NTR లుక్ తో లింకు… డ్రాగన్ లుక్ వచ్చాకే పుష్పరాజ్ వచ్చేది..
డ్రాగన్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ లుక్ ఎలా ఉంటుందో, మోషన్ పోస్టర్ లో ఎప్పుడో చూపించాడు ప్రశాంత్ నీల్. కాని అది ఇందులో హీరో అసలు లుక్ మాత్రం కాదు..

డ్రాగన్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ లుక్ ఎలా ఉంటుందో, మోషన్ పోస్టర్ లో ఎప్పుడో చూపించాడు ప్రశాంత్ నీల్. కాని అది ఇందులో హీరో అసలు లుక్ మాత్రం కాదు.. కేవలం ప్రమోషన్ లో భాగంగా, వర్కింగ్ టైటిల్ లానే, ప్రమోషనల్ లుక్ అది.మరి డ్రాగన్ గా ఎన్టీఆర్ అసలు లుక్ ఎలా ఉంటుందో మే 20 నే తేలబోతోందా? బర్త్ డే రోజే తన లుక్ ని రివీల్ చేసే అవకాశం ఉంది. బేసిగ్గా తన లుక్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఎదురు చూడటం కామన్. కాని తన లుక్ కోసం పుష్పరాజ్ ఎదురు చూస్తున్నాడు. ఎన్టీఆర్ లుక్ తేలితే తప్ప, తను ఒక నిర్ణయానికి వచ్చేలా లేడు. ఇంతకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి రెండు హిట్లు పడ్డాక ఎన్టీఆర్ తో వచ్చిన కొత్త టెన్షన్ ఏంటి..? ఎందుకు తన లుక్ కోసం ఈ హీరో అంత ఈగర్ గా వేయిట్ చేస్తున్నాడు..? హావేలుక్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే కి ఒక రోజు ముందు డ్రాగన్ ప్రోమో రాబోతోంది. మోషన్ టీజర్ ముందే వస్తుందన్నారు కాని, అది టీజర్ తో కలిపే రాబోతోంది. మే 19న తన బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ తోపాటు మోషన్ టీజర్, ప్రోమోతో కలిపి సాలిడ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం. ఐతే ఈ టీజర్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంటే కూడా ఎక్కువ ఈగర్ గా వేయిట్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .ఎన్టీర్ మీసం తీసేసిన లుక్ తో వార్ 2 లో కనిపిస్తాడని అందరికి తెలుసు..ఎందుకంటే తను సెట్లో ఆలుక్ తో కలిపించాడు కాబట్టి. అలాని అదే తన అసలు లుక్ అనుకోలేం. కాకపోతే ఒక అంచనాకు మాత్రం రావొచ్చు. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ లో తన లుక్ ఎలా ఉంటుందో, సెట్లో తన లుక్ తోరివీలైంది.
లీకైన షూటింగ్ సీన్ తాలూకు వీడియోలో లీకైంది.. కాబట్టి పాన్ వరల్డ్ ప్రాజెక్టులో తన లుక్ ఇదని ఎప్పుడో తేలింది. ఇక రామ్ చరణ్ పెద్దిలో ఎలా ఉంటాడో పోస్టర్ తోపాటు, ప్రోమోని వదిలి బుచ్చి బాబు సనా ఎప్పుడో మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు.సో పాన్ ఇండియా హీరోల్లో అల్ మోస్ట్ అందరి లుక్ రివీలైంది. ది రాజా సాబ్ లో ప్రభాస్ లుక్కు, ఫౌజీలో తన గెటప్ ఎలా ఉంటుందో తేలింది. స్పిరిట్ లో మాత్రమే తను ఎలా ఉంటాడో తేలలేదు. అసలు ఆ ప్రాజెక్ట్ ఇంకా లాంచ్ కాలేదు కాబట్టి, ఇప్పుడప్పడే తన లుక్ రివీల్ అయ్యే ఛాన్స్ లేదు.
సో ఈ మొత్తం లిస్ట్ లో మిగిలింది ఎవరైనా ఉన్నారంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జునే. తను అట్లీ మేకింగ్ లో 600 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసుకున్నాడు. సూపర్ హీరో లాంటి జోనర్ ని టచ్ చేయబోతున్నాడు. అందుకే తన లుక్ విషయంలో క్లారిటీ కోసం ఫిల్మ్ టీం ఇంకా లుక్ టెస్టులతో ఫిక్స్ అయ్యింది.అయితే ప్రభాస్, యష్, ఎన్టీఆర్ ఈముగ్గురు పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ అవటమే కాదు, నార్త్ ఇండియా లో మాస్ ఫాలోయింగ్ తెచ్చుకోవటానికి కారనం, పాన్ ఇండియా హిట్ల తర్వాత కూడా ఊర మాస్ పాత్రలు వేయటమే. ఎన్టీఆర్ అయితే దేవరతో నార్త్ మాస్ ఆడియన్స్ లోకి చొచ్చుకెళ్లాడు. అందులో తన లుక్ కూడా మాస్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే డ్రాగన్ లుక్ వచ్చాక, అప్పుడు తన లుక్ లో ఏమైనా మార్పులు అవసరం అయితే, వాటిని రిసెట్ చేసి బయటికి వదలాలనుకుంటున్నాడట బన్నీ,
అసలు ఎన్టీఆర్ తోపోల్చుకోవాల్సిన అవసరం తనకు లేకున్నా… ఎందుకు తను జోడికట్టిన జాన్వీతోనే బన్నీ జోడీ కట్టాలనుకోవటం, తనతో డ్రాగన్ తీస్తున్న ప్రశాంత్ నీల్ తోపాటు, దేవర 2 పనుల్లో బిజీ అయినా కొరటాల శివని కలవటం.. ఇవన్నీ ఎన్టీఆర్ ఎటు వెళితే ఆదారిలో బన్నీ నడుస్తున్నాడనే డౌట్లకు కారణమయ్యాయి. ఇప్పుడు లుక్ టెస్ట్ చేసిన ఫుటేజ్ ని రివీల్ చేయబోతే, మే 20 తర్వాతే చూద్దామన్నాడట బన్నీ.. ఆమాటనే ఇటు డ్రాగన్ తో కనెక్ట్ చేసి, ఇలా ప్రచారం పెంచారు..