50శాతం గాజాను కిల్ జోన్‌గా మార్చిన IDF ,అమెరికాలో నెతన్యాహు విధ్వంసకర నిర్ణయాలు

రఫాలో యాక్షన్ మార్చిన ఇజ్రాయెల్ గాజాను ఆక్రమించుకోబోతోందా? ఇప్పటికే 50శాతం గాజా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఇజ్రాయెల్‌ దాన్ని కిల్ జోన్‌గా మార్చబోతోందా?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2025 | 01:50 PMLast Updated on: Apr 08, 2025 | 1:50 PM

Idf Turns 50 Percent Of Gaza Into A Kill Zone Netanyahus Destructive Decisions In America

రఫాలో యాక్షన్ మార్చిన ఇజ్రాయెల్ గాజాను ఆక్రమించుకోబోతోందా? ఇప్పటికే 50శాతం గాజా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఇజ్రాయెల్‌ దాన్ని కిల్ జోన్‌గా మార్చబోతోందా? ఇరాన్ టార్గెట్‌గా భీకర ఆపరేషన్లకు యాక్షన్ ప్లాన్ సిద్ధమైందా? నెతన్యాహు అమెరికా పర్యటన నేపథ్యంలో మిడిల్ ఈస్ట్‌ను షేక్ చేస్తున్న ప్రశ్నలే ఇవి. ఓవైపు గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా పౌరుల ఆందోళనలు.. మరోవైపు రఫాలో ఇజ్రాయెల్ సైనిక మోహరింపులు.. ఇంకోవైపు అమెరికా, ఇరాన్ మధ్య పతాకస్థాయికి చేరుకుంటున్న ఉద్రి క్తతలు.. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నెతన్యాహు అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇక్కడే మిడిల్ ఈస్ట్‌లో భారీ యాక్షన్‌కు రంగం సిద్ధంకాబోతోందన్న చర్చ మొదలైంది. ఎందుకంటే ట్రంప్‌ నుంచి నెతన్యాహుకు చాలా విషయాల్లో క్లారిటీ కావాలి. వాటిలో గాజా స్వాధీనంతో పాటు ఇరాన్ లెక్క తేల్చే ఆపరేషన్లు కూడా ఉన్నాయి. ఇంతకూ, అమెరికా పర్యటనలో ట్రంప్‌తో నెతన్యాహు చర్చించిన అంశాలేంటి? ఇద్దరు నేతల
మిడిల్ ఈస్ట్ ప్లాన్‌లో ఏముంది? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..

ఇటీవల గాజాలో 2024 ప్రారంభంనాటి పరిస్థితి నెలకొంది. లక్షల మందికి ఆశ్రయం ఇచ్చిన రఫాపై ఇజ్రాయెల్ భీకర దాడులను ప్రారంభించింది. అక్కడి నుంచి పాలస్తీనా పౌరుల కుటుంబాలు పారిపోతున్నాయి. 2023 అక్టోబరు నుంచి జరుగుతున్న ఈ యుద్ధంలో తొలిసారి భారీగా ప్రజలు రఫాను వీడుతున్నారు. రఫాను ఖాళీ చేయాలని ఇప్పటికే ఇజ్రాయెల్ బలగాలు ఆదేశాలు జారీ చేశాయి. రఫాను సొంతం చేసుకునే దిశగా నెతన్యాహు సైన్యం దాడులను ముమ్మరం చేసింది. రఫాలోని భవనాలను కూల్చేసి.. అక్కడి ప్రజలను బలవంతంగా వెళ్లగొడుతోంది. గాజాలోని దక్షిణ సరిహద్దు ప్రాంతంలో రఫా ఉంటుంది. ఈ నగరంలోకి ఇజ్రాయెల్ బలగాలు దూసుకెళ్తున్నాయి. జనవరిలో సీజ్ ఫైర్ డీల్ అమల్లోకి వచ్చిన తరువాత… గాజాపై భీకర దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడడం ఇదే తొలిసారి. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవడమే ఇజ్రాయెల్ దీర్ఘకాలిక లక్ష్యంగా కనిపిస్తోంది. తమ దళాలు భద్రతా జోన్‌ను స్వాధీనం చేసుకుంటాయని నెతన్యాహు ప్రకటించారు. ఆ ప్రాంతం పేరు మొరాగ్ యాక్సిస్‌గా చెప్పాడు. రఫాకు, ఖాన్ యూనిస్‌కు మధ్య ఉన్న ఓ పాత ఇజ్రాయెల్ సైనిక స్థావరమే ఈ మొరాగ్ యాక్సిస్‌‌. ఇక్కడే గాజా గేమ్ మొత్తం మారిపోయింది.

మొరాగ్ యాక్సిస్‌ను స్వాధీనం చేసుకోవడం అంటే గాజా మొత్తాన్నీ ఆక్రమించుకోవడమే. ఇప్పటికే 50శాతం గాజా భూభాగం ఇజ్రాయెల్ ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఆ 50శాతం భూభాగాన్నీ కిల్ జోన్‌గా మార్చేశారు. అంటే అక్కడ ఇజ్రాయెల్ సైనికులు కానివారెవరూ ప్రాణాలతో ఉండరన్నమాట. మిగిలిన 50శాతం గాజా ఆక్రమణే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ముందుకు కదులుతోంది. ఓవరాల్‌గా గాజాను స్మశానంగా మార్చడమే ఇజ్రాయెల్ టార్గెట్. ఈ విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ సైనికులే చెప్పారు. అదే జరిగితే గాజాలో ఇప్పటివరకూ జరిగింది ఒక లెక్క.. ఇకపై జరగబోతోంది మరో లెక్క.మార్చి ప్రారంభంలో కాల్పుల విమరణ ఒప్పందం మొదటి ఫేజ్ ముగిసింది. అప్పటి నుంచి గాజాలోని 23 లక్షల మంది పాలస్తీనియన్లకు చేరే మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ ఆపేసింది. దీనిపై పలు ఆరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గాజన్లకు మానవతా సాయం అందించాలని ఇజ్రాయెల్‌పై ఒత్తిడి చేస్తున్నాయి. కానీ.. ఇజ్రాయెల్ మాత్రం ససేమిరా అంటోంది. గాజాలో ఈ యాక్షన్ మొత్తం ట్రంపే నడిపిస్తున్నారనేది ఓపెన్ సీక్రెట్. నెతన్యాహు ప్రస్తుత అమెరికా టూర్‌ అజెండా కూడా గాజా స్వాధీనమే. అయితే, ఇదొక్కటే కాదు.. అంతకుమించి మరో అంశం కూడా ఉంది. ఇరాన్ న్యూక్లియర్ యాక్షన్‌కు ఎండ్‌కార్డ్ వేయడమే ఆ రెండో అంశం.

ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి. టెహ్రాన్ అణు నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం చేయకపోతే బాంబు దాడులు ఎదుర్కోవల్సిందే అన్న ట్రంప్ వ్యాఖ్యలు మిడిల్ ఈస్ట్‌లో ప్రకంపనలు రేపాయి. దీనికి కౌంటర్‌గా ఇరాన్ సైతం సై అంటై సై అంది. ‘మీరు దాడి చేస్తే.. మేం చూస్తూ ఊరుకుంటామా అంటూ అమెరికాపైనే దాడి చేసేలా పెద్ద సంఖ్యలో క్షిపణులను సిద్ధం చేసింది. ఇటీవల అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇరాన్ న్యూక్లియర్ ప్లాన్‌ను పసిగట్టాయి. ఇరాన్‌ ప్రభుత్వం అణు బాంబు తయారు చేయాలని ఆదేశించగానే.. యాక్షన్‌లోకి దిగిపోయేలా శాస్త్రవేత్తలను సిద్ధం చేసింది. ఈ విషయాన్ని అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయి. వాస్తవానికి.. ఒక అణ్వస్త్రం తయారీకి 42 కిలోలు 90‌శాతం శుద్ధి చేసిన యూరినియం ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం ఇరాన్‌ దగ్గర 200 కిలోల మేరకు 60శాతం శుద్ధి చేసిన యూరేనియం ఉంది. సో.. టెహ్రాన్‌ న్యూక్లియర్ లక్ష్యాలకు చేరువలో ఉందన్నమాట. ఈ విషయంలో ఇరాన్‌ను అడ్డుకోవాల్సిన టైం కూడా దగ్గర పడింది. నెతన్యాహు యూఎస్ పర్యటనలోనే ఈ మిషన్‌ ఫైనల్ కావచ్చనే చర్చ జరుగుతోంది. విచిత్రం ఏంటంటే నెతన్యాహుతో భేటీ తర్వాత ఇద్దరు లీడర్లు కలిసి నిర్వహించాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్‌ను వైట్‌హౌస్ రద్దు చేసింది. దీని వెనుక మిస్టరీ ఏంటో కూడా తెలియడం లేదు. ఓవరాల్‌గా అమెరికా నుంచి నెతన్యాహు భారీ వ్యూహాలతోనే తిరిగివస్తారనేది మాత్రం క్లియర్. ఆ వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఎవరి ఊహకూ అందే అవకాశం కూడా లేదు. మిడిల్ ఈస్ట్‌లో చరిత్ర ఎరుగని విధ్వంసానికి రంగం సిద్ధమైందనే అనుకోవచ్చు.