ఫ్లాష్ బ్యాక్ ఫైట్ 110 కోట్లు.. 20 నిమిషాలకు 100 కోట్లు..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, వచ్చే మంగలవారం నుంచి డ్రాగన్ సెట్లో జాయిన్ కాబోతున్నాడు. రెండు వారాలుగా ఈ ప్రచారం జరుగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 18, 2025 | 09:00 PMLast Updated on: Apr 18, 2025 | 9:00 PM

Flashback Fight 110 Crores 100 Crores For 20 Minutes

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, వచ్చే మంగలవారం నుంచి డ్రాగన్ సెట్లో జాయిన్ కాబోతున్నాడు. రెండు వారాలుగా ఈ ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఇందులోకొత్త విషయం లేదు. కాని మూడు వారాలు గ్యాప్ లేకుండా షూటింగ్ ప్లాన్ చేసి, ప్రశాంత్ నీల్ షాక్ ఇస్తున్నాడు. 110 కోట్ల ఫ్లాష్ బ్యాక్ ఫైట్ సీన్ ప్లాన్ చేశాడు. అక్కడే సవాలక్ష డౌట్లొస్తున్నాయి. ఎన్టీఆర్ చూస్తే మరీ సన్నబడ్డాడు… మొన్నటి వరకు జరిగిన ప్రచారం చూస్తే, 8 ప్యాక్స్ కోసం సన్నబడ్డాడనే తెలుస్తోంది. కాని మరింత మజిల్ పెంచేందుకు కావాలంటే ప్లాన్ చేయొచ్చు. కాని చేయట్లేదు. ఈలోపే క్లైమాక్స్ ని, ప్రీక్లైమాక్స్ కి భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నాడు. అది కూడా యుద్ధ ట్యాంకర్ తో… అసలు ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉందంటే, ఇందులో డ్రాగన్ ఒక్కడేనా…? మరో జై లవకుశ లాంటి ట్విస్ట్ లు ఏమైనా ఉన్నాయా..? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తున్న కొత్త డెవలప్ మెంట్… అదేంటో చూసేయండి…

డ్రాగన్ షూటింగ్ ఎప్పుడోమొదలైంది. కాని అసలైన డ్రాగన్ మాత్రం మంగళవారమే సెట్లో అడుగుపెట్టబోతోంది. మ్యాన్ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏప్రిల్ 22న డ్రాగన్ సెట్లో అడుగుపెట్టబోతున్నాడు. అప్పటి నుంచి వరుసగా 3 వారాలు గ్యాప్ లేకుండా లాంగ్ షెడ్యూల్ షూటింగ్ జరగబోతోంది. ప్రశాంత్ నీల్ ఈ లాంగ్ త్రీ వీక్ షెడ్యూల్ లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ తాలూకు ఫైట్ సీన్స్ లో మేజర్ పార్ట్ ని షూట్ చేయబోతున్నాడు.అంతా ఓకే కాని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో వచ్చీ రాగానే, భారీ ఫైట్ సీన్ ఎందుకు ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్? అక్కడే ట్విస్ట్ ఉంది. ప్రజెంట్ ఎయిట్ ప్యాక్స్ కోసం 14 కేజీల వేయిట్ తగ్గిన ఎన్టీఆర్, తో ఫ్లాష్ బ్యాక్ సీన్ ని తెరకెక్కించబోతున్నాడట ప్రశాంత్ నీల్.

ఇది బయట వినిపిస్తున్న టాకే అయినా, షూటింగ్ ఏర్పాట్లు, సెట్ వివరాలు చూస్తే యుద్ధ ట్యాంక్ తో ఏదో భారీ ఫైట్ సీనే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే మరీ ఇంత సన్నగా కనిపిస్తున్న తారక్ తో వచ్చీ రాగానే ఫైట్ సీన్ అంటే అదే ఎవరికీ అర్ధం కావట్లేదు.ఎందుకంటే ఎయిట్ ప్యాక్స్ కోసం సన్నబడాలి కాబట్టి, తారక్ బక్క చిక్కాడు. అదయ్యాకే మళ్లీ బైసప్స్, ట్రై సప్స్ పెంచాలి కాబట్టి వాటికి కనీసం నెలైనా టైం పడుతుంది. ఇంతలో హెవీ ఫైట్ సీన్లు, ప్లాన్ చేయటం, అవి క్లైమాక్స్ వి కావటంతో కొత్త కొత్త డౌట్లొస్తున్నాయి.

ప్రజెంట్ ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్ సీన్ తీయబోతున్న ప్రశాంత్ నీల్, ఇందులో ఒక్క డ్రాగన్ కాదు రెండు డ్రాగన్స్ ని పెట్టాడనే టాక్ పెరిగింది. అందుకోసమే సన్న బడ్డ ఎన్టీఆర్, తాలూకు షూట్ ని ముందు ప్లాన్ చేశారట. అదయ్యాక నెల మళ్లీ గ్యాప్ ఇచ్చిన మజిల్స్ పెంచాక మరో పాత్ర షూటింగ్ ఉంటుంది. కాకపోతే సన్నబడ్డ పాత్ర తో కేవలం ఫ్లాష్ బ్యాక్ కే పరిమితం చేస్తున్నారని తెలుస్తోంది. సో మళ్లీ మజిల్స్ పెంచాక మిగతా మేజర్ షూటింగ్ ని ప్లాన్ చేయటంతో, ఆ టైంలో వార్ 2 పెండింగ్ సాంగ్ షూటింగ్ ని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడే ఆ సాంగ్ తీస్తే వార్ 2 లో ఉన్న లుక్ కి, ఇప్పుడున్న లుక్ మ్యాచ్ కాదు కాబట్టే అలా ప్లాన్ చేశారట.

మొత్తానికి ఎన్టీఆర్ సన్నబడ్డ లుక్ తో ఫ్లాష్ బ్యాక్ సీన్ల షూటింగ్ అనగానే, ఖచ్చితంగా రెండో పాత్ర ఉంటుందని సినీజనాలు ఈజీగానే గెస్ చేశారు. అదే నిజమనిపించేలా షూటింగ్ ప్రిపరేషన్స్ కనిపిస్తున్నాయి. ఇది నిజం కాకపోతే ఇంకా వార్ 2 సగం సాంగ్ షూటింగ్ పెండింగ్ పెట్టుకుని ఎందుకు తారక్ సన్నబడతాడు… ఆలుక్ తో వార్ 2 పెండింగ్ సాంగ్ షూటింగ్ చేస్తే లుక్ సెట్ కాదు కాబట్టి, మళ్లీ తారక్ పాత లుక్ లోకి త్వరలోనే వస్తాడని అలా కన్ఫామ్ అయ్యింది. ఈ రెండు వేరియేషన్ల వెనక రెండు డ్రాగన్ల కథ ఉందని ఇలా తేలిపోయింది.