సౌతాఫ్రికా క్రికెట్ కాంట్రాక్ట్ లిస్ట్, సీనియర్ క్రికెటర్లకు బిగ్ షాక్
దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో పలువురు సీనియర్ ఆటగాళ్ళకు షాకిచ్చింది.2025-26 సీజన్ కోసం మెన్స్ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది.

దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో పలువురు సీనియర్ ఆటగాళ్ళకు షాకిచ్చింది.2025-26 సీజన్ కోసం మెన్స్ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. 23 మంది ఆటగాళ్లతో కూడిన ఈ స్టార్ ప్లేయర్లు హెన్రిచ్ క్లాసెన్, అన్రిచ్ నోర్జే, తబ్రైజ్ షంసీలకు చోటు దక్కలేదు.
క్లాసెన్ సౌతాఫ్రికా వైట్ బాల్ జట్టులో రెగ్యులర్ ప్లేయర్ గా కొనసాగుతున్నప్పటికి.. అతడు ఎక్కువగా ఫ్రాంచైజ్ క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో కాంట్రాక్ట్ ఇవ్వలేదు. నగతంలో క్వింటన్ డికాక్ కూడా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు కాంట్రాక్ట్‌ను వదులుకున్నాడు. మరోవైపు స్టార్ బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్‌లకు సౌతాఫ్రికా క్రికెట్ ప్రమోషన్ ఇచ్చింది. హైబ్రిడ్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో వీరిద్దరికిచోటు దక్కింది.