1850 కోట్లు.. 800 కోట్లు.. 1200 కోట్లు.. మ్యాజిక్ నెంబర్ ఎక్కడా?

పాన్ ఇండియా కింగ్ అంటే రెబల్ స్టార్ ప్రభాసే... ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 18, 2025 | 08:30 PMLast Updated on: Apr 18, 2025 | 8:30 PM

1850 Crores 800 Crores 1200 Crores Where Is The Magic Number

పాన్ ఇండియా కింగ్ అంటే రెబల్ స్టార్ ప్రభాసే… ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్నాడు. 550 కోట్లతో బాహుబలి, 1850 కోట్ల వసూళ్లతో బాహుబలి 2 ట్రెండ్ సెట్ చేస్తే, 450 కోట్లతో సాహో, 800 కోట్లతో సలార్ సునామీ క్రియేట్ చేశాయి. కల్కీతో 1200 కోట్ల లెక్కలు తేలాయి.. ఎలా చూసినా 1850 కోట్ల తన రికార్డు ఇంకా పదిలంగానే ఉంది. పుష్ప2 దరిదాపుల్లోకి వచ్చినా రికార్డు మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. మరి 1850 కోట్లనే కాదు 2010 కోట్ల దంగల్ రికార్డుని బద్దలు కొట్టేదెవరు? వార్ 2 ఈ ఏడాదే వస్తోంది… ఆగస్ట్ లో వార్ 2 వస్తే, అది 2 వేల కోట్ల రికార్డుని బద్దలు కొడితే, బాహుబలి, దంగల్ రికార్డులు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాని అంతకంటే ముందే రాజా సాబ్ ఈ రికార్డుని బ్రేక్ చేస్తాడా? 2 వేల కోట్ల మ్యాజిక్ ఫిగర్ ని రెబల్ స్టార్ ఏ సినిమాతో దాటబోతున్నాడు..? టేకేలుక్

రెబల్ స్టార్ ప్రభాస్ కి వసూళ్ల వరద కొత్త కాదు. బాహుబలి 500 కోట్లు రాబడితే. పార్ట్ 2 మూవీ 1850 కోట్లు రాబట్టింది. సాహో 350 నుంచి 450 కోట్లు రాబడితే, సలార్ 800 కోట్ల మూవీగా మారింది. ఇక కల్కీతో 1200 కోట్లు కొల్లగొట్టిన ప్రభాస్ ఎప్పుడు మ్యాజిక్ నెంబర్ ని చేరుకుంటాడు.. అదే దంగల్ రికార్డు 2010 కోట్ల నెంబర్. నిజానికి దంగల్ కంటే ముందే బాహుబలి 1850 కోట్లు రాబట్టింది. దంగల్ కేవలం 810 కోట్లే రాబట్టింది. కాని చైనాలో 1200 కోట్ల వసూళ్లు రావటంతో, టోటల్ గా 2010 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ట్రెండ్ సెట్ చేసింది. లేదంటే ఇండియా నెంబర్ వన్ మూవీగా బాహుబలి 2, నెంబర్ 2 సినిమాగా పుష్ప2 లిస్ట్ లోఉండేవి..

ఏదేమైనా 2000 కోట్ల మార్క్ ని ఇంతవరకు దంగల్ తప్ప మరే సినిమా దాటలేదు. కాని వార్ 2 మూవీ దాటేలా కనిపిస్తోంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ 1500 కోట్లు దాటింది. కాబట్టి ఇది హిట్టైతే 2000 కోట్లు పెద్ద మ్యాటర్ కాదు. కాని హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ది రాజా సాబ్, స్పిరిట్ మూవీలు 2000 కోట్ల ని మించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. స్పిరిట్ మూవీ ఇంకా సెట్స్ పైకెళ్లలేదు. అయినా ప్రీరిలీజ్ బిజినెస్సే 2800 కోట్లకు చేరుకునేలా ఉంది. 30 వేల థియేటర్స్ లో రిలీజ్ అయ్యేలా సందీప్ రెడ్డి పెద్ద ప్లానే వేస్తున్నాడు.

ఇందుకు రాజమౌళిసపోర్ట్ కూడా తీసుకుంటున్నాడు. సో దీరాజా సాబ్ ఏమాత్రం బాగున్నా, ఆగస్ట్ కంటే ముందే జులై లో వస్తే కనక 2000 కోట్ల మ్యాజిక్ నెంబర్ కి ఛాన్స్ ఉంది. కారణం అన్ని భాషల ఓటీటీ రైట్సే 350 కోట్లంటే, మిగతా రైట్స్ ఊహాతీతం. ఇక సందీప్ రెడ్డి లాంటి డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ అంటే, అంతకుమించే అంచానాలుంటాయి. కాబట్టే ఈ ఏడాది ది రాజా సాబ్ తో లేదంటే, వచ్చే ఏడాది స్పిరిట్ తో ప్రభాస్ 3000 కోట్ల రికార్డునే క్రియేట్ చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.