దూల తీరింది… దరిద్రం వదిలింది, దువ్వాడని వదిలించుకోవడానికి జగన్ డిసైడ్

వైసీపీలో వాళ్లంతా ఇలాగే ఉంటారా? అసలు అది రాజకీయ పార్టీయేనా? ఒకడు జిప్ విప్పి చూపిస్తాడు. ఇంకొకడు శవాన్ని పార్సిల్ చేసి గుమ్మం ముందు పెడతాడు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 23, 2025 | 07:33 PMLast Updated on: Apr 23, 2025 | 7:33 PM

Jagan Decides To Get Rid Of Duvvada

వైసీపీలో వాళ్లంతా ఇలాగే ఉంటారా? అసలు అది రాజకీయ పార్టీయేనా? ఒకడు జిప్ విప్పి చూపిస్తాడు. ఇంకొకడు శవాన్ని పార్సిల్ చేసి గుమ్మం ముందు పెడతాడు. మరొకడు బాబాయిని లేపేస్తాడు. వేరొకడు పెళ్ళాన్ని వదిలేసి, ముసలి వయసులో ప్రియురాలిని వెంటబెట్టుకొని స్టూడియోలు తిరుగుతాడు.వైసిపి లీడర్ల గురించి జనం మాట్లాడుకునే మాటలివి. అసలు ఇలాంటి వాళ్ళని ఆ జగన్ ఎలా ఎంటర్టైన్ చేస్తున్నాడు? సిగ్గు అనిపించడం లేదా? అంత దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళని వెంట వేసుకుని తిరగడం అవసరమా? ఇలాంటి విమర్శలకు ఆలస్యంగా కళ్ళు తెరిచిన జగన్ తొలి వేటు దువ్వాడ శ్రీను పై వేశాడు. దువ్వాడను వైసిపి నుంచి సస్పెండ్ చేశారు.

దువ్వాడ శ్రీనివాస్. శ్రీకాకుళంలో పాపులర్ వైసీపీ లీడర్. కొన్నాళ్లు టిడిపిలోనూ , ఇంకొన్నాళ్ళు పిఆర్పి లోను వెలగబెట్టి చివరికి జగన్ పంచన చేరాడు. తనను తాను జగన్ ప్రధాన సైనికుడిగా చెప్పుకుంటాడు. ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకపోయినా జగన్ కరుణతో ఎమ్మెల్సీ అయ్యాడు. చివరికి నాకు అన్నీ ఇచ్చిన భార్య వాణిని , పిల్లల్ని వదిలిపెట్టి వైసీపీ మహిళా నేత
మాధురిని వెంటేసుకొని తిరగడం మొదలుపెట్టాడు. సిగ్గు శరం లేకుండా ఓపెన్ గానే ఇద్దరు కొత్త ప్రేమికుల్లా ఊళ్ళన్ని తిరుగుతూ
ఇంటర్వ్యూలు ఇస్తూ సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అసలు తాను ఒక ఎమ్మెల్సీనని, పెద్దల సభ ప్రతినిధిననే విషయమే మర్చిపోయి దువ్వాడ శ్రీనివాస్ శృతిమించి చిల్లర వేషాలు వేశాడు. మాధురి అనే మహిళకు భర్త, పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ కు భార్య పిల్లలు ఉన్నారు. ఆమె తన కుటుంబాన్ని గాలికి వదిలేసింది. దువ్వాడ తన ఫ్యామిలీని బజారుకెక్కించాడు. ఇద్దరు కలిసి కాపురం పెట్టారు. దువ్వాడ భార్య వాణి ,పిల్లల్ని వెంటపెట్టుకొచ్చి అతని ఇంటి ముందే ధర్నా చేసింది. అయినా ఏం జరగనట్టే దువ్వాడ శ్రీనివాస్, మాధురిని వెంటేసుకుని దేశం మీద పడ్డాడు.

పార్టీ లేదు…. పాలిటిక్స్ లేవు… ప్రజా సంక్షేమం అసలే లేదు…. ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూలు ఇస్తూ…. తమకు పుట్టబోయే బిడ్డ గురించి ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారం అంతా జరగక ముందే వాణి జగన్ కి ఫిర్యాదు చేసింది. దువ్వాడని పిలిచి జగన్ చివాట్లు వేశాడు. పార్టీ పెద్దలతో చెప్పించాడు. అయినా దువ్వాడలో మార్పురాలి. డ్రామా ఎక్కడ ఆపలేదు. పార్టీలో ఒకరిద్దరు సన్నిహితులు నీవల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోంది అని హెచ్చరించిన….. నాయన కూడా లైట్ తీసుకున్నాడు శీను. అసలు తాను మాధురి వల్లే పార్టీకి ప్రతిష్ట పెరుగుతుంది అన్నంత బిల్డప్ ఇచ్చాడు. గత కొద్ది రోజులుగా వీళ్ళ వ్యవహారం యూట్యూబ్ చానల్స్, టీవీల్లో చూస్తూ జనం చీదరించుకుంటున్నారు. సందట్లో సడేమియాలా…. హైదరాబాదులో శ్రీను మాధురి తో బట్టల వ్యాపారం మొదలుపెట్టిచ్చాడు. అక్కడినుంచి ఇద్దరు ఇంకా శృతిమించిపోయారు. అంతా పార్టీలో చర్చకు వచ్చింది. దువ్వాడ శ్రీను మాధురి లాంటి వాళ్ల వల్లే పార్టీ బ్రష్టు పట్టి పోయిందని, అతని విషయంలో ఉపేక్షించాల్సిన అవసరం లేదని కొందరు జగన్ కి సలహా ఇచ్చారు.

సహజంగా తనకు విశ్వసనీయంగా ఉంటారని అనిపిస్తే వాళ్లని ఎంతవరకైనా అనుమతిస్తాడు జగన్. దీన్ని లోకువగా తీసుకొని చాలామంది పవర్ లో ఉన్నప్పుడు చెలరేగిపోయారు. గోరంట్ల మాధవ్, అనిల్ కుమార్ యాదవ్, అనంత బాబు, విడుదల రజిని, రోజా, దువ్వాడ శ్రీనివాస్ వీళ్లంతా లాయలిస్టులు పేరుతో అరాచకం సృష్టించారు. ఇప్పుడు జగన్ దగ్గర ఇదే చర్చ జరుగుతుంది. అందుకే మొదటి వేటు దువ్వాడ మీద వేసేయాలని డిసైడ్ అయ్యారు జగన్.

పీఏసీ మీటింగ్ ముగియగానే దువ్వాడని పిలిచి చడమడ తిట్టాడట జగన్. నీ పర్సనల్ లైఫ్ ఎలాగైనా పెట్టుకో…. నాకు అనవసరం కానీ నీవల్ల పార్టీకి నష్టం జరిగితే మాత్రం ఊరుకోను. నువ్వు ఆమె కలిసి ఆ స్టూడియోలకు తిరగడమేంటి…. ఆ పిచ్చ వేషాలు ఏంటి అని దువ్వాడని వాయించేశాడు జగన్ .ఒక్క మాటేనా మాట్లాడకుండా ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు దువ్వాడ. వెంటనే సస్పెన్షన్ ఆర్డర్ విడుదలైంది. దువ్వానికి ఇప్పుడు మరో ఛాన్స్ కూడా లేదు. వేరే పార్టీలోకి వెళ్లిన ఎవరు ఆదరించే పరిస్థితి లేదు. జగన్ కరుణిస్తే పార్టీలో ఉండాలి. వైసిపి కూడా దండం పెట్టి మాధురితో మిగిలిన జీవితం గడపాలి. ముసలి వయసు ప్రేమ గెలుస్తుందా? రాజకీయం గెలుస్తుందో ?వేచి చూద్దాం.