8 packsతో షర్ట్ లేకుండా.. 15 నిమిషాల ఫైట్.. 12000 థియేటర్స్ లో…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎయిట్ ప్యాక్స్ తో కనబడబోతున్నాడా? అరవింద సమేత వీరరాఘవలో సిక్స్ ప్యాక్స్ తో కనిపించి, ఓపెనింగ్ సీన్ తో మతిపోగొట్టాడు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎయిట్ ప్యాక్స్ తో కనబడబోతున్నాడా? అరవింద సమేత వీరరాఘవలో సిక్స్ ప్యాక్స్ తో కనిపించి, ఓపెనింగ్ సీన్ తో మతిపోగొట్టాడు. ఇప్పుడు అంతకు మించే యాక్షన్ సీక్వెన్స్ తో వార్ 2లో తన ఎంట్రీ సీన్ ఉండబోతోంది. ఏకంగా ఏయిట్ ప్యాక్స్ తో అది కూడా షర్ట్ లేకుండా తను కనిపించబోతున్నాడు. ఇక్కడితో ఇది ఆగిపోతే అసలే టాపికే కాదు.. కాని ఇప్పుడే పాన్ ఇండియా లెవల్లో వార్ 2 మీద సడన్ గా అందరి అటెన్షన్ మారటానికి రీజన్, 12 వేల థియేటర్స్ లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా 12000 పైన థియేటర్స్ లో రిలీజ్ కాలేదు. పుష్ప2 మాత్రమే ఇప్పటి వరకు 11500 థియేటర్స్ లో రిలీజైన రికార్డు క్రియటే్ చేసింది. అంతకుమించిన రికార్డుతో వార్ 2 మూవీ హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. విచిత్రం ఏంటంటే ఇదో హిందీ సినిమా, అయినా ఎవరూ దీన్ని అలా చూడట్లేదు. ఎన్టీఆర్ ఉండటం వల్ల ఓ హిందీ మూవీ కూడా తెలుగు సినిమాని మించేలా టాలీవుడ్ లో ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తోంది. బ్రహ్మాండం బద్దలయ్యేలా వార్2 వండర్స్ లిస్ట్ పెరిగిపోతోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ కాంబినేషన్ లో బ్రహ్మస్త్ర ఫేం అయాన్ ముఖర్జీ తీసిన వార్ 2మూవీ మోషన్ పోస్టర్ రాబోతోంది. ఈలోపే ఈ సినిమా చాలా విషయాల్లో రికార్డుల పుట్టగా మారిపోయింది. ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఎయిట్ ప్యాక్స్ లుక్ తో షాక్ ఇవ్వబోతున్నాడు. వార్ 2 లో తన ఇంట్రడక్షన్ సీన్ అరవింద సమేత వీరరాఘవలో తన ఇండ్ర డక్షన్ సీన్ ని మించేలా ఉండబోతోంది.
ఏకంగా 10 నుంచి 20 నిమిషాల నిడివితో ఎన్టీఆర్ మాస్ యాక్షన్ ఫైట్ తో వార్ 2 లో ఇంట్రడక్షన్ సీన్ ఉండబోతోందట. అందులోని ఒక సీన్ నే మోషన్ పోస్టర్ రూపంలో రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో ఎయిట్ ప్యాక్స్ తో షర్ట్ లేకుండా కనిపించబోతున్నాడు ఎన్టీఆర్. ఇంతవరకు అరవింద సమేత వీరరాఘవ, త్రిబుల్ ఆర్ లో ఐటే సిక్స్ ప్యాక్స్ లేదంటే, భారీ మజిల్స్ తో కనిపించిన తను,ఏయిట్ ప్యాక్స్ తో ఫస్ట్ టైం కనిపించబోతున్నాడు.
ఇక కల్కీ, పుష్ప2 కంటే ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాగా కూడా వార్2 మూవీ రికార్డు క్రియేట్ చేయబోతోంది. ఏకంగా 12000 థియేటర్స్ లో విడుదల కాబోతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ వార్ 2. కల్కీ మూవీ అయితే ప్రపంచ వ్యాప్తంగా 10 వేల థియేటర్స్ లో రిలీజై రికార్డు క్రియేట్ చేస్తే, పుష్ప 2 మూవీ 11500 థియేటర్స్ లో విడుదలై కల్కీరికార్డుని బ్రేక్ చేసింది.ఇప్పుడు వార్ 2 మూవీ ఆగస్ట్ 14 న ప్రపంచ వ్యాప్తంగా 12వేల థియేటర్స్ లో రిలీజఅవతోతున్న తొలి ఇండియన్ మూవీగా చరిత్ర స్రుష్టించబోతోంది. అంతేకాదు ఇది నిజానికి ఓ హిందీ మూవీ. కాని ఎన్టీఆర్ ఇందులో నటిస్తుండటంతో, సౌత్ లో ఎవరూ దీన్ని బాలీవుడ్ సినిమాగా కన్సిడర్ చేయట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఓ తెలుగు సినిమాకున్నంత డిమాండ్ కనిపిస్తోంది. 250 కోట్ల వరకు తెలుుగ రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగేలా కనిపిస్తోంది
ఇక త్రిబుల్ ఆర్ లో నాటు నాటు సాంగ్ కి చరణ్, ఎన్టీఆర్ డాన్స్ ప్రానం పోసింది. మళ్లీ ఆ పాట తర్వాత ఆరేంజ్ లో వార్ 2 సాంగ్ సెన్సేషన్క్రియేట్ చేసేలా ఉంది. 6 నిమిషాల డ్యూరేషన్ తో ప్లాన్ చేసిన సాంగ్ లో హ్రితిక్ రోషన్ తో ఎన్టీఆర్ కలిసి డాన్స్ చేశాడు. ఆల్ మోస్ట్ 4 నిమిషాల పాట వరకు షూటింగ్ జరిగింది. మిగతా 2 నిమిషాల సాంగ్ షూటింగ్ టైంలో హ్రితిక్ కాలికి గాయమై, షూటింగ్ ఆగింది… సో ఇది కూడా నాలుగైదు రోజుల షూటింగ్ తో పూర్తవుతుంది. మొత్తానికి మేలో ఈ పాట ప్రోమోని, మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసి వార్ 2 మూవీ టీం ఇక, సినిమా ప్రమోషన్ ని మూడు నెల్ల ముందుగానే షురూచేయబోతోందని తెలుస్తోంది.