రోహిత్ ఇక రిటైరయిపో ,సెహ్వాగ్ హాట్ కామెంట్స్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొద్ది కాలంగా పెద్దగా రాణించలేకపోతున్నాడు. టెస్టుల్లో కూడా సింగిల్ డిజిట్స్‌కే అవుటవుతుండటంతో రిటైర్మెంట్ ప్రకటించాలని అప్పట్లో తెగ డిమాండ్ వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 18, 2025 | 05:20 PMLast Updated on: Apr 18, 2025 | 5:20 PM

Rohit Should Retire Now Sehwag Makes Hot Comments

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొద్ది కాలంగా పెద్దగా రాణించలేకపోతున్నాడు. టెస్టుల్లో కూడా సింగిల్ డిజిట్స్‌కే అవుటవుతుండటంతో రిటైర్మెంట్ ప్రకటించాలని అప్పట్లో తెగ డిమాండ్ వచ్చింది. కానీ ఆ తర్వాతే ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించి తాను ఇంకా కొన్నేళ్ల పాటు టీమిండియాలోనే కొనసాగుతానని హిట్‌మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత జరుగుతున్న ఐపీఎల్ 2025లోనూ హిట్‌మ్యాన్ అదే పేలవ ప్రదర్శనతో మరిన్ని విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. తాజాగా భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ హిట్ మ్యాన్ పై విమర్శలు గుప్పించాడు. అతను ఇక రిటైరయితే మంచిదన్నాడు. రాబోయే మ్యాచ్‌లలో తన బ్యాటింగ్ తీరు కొంచెం మార్చుకుని పరుగులు జోడించాలని కూడా సలహా ఇచ్చాడు.

ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన 6 ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ కేవలం 82 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ శర్మ గత 22 ఇన్నింగ్స్ లలో 6 సార్లు మాత్రమే 20 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. మిగిలిన 16 ఇన్నింగ్స్ లలో రోహిత్ శర్మ బ్యాట్ నుంచి 20 పరుగులకు మించలేదు. దీంతో హిట్ మ్యాన్ అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. దీని ఫలితంగా ఈ సీజన్ చివరిలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం ఇప్పటికే ఆసన్నమైందని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. అభిమానులు సంతోషంగా ఉన్నప్పుడు రోహిత్ శర్మ తప్పుకోవడం మంచిదని ప్రకటించాడు. ఎందుకంటే భవిష్యత్తులో అభిమానులు ఇక చాలు.. రిటైర్ అవ్వమని చెప్పడం స్టార్ట్ చేస్తారని చెప్పుకొచ్చాడు.

ఎవరైనా రోహిత్ శర్మ దగ్గరికి వెళ్లి మొదటి 10 బంతులు ఓపికగా ఆడమని చెప్పాలన్నాడు. రోహిత్ శర్మను ఏ ఇన్నింగ్స్‌లోనూ పుల్ షాట్ ఆడవద్దని హెచ్చరించాలని అన్నాడు. తాను ఆడుతున్నప్పుడు ఫామ్‌లో లేనప్పుడు సచిన్, రాహుల్ ద్రవిడ్, గంగూలీ, ఇతరులు కొంచెం ప్రశాంతంగా ఆఢాలని తనకు చెప్పేవారని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ఆ విషయం రోహిత్ శర్మకు ఎవరైనా చెప్పాలని స్పష్టం చేశాడు. ఈ ఆరు మ్యాచ్‌లలో రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్‌పై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ ఎక్కువయ్యాయి. హిట్ మ్యాన్ రోజురోజుకూ చాలా ఇంప్రూవ్‌మెంట్ అవుతున్నాడంటూ మాస్ ర్యాగింగ్ చేస్తున్నారు.