లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ ఎన్ని జట్లకు అవకాశమో తెలుసా ?
ఒలింపిక్స్ లో క్రికెట్ రీఎంట్రీ ఇవ్వడం ఇప్పటికే ఖాయమవగా... 2028 లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగే విశ్వక్రీడల్లో జెంటిల్మెన్ గేమ్ ను చూడబోతున్నాం. చివరి సారిగా 1900లో ఒలింపిక్స్ లో క్రికెట్ జరిగింది.

ఒలింపిక్స్ లో క్రికెట్ రీఎంట్రీ ఇవ్వడం ఇప్పటికే ఖాయమవగా… 2028 లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగే విశ్వక్రీడల్లో జెంటిల్మెన్ గేమ్ ను చూడబోతున్నాం. చివరి సారిగా 1900లో ఒలింపిక్స్ లో క్రికెట్ జరిగింది. అదే మొదటిసారి.. చివరిసారిగా నిలిచింది. బ్రిటన్, ఫ్రాన్స్‌కు చెందిన జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. బ్రిటన్ ఇందులో గెలుపొందింది. మళ్లీ దాదాపు 128 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్ లో క్రికెట్‌కు చోటు దక్కింది.
ఇదిలా ఉంటే 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ కు సంబంధించి ఎన్ని జట్లు పాల్గొంటాయనే విషయంపై క్లారిటీ వచ్చింది. ఈ క్రీడల్లో కేవలం ఆరు జట్లు మాత్రమే క్రికెట్‌లో పోటీ పడనున్నాయి. పురుషులు, మహిళల విభాగాల్లో ఇదే వర్తించనుంది. టీ20 ఫార్మాట్‌లో మ్యాచులు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఒలింపిక్స్ నిర్వహకులు ధ్రువీకరించారు.పురుషుల విభాగంలో మొత్తం అథ్లెట్ల కోటాను 90గా ఖరారు చేశారు. ఇందులో పాల్గొనే ఆరు జట్లూ.. 15 మందితో స్క్వాడ్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. ర్యాంకింగ్స్‌లో టాప్-6లో నిలిచిన జట్లు మాత్రమే ఈ క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంది.
యితే అమెరికా హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న నేపథ్యంలో వారికి మాత్రం నేరుగా ప్రవేశం దక్కే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. దీని బట్టి, మిగతా ఐదు స్థానాలకు మాత్రం ర్యాంకింగ్స్ లో జట్టు పోటీ పడాలి.ప్రస్తుతం పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ టాప్ 5లో ఉన్నాయి. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారత్, దక్షిణాఫ్రికా జట్లు ముందున్నాయి. కానీ 2028 ఒలింపిక్స్ ఇంకా నాలుగేళ్లు సమయం ఉంది కాబట్టి, ఈ ర్యాంకింగ్స్‌లో మార్పులు జరగొచ్చు.
ప్రస్తుతం సూర్యకుమార్ సారథ్యంలోని భారత పురుషుల జట్టు టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది. టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. హర్మన్ ప్రీత్ సారథ్యంలో మహిళల టీ20 జట్టు కూడా మూడో ప్లేసులో ఉంది.దీంతో పురుషులు, మహిళల విభాగాల్లో భారత్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. క్రికెట్ లో మన ఫామ్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా మెడల్స్ దక్కుతాయని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒలింపిక్స్ లో భారత్, పాక్ క్రికెట్ సమరాన్ని వీక్షించే అవకాశం అభిమానులకు దక్కకపోవచ్చు. ఎందుకంటే ఆ దేశ పురుషుల జట్టు ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉంది. మహిళల జట్టు ఎనిమిదో స్థానంలో ఉంది. పాకిస్థాన్ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే, వారు టాప్ – 5లో చోటు సంపాదించుకోవడం కోసం గట్టిగానే పోటీ పడాల్సిన అవసరం ఉంటుంది.
మరోవైపు భారత ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని.. మ్యాచ్ వేదికలను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. క్రికెట్ మ్యాచులను న్యూయార్క్‌లో నిర్వహించే అవకాశం ఉంది.