ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్, కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండో టెస్ట్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి మొదలుకాబోతోంది. ఇప్పటికే తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి మ్యాచ్ లో జైశ్వాల్, విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. అటు బౌలింగ్ లో బూమ్రాకు తోడు మిగిలిన బౌలర్లూ రాణించి ఆల్ రౌండ్ షోతో కంగారూలు చిత్తు చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 30, 2024 | 06:49 PMLast Updated on: Nov 30, 2024 | 6:49 PM

The Second Test Against Australia Records That Are Cheering Kohli

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండో టెస్ట్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి మొదలుకాబోతోంది. ఇప్పటికే తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి మ్యాచ్ లో జైశ్వాల్, విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. అటు బౌలింగ్ లో బూమ్రాకు తోడు మిగిలిన బౌలర్లూ రాణించి ఆల్ రౌండ్ షోతో కంగారూలు చిత్తు చేశారు. అయితే రెండో టెస్టు పింక్ బాల్ తో ఆడనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ డే నైట్ మ్యాచ్ లోనూ తమ జోరు కొనసాగించాలని భారత్ ఎదురుచూస్తుంటే… సిరీస్ సమం చేయాలని ఆసీస్ పట్టుదలగా ఉంది. పెర్త్ టెస్టులో అజేయ శతకంతో చెలరేగిన విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లో పలు రికార్డులపై కోహ్లి కన్నేశాడు. అడిలైడ్ టెస్టులో మరో 23 పరుగులు సాధిస్తే.. డే నైట్ టెస్టుల్లో 300 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా కోహ్లి ఘనత సాధిస్తాడు.

అలాగే పింక్ బాల్ టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు కూడా విరాట్ పేరిటే ఉంది. డే నైట్ టెస్టులో ఎక్కువ రన్స్ చేసి భారత ఆటగాళ్ళ జాబితాలో కోహ్లీ, రోహిత్ శర్మ , శ్రేయస్ అయ్యర్ తొలిమూడు స్థానాల్లో ఉన్నారు. కాగా, వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా రికార్డును అడిలైడ్ టెస్టులో కోహ్లి బ్రేక్ చేసే అవకాశం ఉంది. మరో 102 పరుగులు సాధిస్తే అడిలైడ్ వేదికలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక జట్టు బ్యాటర్‌గా లారా రికార్డును కోహ్లి అధిగమిస్తాడు. అడిలైడ్‌లో లారా 611 పరుగులు చేయగా కోహ్లి 509 పరుగులు చేశాడు. అయితే మరో 44 పరుగులు చేస్తే సర్ వివ్ రిచర్డ్స్‌ను కోహ్లి దాటేస్తాడు. అడిలైడ్ వేదికగా అత్యధిక పరుగులు సాధించిన పర్యాటక జట్టు బ్యాటర్లలో బ్రియాన్ లారా అగ్రస్థానంలో ఉంటే.. సర్ వివ్ రిచర్డ్స్ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లి మూడో స్థానంలో ఉండగా.. వాలీ హమ్మండ్ , లియోనార్డ్ హట్టన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.