300 కోట్ల హీరోతో త్రివిక్రమ్ సినిమా.. మరి అల్లు అర్జున్ పరిస్థితేంటి.. పక్కన పెట్టేసాడా..?

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ లో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లు కలిసి సినిమా చేస్తున్నారు అనే ఊహ వచ్చిన చాలు అభిమానులు పండుగ చేసుకుంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2025 | 02:30 PMLast Updated on: Apr 15, 2025 | 2:30 PM

Trivikrams Movie With A 300 Crore Hero And What About Allu Arjuns Situation Has He Been Put Aside

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ లో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లు కలిసి సినిమా చేస్తున్నారు అనే ఊహ వచ్చిన చాలు అభిమానులు పండుగ చేసుకుంటారు. టాలీవుడ్ లో అలాంటి ఒక సెన్సేషనల్ కాంబినేషన్ వెంకటేష్, త్రివిక్రమ్. నిజం చెప్పాలంటే త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత వెంకీతో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఈరోజు త్రివిక్రమ్ ఈ స్థాయిలో ఉన్నాడు అంటే మాత్రం దానికి కారణం కచ్చితంగా వెంకటేష్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన రైటర్ గా ఉన్నప్పుడు వెంకీ నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలా త్రివిక్రమ్ ఇండస్ట్రీలో స్టార్ రైటర్ అయ్యాడు. కానీ దర్శకుడుగా మారిన తర్వాత ఈ ఇద్దరు కలిసి సినిమా చేసే అవకాశం ఎప్పుడు రాలేదు. చూస్తుంటే ఇన్నాళ్లకు ఆ అవకాశం వచ్చినట్టే అనిపిస్తుంది. మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ తీరు కూడా మారిపోయింది. ఒక్క హిట్ ఎక్క‌డ‌లేని ఎన‌ర్జీ ఇస్తుందంటే ఏమో అనుకున్నాం కానీ.. ఇప్పుడు వెంకీ మామను చూస్తుంటే మాత్రం ఇది నిజ‌మే అనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం విజ‌యంతో ఈయ‌న కెరీర్ మ‌ళ్లీ టాప్ స్పీడ్ కు వెళ్లిపోయింది.

కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాం వచ్చి మూడు నెలలు అవుతున్న కూడా ఇప్పటివరకు నెక్స్ట్ సినిమా ఇదే అని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు వెంకటేష్. చాలా సంవత్సరాల తర్వాత బ్లాక్ బస్టర్ అందుకోవడం.. పైగా ఏకంగా 300 కోట్లు వసూలు చేయడంతో ఆ మార్కెట్ పడిపోకుండా సరైన ప్లానింగ్ చేసుకుంటున్నాడు వెంకీ. దాని కోసం కంగారు పడకుండా కావాల్సినంత టైం తీసుకుంటున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడితో మరో సినిమా చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు వెంకటేష్. మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఒక సీక్వెల్ చేయబోతున్నారు. కాకపోతే అది ఇప్పుడే ఉండకపోవచ్చు మరో రెండు మూడేళ్లు పడుతుంది. ఇక వెంకీ నెక్స్ట్ దర్శకుల లిస్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉండటం విశేషం. దర్శకుడిగా మారిన తర్వాత వెంకటేష్ తో సినిమా చేయని త్రివిక్రమ్.. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేయాలని చూస్తున్నాడు. త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. నువ్వు నాకు నచ్చావు, మళ్లీశ్వరి ఇలాంటి సినిమాలు ఇదే కాంబినేషన్ లో వచ్చాయి. అందులో త్రివిక్రమ్ రాసిన డైలాగులు ఇప్పటికీ ఫేమస్. చూస్తుంటే అల్లు అర్జున్ తో గురూజీ చేయాల్సిన సినిమా ఇంకా ఆలస్యమైలే కనిపిస్తోంది. అట్లీ సినిమా ఒకే ఏడాదిలో పూర్తవుతుందని మొన్నటి వరకు అనుకున్నారు.. కానీ ఆ సినిమా స్పాన్ చూసిన తర్వాత కచ్చితంగా రెండేళ్లు పడుతుందని మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు త్రివిక్రమ్.

దాదాపు 600 కోట్లతో ఆ సినిమా ప్లాన్ చేస్తున్నాడు అట్లీ. మరోవైపు అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ కు కావాల్సినంత టైం తీసుకోవాలి అని సూచిస్తున్నాడు. దాంతో ఈ గ్యాప్ లో మరొక సినిమా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు త్రివిక్రమ్. ఎలాగో వెంకటేష్ తో చేయాల్సిన ప్రాజెక్టు లాంగ్ టైం పెండింగ్ లిస్టులో ఉంది. టైం లేక ఇన్నాళ్లు ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇక చేయాల్సిన అవసరం లేదు.. అందుకే వెంకీ సినిమా పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. పూర్తిగా ఫ్యామిలీ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం రానుంది. హారిక హాసిని బ్యానర్లోనే ఈ సినిమా వచ్చే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రానుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లు వసూలు చేసిన వెంకటేష్.. ఇప్పుడు గాని త్రివిక్రమ్ తో సినిమా చేస్తే థియేటర్లు తగలబడడం ఖాయం. రొటీన్ ఫ్యామిలీ సినిమా చేసినా కూడా మరో 300 కోట్లు ఈజీగా వస్తాయి. అందుకే వెంకీ తో తక్కువ టైంలో ఒక మినిమం బడ్జెట్ తో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. ఇది వర్కౌట్ అయితే నిర్మాతలకు పండగే. మరోవైపు మాస్ జాతర ఫేమ్ భాను భోగవరపు దర్శకత్వంలో కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు వెంకటేష్.