చనిపోయిన పదేళ్ల తర్వాత పాట పాడిన సింగర్.. రవితేజ సినిమాలో మాస్ జాతర..!

టెక్నాలజీ పెరిగిన తర్వాత అసాధ్యం అనేది ఏదీ లేదు. మనకు మనసులో అనిపించలేదు కానీ.. దాన్ని ఎలాగైనా స్క్రీన్ మీద చూపించొచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2025 | 01:16 PMLast Updated on: Apr 15, 2025 | 1:16 PM

Singer Who Sang A Song Ten Years After His Death Mass Jatara In Ravi Tejas Movie

టెక్నాలజీ పెరిగిన తర్వాత అసాధ్యం అనేది ఏదీ లేదు. మనకు మనసులో అనిపించలేదు కానీ.. దాన్ని ఎలాగైనా స్క్రీన్ మీద చూపించొచ్చు. చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించొచ్చు. ఒక్క సినిమాకు మాత్రమే ఉన్న పవర్ అది. ఇక AI వచ్చిన తర్వాత.. దాన్ని మరింత అద్భుతంగా వాడుకుంటున్నారు మన దర్శకులు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో మనం నమ్మలేని ఎన్నో విషయాలను మన కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా రవితేజ మాస్ జాతర సినిమా కోసం 11 సంవత్సరాల కింద చనిపోయిన చక్రి వాయిస్ మరోసారి క్రియేట్ చేశారు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సంచలన సినిమాలకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు చక్రి. ఈయన పాటలను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. చాలా తక్కువ టైంలోనే 100 సినిమాలకు పైగా మ్యూజిక్ ఇచ్చాడు చక్రి. అప్పట్లో పూరి జగన్నాథ్, ఈయన కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు సంచలన విజయం సాధించాయి. ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీతం అందించిన చక్రి.. కేవలం 40 ఏళ్ళ వయసులో 2014 డిసెంబర్లో గుండెపోటుతో కన్నుమూశాడు.

అప్పట్లో చక్రి మరణం ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. కొన్నాళ్ళ వరకు తెలుగు ఇండస్ట్రీ కూడా చక్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇదంతా ఇలా ఉంటే చక్రికి రవితేజతో చాలా మంచి స్నేహం ఉంది. కెరీర్ మొదట్లో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు అద్భుతమైన విజయం సాధించాయి. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, నేనింతే సినిమాలలోని పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమాలో చక్రికి మంచి ట్రిబ్యూట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. ఇడియట్ సినిమాలో చాట్ బస్టర్ గా నిలిచిన చూపులతో గుచ్చి గుచ్చి చంపకే సాంగ్ ట్యూన్ తీసుకొని.. ఇందులో ఒక పాట చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్. ఆ పాటలో చక్రి వాయిస్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో రీ క్రియేట్ చేశారు. అచ్చం ఆయన పాడినట్టే ఈ పాటను మళ్ళీ పాడించారు. వేరే సింగర్ తో పాట పాడించి.. దానికి చక్రి వాయిస్ AI లో జోడించారు. ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందిప్పుడు.

ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మాస్ జాతర సినిమా.. ఈ పాటతో ఒక్కసారిగా వైలెంట్ అయిపోయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. వరుస విజయాలతో జోరు మీద ఉన్న నిర్మాత నాగవంశీ.. రవితేజకు కూడా ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడు. కాస్త లేట్ అయినా కూడా మాస్ జాతర థియేటర్లోకి వచ్చిన తర్వాత నిజంగానే మా జాతర చూపిస్తుంది అంటున్నాడు ఈయన. సామజవరగమన లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే రాసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇది రవితేజకు 75వ సినిమా. త్వరలోనే మాస్ జాతర విడుదల కానుంది. మొత్తానికి చక్రి చనిపోయిన 11 సంవత్సరాల తర్వాత ఆయన స్వరాన్ని మరోసారి రి క్రియేట్ చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆ మధ్య రజనీకాంత్ వేటయాన్ సినిమాలో కూడా దివంగత గాయకుడు మలేషియ వాసుదేవన్ రీ క్రియేట్ చేశాడు సంగీత దర్శకుడు అనిరుద్. మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చిన తర్వాత చనిపోయిన వాళ్ళు కూడా మళ్లీ బతికి వస్తున్నారు.