ఉత్కంఠగా ప్లే ఆఫ్ రేస్, డేంజర్ జోన్ లో 3 జట్లు
క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ లో 42 మ్యాచ్ లు ముగిసాయి. అంచనాలు లేని కొన్ని జట్లు ప్లే ఆఫ్ రేసులో దూసుకెళుతుంటే..

క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ లో 42 మ్యాచ్ లు ముగిసాయి. అంచనాలు లేని కొన్ని జట్లు ప్లే ఆఫ్ రేసులో దూసుకెళుతుంటే.. అంచనాలు పెట్టుకున్న జట్లు మాత్రం పాయింట్ల పట్టికలో కింది నుంచి మూడు స్థానాల కోసం పోటీపడుతున్నాయి. ఆర్‌సీబీ- రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అనంతరం పాయింట్స్ టేబుల్‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్, ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్, ఎస్‌ఆర్‌హెచ్, చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్ చేరే జట్ల అవకాశాలను పరిశీలిస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్, సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్ దాదాపుగా రేసు నుంచి తప్పుకున్నాయి. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్ డేంజర్ జోన్‌లో ఉన్నాయి.
ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ టైటాన్స్ 6 విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. ఆ జట్టు ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో రెండు విజయాలు సాధిస్తే గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవుతోంది. గుజరాత్‌కు ప్లే ఆఫ్స్ చేరే అవకాశం 90 శాతంగాగా ఉంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో రెండు విజయాలు సాధిస్తే ఢిల్లీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవుతుంది. ఢిల్లీకి ప్లే ఆఫ్స్ చేరే అవకాశం 84 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ 6 విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో రెండు విజయాలు సాధిస్తే ఆర్‌సీబీకి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. ఆర్‌సీబీకి ప్లే ఆఫ్స్ చేరే అవకాశం 75 శాతంగా ఉంది.
మరోవైపు ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ 5 విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దీనిలో మూడు విజయాలు సాధిస్తే ముంబైకి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవుతుంది. ముంబైకి ప్లే ఆఫ్స్ చేరే అవకాశం 48 శాతంగా ఉంది. ఇక ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ 5 విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో రెండు విజయాలు సాధిస్తే పంజాబ్‌కు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. పంజాబ్‌కు ప్లే ఆఫ్స్ చేరే అవకాశం 56 శాతంగా ఉంది.
అటు 9 మ్యాచ్‌లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ 5 విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో మూడు విజయాలు సాధిస్తే లక్నోకు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. లక్నో ప్లే ఆఫ్స్ చేరే అవకాశం 31 శాతంగా ఉంది.. కాగా ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 3 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దీనిలో ఐదు విజయాలు సాధిస్తేనే కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం 13 శాతం మాత్రమే
ఇక వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ దాదాపు రాజస్థాన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఆ జట్టు ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఐదు మ్యాచ్‌లకు ఐదు గెలిచినా.. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరలేదు. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ దీ ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 విజయాలతో 9వ స్థానంలో కొనసాగుతుంది. ఆరెంజ్ ఆర్మీ ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ 6 మ్యాచ్‌లకు 6 గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒక్కటి ఓడినా.. ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. రెండు ఓడితే ఇంటిదారి పడుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 2 విజయాలతో లాస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న సీఎస్కే 6 గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒక్కటి ఓడినా.. ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. రెండు ఓడితే అధికారికంగా నిష్క్రమిస్తుంది.