గోరంట్ల మాధవ్ అరెస్ట్
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ భారతి మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న కిరణ్‌ను కలవాలంటూ గోరంట్ల మాధవ్ గుంటూరు ఎస్పీ ఆఫీస్‌లో నానా హడావుడి చేశారు.

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ భారతి మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న కిరణ్‌ను కలవాలంటూ గోరంట్ల మాధవ్ గుంటూరు ఎస్పీ ఆఫీస్‌లో నానా హడావుడి చేశారు. కిరణ్‌ను గుంటూరు నుంచి వేరే పీఎస్‌కు తరలిస్తున్న సమయంలో ఎస్పీ వాహనాన్ని మాధవ్ చేజ్ చేశాడు. మంగళగిరి వరకూ ఫాలో చేసి పోలీసులు విధులకు ఆటంకం కలిగించాడు. మాధవ్‌ను అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో మాధవ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు