Telangana CM, Revanth Reddy : తెలంగాణలో నేడు కొత్త ప్రభుత్వం.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి.
తెలంగాణ విభజన అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తొలి సారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు దేశ స్థాయి నేతలతో పాటు ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో అమరవీరులైన 250 కుటుంబాలకు ప్రత్యేక ఆహ్వానం..

Revanth Reddy will take oath as the Chief Minister of Telangana today.
ఇవాళ తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. హైదరాబాద్ వేదికగా.. ఎల్బీ స్టేడియంలో నేడు మధ్యహ్నం 1.04 గంటలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గవర్నర్ తమిళిసై సందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సీఎం తో పాటుగా మరికొందరు కీలక మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. సీఎం హోదాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా “ఆరు హామీల” చట్టానికి సంబంధించిన ఫైలుపై రేవంత్ రెడ్డి తొలి సంతకం చేయనున్నారు. ఇదే సందర్భంగా రజనీ అనే వికలాంగ మహిళకు తొలి ఉద్యోగం ఇచ్చిన ఫైల్స్ పై కూడా సీఎం సంతకం చేయనున్నారు.
BREAKING: REVANTH CABINET :11 మంది మంత్రులతో రేవంత్ ప్రమాణం !
తెలంగాణ విభజన అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తొలి సారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు దేశ స్థాయి నేతలతో పాటు ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో అమరవీరులైన 250 కుటుంబాలకు ప్రత్యేక ఆహ్వానం.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు, తెలంగాణ మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపించారు.