అడుగుపెట్టాగానే మారిన ముహుర్తం.. సమ్మర్ కి 1000 కోట్ల సునామీ..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మొత్తానికి డ్రాగన్ సెట్లో అడుగుపెట్టాడు. ఏప్రిల్ 22 కి ఒకరోజు ముందుగానే ప్రశాంత్ నీల్ తో ప్రశాంతంగా కదా చర్చ లు చేశాడు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మొత్తానికి డ్రాగన్ సెట్లో అడుగుపెట్టాడు. ఏప్రిల్ 22 కి ఒకరోజు ముందుగానే ప్రశాంత్ నీల్ తో ప్రశాంతంగా కదా చర్చ లు చేశాడు. అంతా సముద్రపు ఒడ్డుమీదే… త్రిబుల్ ఆర్ అంతా జంగల్, లోనే ఉంటే దేవర మొత్తం సముద్రంతోనే నింపేశారు. ఇప్పుడు డ్రాగన్ మూవీని కొండలు, గుట్టలు, చైనా, కొరియా దేశాలు, అక్కడి డాన్ ల మధ్య యుద్దాలతో నింపేసేలా ఉన్నారు. అసలు యుద్దం కోసం సెట్లో ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ మాసో ఎంట్రీ ఇచ్చాడు. ఐతే 2026 సంక్రాంతికి డ్రాగన్ ని రిలీజ్ చేయాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడు. కాని వార్ 2 మూవీ కొంపముంచింది. 3 నెలలు ఆ హిందీ సినిమా షూటింగ్ డిలే అవటంతో, దాని ఎఫెక్ట్ డ్రాగన్ మీద పడినట్టుంది. అంతే సంక్రాంతికి రావాల్సిన డ్రాగన్ పక్కాగా సమ్మర్ నే టార్గెట్ చేసుకుంటున్నాడు. బేసిగ్గా ఇలా కలిసొచ్చే పండగని వదులుకుంటే వసూళ్ల వరద తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాని విచిత్రంగా 1100 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ కి మరో 2 వందలకోట్లు అదనంగా కలిసొచ్చేలా ఉన్నాయి… అదెలా? టేకేలుక్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినమూవీ డ్రాగన్. హీరో లేకుండా ఉండే సీన్లనే తీస్తూ వచ్చిన ప్రశాంత్ నీల్, కోసం రంగంలోకి దిగాడు ఎన్టీఆర్. ఆల్రెడీ సముద్రపు ఒడ్డునే మీటింగ్ జరిగింది. మంగుళూరు కోటలో వేసిన గ్రాండ్ సెట్ లో భారీ ఫైట్ సీక్వెన్స్ తో ఎన్టీఆర్ తన వేగం పెంచుతున్నాడు.యుద్ద ట్యాంకర్ తోనే ఫైట్ చేసే బ్లాస్టింగ్ యాక్సన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్, మంగుళూరు కోటలోనే వరుసగా 3 వారాలు ఈ యాక్షన్ సీక్వెన్స్ తీస్తాడని తెలుస్తోంది. ఇది ఓరకంగా ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ తో పాటు, ప్రీ క్లైమాక్స్ సీన్ ని తీస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఏకంగా 10 వేల మంది స్టంట్ మెన్ లతో ప్లాన్ చేసిన ఈ యాక్షన్ సీక్వెన్స్ లో, నిజానికి 1000 మంది నటించబోతున్నారు.
వీల్లనే సీజీ వర్క్ సాయంతో పదివేల మందిలా చూపించబోతున్నారట. 550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నిజానికి 2026 సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేశారు. జనవరి 9న రిలీజ్ అని కూడా ముందే తేల్చారు. కాని అదే జరిగేలా లేదు. సమ్మర్ కి అంటే ఎగ్జాక్ట్ గా ఏప్రిల్ 10 లేదంటే 14 కి ఈ సినిమా రిలీజ్ అయ్యేలా ఉంది.బేసిగ్గా ఇలాంటి వాయిదాలు ఎవరినైనా నిరుత్సాహపరుస్తాయి. కాని డ్రాగన్ టీం కి మాత్రం ఈ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవటం కలసొస్తోంది. డ్రాగన్ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ 900 కోట్ల నుంచి 1100 కోట్ల వరకు జరిగేలా కనిపిస్తోంది. ఇక ఇది సమ్మర్ కి వాయిదా పడటంతో మరో 200 కోట్లు అదనంగా కలిసొస్తున్నాయట. అవే ఓటీటీ రైట్స్, ఓవర్ సీస్ రైట్స్… ముందుగా ఈమూవీ ఓటీటీ రౌట్స్ 180 కోట్లని ప్రచారం జరిగింది. కాని మరో వందకోట్లు అదనంగా అంటే 280 కోట్ల వరకు ఓటీటీ రైట్స్ సేల్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక ఓవర్ సీస్ రైట్స్ ఇంతవరకు ఇండియన్ సినిమాల్లో వేటికీ 200 కోట్ల సీన్ రాలేదు.
ఇప్పుడు 200 కోట్లకు యూఎస్, యూరప్ రైట్స్ సేల్ అయ్యేలా డిస్కర్షన్ జరుగుతోంది.లేట్ అయితే అవుతోంది కాని, డ్రాగన్ మూవీ రిలీజ్ కి ముందే 900 కోట్ల నుంచి 1300 కోట్ల మధ్య ప్రీరిలీజ్ చేసే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అది కూడా ఎన్టీఆర్ సెట్లో అడుగుపెట్టే టైంలో, ఇలా జరగటంతో, ఫిల్మ్ టీం పండగ చేసుకుంటోంది.