బ్రేకింగ్: MMTS అత్యాచార ఘటన ఫేక్, తప్పంతా యువతిదే
సికింద్రాబాద్ MMTSలో యువతి మీద అత్యాచార యత్నం కేసులో అసలు నిజం రాబట్టారు పోలీసులు. అసలు అక్కడ అత్యాచారమే జరగలేదని నిర్ధారించారు.

సికింద్రాబాద్ MMTSలో యువతి మీద అత్యాచార యత్నం కేసులో అసలు నిజం రాబట్టారు పోలీసులు. అసలు అక్కడ అత్యాచారమే జరగలేదని నిర్ధారించారు. ట్రైన్‌లో ఉన్న యువతి రీల్స్ చేసే క్రమంలో ట్రైన్ నుంచి కింద పడిపోయినట్టు వెల్లడించారు. విషయం బయటికి తెలిస్తే అంతా తిడతారని తనను ఓ వ్యక్తి రేప్ చేయబోయాడని యువతి చెప్పిందని నిర్ధారించారు. ట్రైన్ నుంచి కింద పడిపోయిన యువతిని పోలీసులు విచారించారు.
మొదట ఓ వ్యక్తిని అమ్మాయి గుర్తించడంతో అతన్ని అరెస్ట్ కూడా చేశారు. కానీ అతను నిర్ధోషి అని తేలడంతో వదిలేశారు. తరువత ఎన్ని రకాలుగా ప్రయత్నించినా యువతి మీద అత్యాచార యత్నం జరిగినట్టు పోలీసులకు ఆధారాలు లభించలేదు. దీంతో యువతిని నిలదీయడంతో అసలు నిజం బయటికి వచ్చింది. తానే రీల్స్ చేయబోయి ట్రైన్ నుంచి కింద పడిపోయినట్టు యువతి ఒప్పుకుంది. దీంతో యువతి ఇన్ని రోజులు ఆడిన నాటకం చూసి పోలీసులే షాకయ్యారు. అత్యారయత్నం జరగలేదని నిర్ధారణ కావడంతో కేసు క్లోజ్ చేశారు.