సాయిరెడ్డి జగన్ కొంప కూల్చబోతున్నాడా?
నిన్న మొన్నటి వరకు ఆయన నెంబర్ 2. జైల్లోనూ.... పాలిటిక్స్ లోను... పార్టీలోనూ వైసీపీ అధినేత జగన్ తో కలిసి అడుగులేసాడు. జగన్ తర్వాత సాయిరెడ్డికే ఆ పార్టీలో హవా నడిచింది.

నిన్న మొన్నటి వరకు ఆయన నెంబర్ 2. జైల్లోనూ…. పాలిటిక్స్ లోను… పార్టీలోనూ వైసీపీ అధినేత జగన్ తో కలిసి అడుగులేసాడు.
జగన్ తర్వాత సాయిరెడ్డికే ఆ పార్టీలో హవా నడిచింది. అలాంటి సాయిరెడ్డి ఇప్పుడు వైసీపీని వదిలి వచ్చి, ఆ పార్టీపైనే కార్పెట్ బాంబింగ్ చేస్తున్నారు. ఆ పార్టీ మూల స్తంభాలను కుదిపేస్తున్నారు.జగన్ కి ఏమీ తెలియదు అంటూనే పార్టీలో కీలక నాయకులు అందర్నీ ఇరికించేస్తున్నాడు. సాయిరెడ్డినీ చూస్తుంటే బిజెపి, టిడిపి లతో అండర్స్టాండింగ్ తోనే అడుగులు వేస్తున్నాడనేది అర్థమవుతుంది.
జగన్ నీ చాలా ప్రేమించాను ఇప్పుడు ప్రేమ లేదు అందుకే పార్టీ వదిలి వచ్చేసాను.ఇలాంటి మాటలు డైజస్ట్ చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి కూడా కష్టమే. జగన్ని చెల్లెలు షర్మిల కన్నా బలమైన దెబ్బ కొట్టాడు సాయి రెడ్డి. జగన్ చేసిన ప్రతి ఆర్థిక నేరంలోనూ భాగస్వామి అయిన విజయ సాయి , జగన్ ఇచ్చిన అపారమైన అధికారాన్ని, పదవుల్ని, పరిచయాల్ని అనుభవించి…. ఎంజాయ్ చేసి ఇప్పుడు జగన్ ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
వైసీపీలో వర్గ పోరు ఉందని అందరికీ తెలుసు. జగన్ చుట్టూ 4 వర్గాలు పనిచేస్తాయి. ఒకటి జగన్కు అత్యంత సన్నిహిత వర్గం, రెండు సజ్జల రామకృష్ణారెడ్డి వర్గం, మూడు వై వి సుబ్బారెడ్డి వర్గం, నాలుగు విజయసాయిరెడ్డి వర్గం. సజ్జల, వై వి వర్గాలతో విజయ సాయి కి నిత్యం వర్గ పోరు నడుస్తూనే ఉండేది. అందుకే విజయసాయిరెడ్డిని దూరంగా తీసుకెళ్లి ఉత్తరాంధ్రకు ఇన్చార్జి చేశాడు జగన్. ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని ఉత్తరాంధ్రను వనికించేశాడు విజయ్ సాయి. రాష్ట్రం మొత్తం వైసిపి ఓడిపోవడానికి జగన్ కారణమైతే ఉత్తరాంధ్రలో దారుణంగా ఓడిపోవడానికి మాత్రం సాయి రెడ్డి కారణం. అలాంటి సాయిరెడ్డి ఇప్పుడు జగన్ చుట్టూ కోటరీ ఉందని కొత్త రాగం అందుకున్నాడు.
అంతేకాదు ఏకకాలంలో సుబ్బారెడ్డిని, సజ్జలను, మిగిలిన వాళ్ళందర్నీ ఇరికించేశాడు సాయి రెడ్డి. విజయ సాయిరెడ్డిది అత్యంత షార్ప్ బ్రెయిన్ క్రిమినల్ మైండ్ అని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. అది ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించాడు సాయి రెడ్డి. కాకినాడ సీ పోర్టు వాటాల బదలాయింపు స్కాం జరిగింది నిజమేనని, దానికి వై వి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి కర్త ,క్రియ ,కర్మ అని సిఐడి కే కాక, బహిరంగంగా కూడా చెప్పడం ద్వారా జగన్ ని రాజకీయంగా, సుబ్బారెడ్డిని లీగల్ గా దెబ్బ కొట్టాడు సాయి రెడ్డి. అంతేకాదు లిక్కర్ స్కాం జరిగిందనేది కూడా సాయి రెడ్డి చెప్పడం విశేషం. లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని, మిధున్ రెడ్డిని, ఏకంగా జగన్మోహన్ రెడ్డిని ముగ్గురుని ఇరికించాడు విజయ సాయి.
ఇన్నేళ్లు జగన్తో అంట కాగి, ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చి సాయి రెడ్డి మాట్లాడుతున్న మాటలు….. ఎన్నాళ్ళ నుంచో ఆయన మనసులో పొంగి పొర్లుతున్న అగ్నిపర్వతం లావాను గుర్తుచేస్తున్నాయి. జగన్ సామ్రాజ్యాన్ని నిర్మించడంలో పాత్ర పోషించిన విజయసాయి రెడ్డి…. ఇప్పుడు అదే సామ్రాజ్యాన్ని కోల్చడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మున్ముందు ఇంకెన్ని సంచలనాలు బయట పెట్టబోతున్నాడో.