పొట్టలో కత్తితో ఆటోలో హాస్పిటల్ కు సైఫ్.. తండ్రి ప్రాణాల కోసం రిస్క్ చేసిన కొడుకు

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. ఈ దాడిలో సైఫ్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ను వెంటనే ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 16, 2025 | 07:36 PMLast Updated on: Jan 16, 2025 | 7:38 PM

Saif Taken To Hospital In Auto With Knife In Stomach Son Risks His Fathers Life

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. ఈ దాడిలో సైఫ్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ను వెంటనే ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో సైఫ్ వెన్నుముఖ వద్ద తీవ్రంగా గాయాలు అయినట్టు గుర్తించారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి ముంబై ఆస్పత్రి వైద్యులు కీలక ప్రకటన ప్రకటన చేసారు. లీలావతి ఆసుపత్రికి చెందిన డాక్టర్ నితిన్ డాంగే మాట్లాడుతూ, గుర్తు తెలియని వ్యక్తి చేసిన దాడి ఘటనతో బాలీవుడ్ స్టార్ నటుడు ఉదయం 2 గంటలకు ఆసుపత్రిలో చేరాడని పేర్కొన్నారు.

వెన్నెముకలో కత్తితో దాడి చేయడంతో.. అతని థొరాసిక్ స్పైనల్ కార్డ్‌ కు పెద్ద గాయమైనట్టు తేల్చారు. ఆ కత్తితోనే ఆయన ఆస్పత్రికి వచ్చినప్పుడు అలాగే ఉందని.. ఆస్పత్రికి వచ్చిన తర్వాత.. కత్తిని తొలగించి వెన్నెముక వద్ద బ్లీడింగ్ ఆగడానికి సర్జరీ చేసామని తెలిపారు. అతని ఎడమ చేతిపై మరో రెండు లోతైన గాయాలు ఉన్నాయని.. అతని మెడపై కూడా గాయాలు అయినట్టు వివరించారు. వెంటనే ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ టీం.. వైద్యం చేసినట్టు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నారని, ఏ ప్రమాదం లేదన్నారు.

గురువారం ఉదయం బాంద్రాలోని తన నివాసంలో సైఫ్ దాడికి గురయ్యాడు. అతని ఇంట్లో దొంగతనానికి వచ్చిన నిందితుడు… ఈ క్రమంలో సైఫ్ అలీ ఖాన్ పై దాడికి పాల్పడ్డాడు. అయితే సైఫ్ అలీఖాన్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో అతని పెద్ద కుమారుడు ఇబ్రహీం.. ఆటో రిక్షాలో లీలావతి ఆసుపత్రికి తరలించాడు. కారు బయల్దేరడానికి సిద్దంగా లేకపోవడంతో ఆటో మాట్లాడి వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించాడు. 23 ఏళ్ళ ఇబ్రహీం.. ఆ సమయంలో డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో కారు రావడానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఈ రిస్క్ చేసాడు.

తండ్రి వెనుక భాగంలో కత్తి ఉన్నా సరే ధైర్యంగా ఆస్పత్రికి తీసుకెళ్ళాడు. దాడి చేసిన వ్యక్తి రాత్రంతా సైఫ్ అలీ ఖాన్ నివాసంలోనే ఉన్నాడని ముంబై లోకల్ మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో ఆధారాల కోసం పోలీసులు శ్రమిస్తున్నారు. ఫ్లోర్ పాలిషింగ్ పనులు జరుగుతున్నందున రెండు రోజుల నుంచి సైఫ్ నివాసానికి వచ్చిన కార్మికులను పోలీసులు ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే ఆయన భద్రతలో ఉన్న ముగ్గురు సిబ్బందిని ఇప్పటికే ప్రశ్నించగా, ఒక మహిళా ఉద్యోగి కూడా ఈ ఘటనలో గాయపడ్డారని ముంబై మీడియా పేర్కొంది. ఇక సైఫ్ ఇంట్లోకి ఎవరు వచ్చారు అనే దానిపై పోలీసులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. సీసీ ఫూటేజ్ లో కూడా అతను ఎవరు అనేది గుర్తించడం కష్టంగానే మారింది. పక్కా ప్లానింగ్ తోనే అతను ఇంట్లోకి చొరబడినట్టు భావిస్తున్నారు.