మహేష్ బాబుకు ED షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ.. ఆయనేం తప్పు చేశాడు..?
సూపర్ స్టార్ మహేష్‌బాబుకు ఊహించని షాక్ ఇచ్చింది ED. తాజాగా ఈయనకు వీళ్ళ నుంచి నోటీసులు వచ్చాయి. అదేంటి.. మహేష్ బాబుకు ఏం చేసాడు..?

సూపర్ స్టార్ మహేష్‌బాబుకు ఊహించని షాక్ ఇచ్చింది ED. తాజాగా ఈయనకు వీళ్ళ నుంచి నోటీసులు వచ్చాయి. అదేంటి.. మహేష్ బాబుకు ఏం చేసాడు..? ఆయన సినిమాలేదో ఆయన చేసుకుంటున్నాడు కదా.. అలాంటి హీరోకు ఈడీ నుంచి నోటీసులు రావడం ఏంటి అనుకుంటున్నారు కదా..? ఇక్కడే ఉంది అసలు కథ.. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ వ్యవహారంలో మహేష్ బాబుకు ఈడీ నుంచి నోటీసులు వచ్చాయి. ఆయన ఆ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేసాడు. అందుకే ఈడీ నోటీసులు ఇచ్చింది. అంతేకాదు.. ఏప్రిల్ 28న విచారణకు రావాలంటూ మహేష్‌కు నోటీసులు పంపారు. ఈ సంస్థలను ప్రమోట్ చేయడానికి రూ. 3.4 కోట్లు తీసుకున్నట్టు ఈడీ గుర్తించింది. ఏప్రిల్ 16న హైదరాబాద్‌లోని సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ ఆఫీసులతో పాటు, ఈ సంస్థల అధినేతల ఇళ్లపై దాడి చేసింది ED.
రెండు రోజుల పాటు ఈ సోదాలు తీవ్రస్థాయిలో జరిగాయి. అప్పుడే మహేష్ పేరు కూడా బయటికి వచ్చింది. తాజాగా ఈ పరిణామం చోటు చేసుకుంది. మహేష్ ఏప్రిల్ 28 ఉదయం 10. 30 నిమిషాలకు హైదరాబాద్‌లోని ఈడి హెడ్ క్వార్టర్స్‌కి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు అధికారులు. ఈ యాడ్‌లో నటించడానికి మహేష్ బాబు మొత్తం 5 కోట్ల 90 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు గుర్తించారు ఈడీ అధికారులు. అందులో రూ. 3.4 కోట్లు చెక్, 2.5 కోట్ల రూపాయలు నగదు రూపంలో మహేష్ తీసుకున్నాడు. సాయిసూర్య డెవలపర్ ఎండీ సతీష్ చంద్ర ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహేష్ భార్య పిల్లలతో కలిసి సాయిసూర్య డెవలపర్స్ యాడ్‌లో నటించాడు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా ఈ యాడ్ ఎక్కడా ప్రసారం చేయకూడదని కూడా చెప్పారు. టీవీల్లోనూ కొన్ని రోజుల తర్వాత ఆ యాడ్ రాలేదు.
ఇప్పుడు ఇదే యాడ్ పుణ్యమా అని మహేష్ బాబుకు ఈడీ నుంచి నోటీసులు వచ్చాయి. అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు.. కానీ ఏ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నాం అనే విషయంపై స్టార్స్ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మంచిది అంటున్నారు అధికారులు. గతంలో కాజల్, తమన్నా లాంటి హీరోయిన్లు కూడా క్రిప్టో కరెన్సీ కేసులో ఇరుక్కున్నారు. అలాగే మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఇలాగే తెలిసీ తెలియకుండా యాడ్స్ చేసి అనవసరంగా బుక్ అయ్యారు. డబ్బులొస్తున్నాయి కదా అని ముందు వెనక చూసుకోకుండా ప్రమోట్ చేస్తే ఇలాంటి తిప్పలు అయితే తప్పవు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. మొన్నటి వరకు చిన్న బ్రేక్ తీసుకున్నా కూడా.. తాజాగా మళ్లీ ఈ సినిమా షెడ్యూల్ మొదలైంది. హైదరాబాద్‌లోనే భారీ షెడ్యూల్ ప్లాన్ చేసాడు దర్శక ధీరుడు. ప్రియాంక చోప్రా సైతం ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.