Chambrabu : చంద్రబాబుకు భారీ ఊరట.. స్కిల్ స్కాం కేసులో బాబుకు బెయిల్
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబుకు భారీ ఊరట దక్కింది. హైకోర్టు ఆయనకు గెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తాజాగా తీర్పచ్చింది.

Big relief for Chandrababu.. Babu bailed in skill scam
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబుకు భారీ ఊరట దక్కింది. హైకోర్టు ఆయనకు గెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తాజాగా తీర్పచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తాజాగా తీర్పు ఇచ్చింది. స్కిల్ కేసులో హైకోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కాగా ఇదే కేసులో బాబు ఇటీవల మధ్యంతర బెయిల్ పై బయటికొచ్చారు. కాగా ఈ నెల 28న రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ కావాల్సి ఉంది.. కానీ ఆయనకు బెయిల్ మంజూరు అవ్వడంతో సరెండర్ కావాల్సిన పని లేదు.