మహేష్ బాబు ల్యాండ్ అయ్యాడు.. మళ్లీ బ్యాండ్ బాజాయించడానికి రాజమౌళి రెడీ..!

మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా జరగడం లేదు. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రోజుల నుంచి నాన్ స్టాప్ షూటింగ్ తో అలసిపోయిన మహేష్.. కుటుంబంతో పాటు చిన్న ట్రిప్ వెళ్ళాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2025 | 01:55 PMLast Updated on: Apr 15, 2025 | 1:55 PM

Intersting News About Rajamouli And Mahesh Babu Cinema

మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా జరగడం లేదు. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రోజుల నుంచి నాన్ స్టాప్ షూటింగ్ తో అలసిపోయిన మహేష్.. కుటుంబంతో పాటు చిన్న ట్రిప్ వెళ్ళాడు. సాధారణంగా తన సినిమా హీరోలకు ట్రిప్ వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వడు రాజమౌళి. కానీ మహేష్ బాబుకు మాత్రం అన్ని రకాల అనుమతులు లభిస్తున్నాయి. పాస్పోర్ట్ తీసుకున్నా కూడా.. ఆ తర్వాత ఇచ్చేసి హాయిగా ట్రిప్ వెళ్ళమని చెప్పేశాడు. రాజమౌళి నుంచి పర్మిషన్ దొరకడంతో కొన్ని రోజులపాటు ఫారిన్ వెళ్లొచ్చాడు సూపర్ స్టార్. దాదాపు 10 రోజుల పాటు ట్రిప్ ఎంజాయ్ చేసిన మహేష్.. మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాడు. ఈయన భాగ్యనగరంలో ల్యాండ్ అయిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎయిర్ పోర్ట్ లో మహేష్ వస్తున్న విజువల్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. దాంతో దెబ్బకు SSMB 29 మళ్లీ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మళ్లీ మొదలు కానుంది.

ఈ సారి భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. హైదరాబాదులోనే కాశీ నగరం సెట్ వేస్తున్నారు. ఇక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శక ధీరుడు. ఆ తర్వాత ఆయన ఆలోచనలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఆఫ్రికాతో పాటు కెన్యాలో కూడా భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే అక్కడ లొకేషన్స్ రెక్కీ కూడా పూర్తయింది. సినిమా షూటింగ్ మొదలవడానికి ముందే రాజమౌళితో పాటు మరో నలుగురు కలిసి ఆఫ్రికాతో పాటు కెన్యా మరికొన్ని దేశాలు తిరిగి లొకేషన్స్ ఫైనల్ చేసుకొని వచ్చారు. మన దేశంలో చేయాల్సిన షెడ్యూల్స్ అన్ని పూర్తి చేసిన తర్వాత ఫారెన్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. దీనికోసం సపరేట్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాడు. ముందు ఇక్కడ చేయాల్సిన షూటింగ్ అంతా అయిపోతే.. ఆ తర్వాత హాయిగా దేశం దాటి ఒకేసారి మొత్తం షూటింగ్ పూర్తి చేయాలి అనేది రాజమౌళి ఆలోచన. దానికి తోడు అక్కడి నుంచి కొన్ని విజువల్స్ తీసుకొని.. దానికి తగ్గట్టు ఇక్కడ సెట్ వేసి గ్రీన్ మ్యాట్ లో కూడా కొన్ని సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నాడు. ఎలా చూసుకున్నా కూడా కేవలం ఏడాది టైంలోనే ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయాలని చూస్తున్నాడు జక్కన్న.

దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తున్నాడు. మహేష్ బాబు కూడా ఆయనకు పూర్తి సహకారం అందిస్తున్నాడు. ఇప్పటికే ట్రిప్ వెళ్లి వచ్చేయడంతో ఇకపై షూటింగ్ పూర్తి అయ్యేవరకు నో ట్రిప్స్ అనే ప్లాన్ మీద ఉన్నాడు మహేష్. అన్నీ కుదిరితే 2026 మార్చి నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. 2027 సమ్మర్ కు సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు హైదరాబాద్ లో చేయడంతో SSMB 29 నెక్స్ట్ షెడ్యూల్ ఏర్పాట్లు మళ్లీ వేగం పుంజుకున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కొత్త షెడ్యూల్ జరగనుంది. మే మొదటి వారం నుంచి ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కాశి సెట్ కోసమే దాదాపు 70 కోట్లు ఖర్చు పెడుతున్నారు మేకర్స్. ఈ సినిమా కథ పురాణాలను టచ్ చేస్తుందని తెలుస్తోంది. వరల్డ్ ట్రావెలర్ గా ఇందులో నటిస్తున్నాడు మహేష్. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని నెవర్ బిఫోర్ యాక్షన్ ఎపిసోడ్స్ మహేష్ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. దీనికోసం పూర్తిస్థాయి హాలీవుడ్ టీం ఇండియాకు వస్తుంది. అలాగే చాలా వరకు హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ కంపెనీలతో ఇప్పటికే టై అప్ అయ్యాడు రాజమౌళి. దాదాపు 750 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది.