అయ్యో పాపం.. కరణ్ జోహార్ కు ఏమైంది.. మరీ అంత దారుణంగా మారిపోయాడేంటి..?

క‌ర‌ణ్ జోహార్.. ఈ పేరుకు బాలీవుడ్ లో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.. ఇంకా చెప్పాలంటే ఇండియన్ సినిమాలో కూడా ఈ పెరుగు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2025 | 02:50 PMLast Updated on: Apr 08, 2025 | 2:50 PM

What Happened To Karan Johar What Has Changed So Much

క‌ర‌ణ్ జోహార్.. ఈ పేరుకు బాలీవుడ్ లో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.. ఇంకా చెప్పాలంటే ఇండియన్ సినిమాలో కూడా ఈ పెరుగు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయ‌న చేసే సినిమాలే బ్రాండ్. తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజుకు ఎంత బ్రాండ్ ఉందో.. బాలీవుడ్ లో క‌ర‌ణ్ కూడా అంతే. అందుకే ఆయ‌న నిర్మించిన సినిమాల‌కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. మన తెలుగు హీరోలకు ఎంతోమందికి బాలీవుడ్లో బాటలు వేసిన నిర్మాత కరణ్ జోహార్. అంతెందుకు ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా బాహుబలిని హిందీ ఆడియన్స్ కు పరిచయం చేసింది ఈయనే. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాలను హిందీలోకి డబ్ చేసి విడుదల చేశాడు ఈ దర్శక నిర్మాత. సినిమాలు చేసినా చేయకపోయినా ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాడు కరణ్ జోహార్. ఇప్పుడు కూడా ఈయన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. దానికి కారణం ఆయన చేస్తున్న సినిమాలు కాదు.. ఆయన కనిపించిన విధానం.

తాజాగా కరణ్ జోహార్ సెల్ఫీ ఒకటి బాగా వైరల్ అవుతుంది. సెల్ఫీ వైరల్ అవడం ఏంటి అందరూ కొత్తదనం ఏముంటుంది అనుకోవచ్చు.. కానీ ఆ ఫోటో చూస్తే ఎవరికైనా లేనిపోని అనుమానాలు వస్తాయి. స్టైలిష్ ఐకాన్ లా కనిపించే కరణ్ జోహార్ అందులో మాత్రం పేషంట్ లా మారిపోయాడు. పూర్తిగా అనారోగ్యం పాలైపోయి.. నేడో రేపో అనే పేషెంట్స్ ఉంటారు కదా అలా కనిపిస్తున్నాడు ఈయన. కరణ్ జోహార్ లేటెస్ట్ సెల్ఫీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు అంటూ అయ్యో పాపం అనుకుంటున్నారు. ఈ ఫోటో చూసిన తర్వాత నిజంగానే కరణ్ జోహార్ ఏదైనా అనారోగ్యం పాలయ్యాడా అనే అనుమానాలు రాక మానవు. ఇంతకీ క‌ర‌ణ్ అనూహ్యంగా బ‌రువు త‌గ్గిపోవ‌డానికి కార‌ణ‌మేమిటి..? అత‌డు తిండి మానేసాడా..? లేదంటే ఏదైనా అనారోగ్యానికి చికిత్స తీసుకుంటున్నాడా..? ఇలా చాలా రకాల ఎంక్వయిరీలు బాలీవుడ్లో ప్రస్తుతం జరుగుతున్నాయి.

ఆయనకు చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళు కూడా కరణ్ జోహార్ ప్రస్తుతమున్న లుక్కు చూసి షాక్ అవుతున్నారు. తమకు తెలిసిన కరణ్ ఇలా ఉండేవాడు కాదు.. మనోడు ఎప్పుడు ఫుల్ జోష్ మీద ఉంటాడు.. స్టైలిష్ ఐకాన్ లా కనిపిస్తాడు.. ఇప్పుడు కనిపిస్తున్న కరణ్ జోహార్ ఎవరో మాకు తెలియదు అంటున్నారు బాలీవుడ్ సెలబ్రిటీస్. ఇంత స్పీడుగా ఎందుకు మేక్ ఓవర్ అయ్యాడు అనేది ఎవరికీ అర్థం కాని విషయం. అది నిజంగానే కొత్త లుక్ కోసం ట్రై చేశాడా లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నాడా అనేది అర్థం కావడం లేదు. ఈ విషయంపై స్వయంగా ఆయన స్పందించాల్సిన సమయం వచ్చేసింది. లేదంటే మీడియాలో, సోషల్ మీడియాలో కరణ్ జోహార్ తప్ప మరో టాపిక్ ఉండదు. అన్నట్టు ఈమధ్య ఎక్కువగా సినిమాలు కూడా చేయడం లేదు ఈయన. దాంతో నిజంగానే హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నాడేమో అని అనుమానాలు మరింత బలపడుతున్నాయి.