని ప్రచారం కూడా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పెద్దిరెడ్డిని టార్గెట్ చేసిన తర్వాత వైసీపీ అధిష్టానం నుంచి ఏ విధమైన మద్దతు లేకపోవటం కూడా మిథున్ రెడ్డిలో అసహనం పెంచిందని వార్తలు వస్తున్నాయి. బిజెపిలోకి వెళితే తనకు రాజకీయ భవిష్యత్తుతో పాటుగా భవిష్యత్తులో మంచి అవకాశాయాలు ఉంటాయని భావిస్తున్నారు.
ఏపీలో ఎలాగూ ఆ పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి నాయకత్వాన్ని కూడా బలపరుచుకునే అవకాశం తనకు దక్కుతుందని మిధున్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. తాను యువనేత కావడంతో భవిష్యత్తులో కచ్చితంగా అవకాశాలు బాగుంటాయని మిదున్ రెడ్డి ముందుగానే ఓ లెక్క వేసుకుంటున్నారు. దీని కంటే ముందు తన తండ్రిని కాపాడుకోవాలి అంటే బిజేపి మాత్రమె తనకు ఉన్న వేదిక అని మిథున్ రెడ్డి భావిస్తున్నారట. అటు ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులకు కూడా ఇప్పటికే తాను వైసీపీకి దూరమవుతున్నాను అనే విషయాన్ని సంకేతాలు పంపినట్లు వార్తలు వస్తున్నాయి.