Ramoji Rao : రేపు టాలీవుడ్ సినిమా షూటింగ్స్ బంద్!
ఈనాడు (Eenadu) గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంతాపం వ్యక్తం చేసింది.

Tollywood movie shootings are closed tomorrow!
ఈనాడు (Eenadu) గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంతాపం వ్యక్తం చేసింది. రామోజీరావు మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు ఆయన చివరి చూపు కోసం ఫిల్మ్ సిటీకి తరలివస్తున్నారు. సంతాప సూచికగా రేపు (ఆదివారం జూన్ 9న) సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఛాంబర్ కార్యదర్శి (Film Chamber Secretary) దామోదర్ ప్రసాద్ (Damodar Prasad) మాట్లాడుతూ.. రేపు షూటింగ్ లకు సెలవు అన్నారు.
రేపు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. RFCలో ఆయన పార్థివదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి, కేసీఆర్, పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు.అయితే గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే.