పవన్ కళ్యాణ్ Vs సమంత.. ఏకంగా డిప్యూటీ సీఎంకే ఎదురెళ్తున్న స్యామ్.. ఏంటా ధైర్యం..?

పవన్ కళ్యాణ్ కు సమంత ఎదురు వెళ్లడం ఏంటి అనుకుంటున్నారు కదా..? నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించిన కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 19, 2025 | 12:00 PMLast Updated on: Apr 19, 2025 | 12:00 PM

Pawan Kalyan Vs Samantha

పవన్ కళ్యాణ్ కు సమంత ఎదురు వెళ్లడం ఏంటి అనుకుంటున్నారు కదా..? నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించిన కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది. తెలిసి తెలిసి పవన్ కళ్యాణ్ కు పోటీగా వెళుతుంది సమంత. అఫీషియల్ గా ఈ వార్ డిక్లేర్ చేసింది కూడా ఈ భామే. దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలి అంటే మనకు మొత్తం స్టోరీ తెలియాలి. అసలు ఏం జరిగిందంటే.. సమంత ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. విజయ్ దేవరకొండ ఖుషి సినిమా తర్వాత మళ్లీ తెలుగులో ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు ఈ బ్యూటీ. అయితే నిర్మాతగా మాత్రం మొదటి సినిమా తెలుగులోనే చేసింది. ట్రలాలా అనే బ్యానర్ మొదలుపెట్టి అందులో మొదటి ప్రయత్నంగా శుభం అనే సినిమా నిర్మించింది సమంత. మొత్తం కొత్త వాళ్ళతో ఈ సినిమా నిర్మించింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో ఆడ మగ తేడా లేకుండా అందరికీ ఒకే పారితోషికం ఇచ్చినట్టు చెప్పింది. ఎలాంటి సందడి లేకుండా సినిమా మొదలుపెట్టి పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ అయింది. ఇది ఎప్పుడు విడుదలవుతుందో తెలుసా.. మే 9, 2025. ఈ డేట్ ను పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే బ్లాక్ చేసుకున్నారు. దానికి ప్రత్యేకంగా కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోజు హరిహర వీరమల్లు సినిమా విడుదల కానుంది అని ప్రకటించారు మేకర్స్. ఇంకా ఈ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.. అయినా కూడా సినిమా మే 9న వస్తుంది అంటూ చెబుతున్నారు దర్శక నిర్మాతలు. రిలీజ్ డేట్ కు ఇంకా 20 రోజులు కూడా లేదు.. ఇప్పటివరకు ప్రమోషన్ మొదలు కాలేదు.. పవన్ కళ్యాణ్ షూటింగ్ కు రాలేదు.. ఇవన్నీ కేవలం 20 రోజుల్లో జరగడం అసాధ్యం. అందుకే హరిహర వీరమల్లు సినిమా మరొకసారి పోస్ట్ పోన్ అయింది అనేది అనధికారిక సమాచారం. అయితే వాళ్లు అధికారికంగా చెప్పనంత వరకు మే 9 అనేది కేవలం పవన్ కళ్యాణ్ డేట్ మాత్రమే. అందుకే ఆరోజు చాలా సినిమాలు రావాలని చూస్తున్నా కూడా ఇప్పటివరకు అధికారికంగా డేట్ అనౌన్స్ చేయలేదు.

ఎవరి వరకో ఎందుకు.. శ్రీ విష్ణు హీరోగా గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న సింగిల్ సినిమాను మే 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కానీ పవన్ కళ్యాణ్ సినిమా డేట్ వాయిదా పడిన తర్వాతే తమ సినిమా డేట్ అనౌన్స్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు డేట్ ప్రకటిస్తే.. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వెళ్ళినట్టు ఉంటుంది. అయితే సమంత మాత్రం ఈ విషయంలో రిస్కు తీసుకుంది. తమ సినిమా శుభం మే 9న వస్తున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఈ లెక్కన పవన్ కళ్యాణ్ సినిమాకు పోటీగా వెళ్లినట్టే. కానీ ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చల ప్రకారం.. జూన్ రెండో వారానికి హరిహర వీరమల్లు వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. ఒకవేళ పవన్ ఆ డేట్ ఖాళీ చేస్తే కేవలం సమంత సినిమా మాత్రమే కాదు.. ఇంకా చాలా సినిమాలు అదే రోజు రానున్నాయి. ఎందుకంటే మే 9 టాలీవుడ్ కు బాగా కలిసొచ్చిన తేదీ. గతంలో ఇదే తేదీన విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి, మహర్షి, భారతీయుడు లాంటి సినిమాలు సంచలన విజయం సాధించాయి. అందుకే ఆ తేదీ మీద అందరికీ కన్ను ఉంది.