55 వేల థియేటర్స్ లో 10000 కోట్లొస్తే… మార్చ్ 25న మూడినట్టేనా..?
సూపర్ స్టార్ మహేశ్ బాబు 29వ మూవీ రిలీజ్ డేట్ వచ్చింది. వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ సినీ సునామీ వస్తుందా? లేదంటే 2027 సమ్మర్ కే వస్తుందా అనేది ఈనెల 21న వచ్చే ఎనౌన్స్ మెంట్ తో తేలుతుంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు 29వ మూవీ రిలీజ్ డేట్ వచ్చింది. వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ సినీ సునామీ వస్తుందా? లేదంటే 2027 సమ్మర్ కే వస్తుందా అనేది ఈనెల 21న వచ్చే ఎనౌన్స్ మెంట్ తో తేలుతుంది. రెండుభాగాలు కాదు 4 గంటలతో సింగిల్ సినిమాగా ఈ మూవీ వస్తుందనే ప్రచారం జరుగుతుండటంతో, ఏది నిజమో ఈనెల 21 న జరిగే ప్రెస్ మీట్ లో తేలబోతోంది. ఐతే 55 వేల థియేటర్స్ లో విడుదలౌతున్న తొలి ఇండియన్ మూవీగా, ఈ సీనిమా ఒక్కరోజు అన్ని థియేటర్స్ లో ఆడినా 10 వేలకోట్లుకు పైనే వసూళ్లొచ్చే ఛాన్స్ఉంది. అదే జరిగితే, మహేశ్ బాబు, రాజమౌళికి కాదు, మిగతా హీరోలకి పండగొచ్చేఛాన్స్ఉంది. బాహుబలి పుణ్యమాని నార్త్ మార్కెట్ కి రోడ్లు పడ్డాయి. తర్వాత ఎన్టీఆర్, చరణ్, బన్నీ, కన్నడ స్టార్ యష్ ఇలా అంతా బాలీవుడ్ మార్కెట్ మీద దాడి చేశారు. హిందీ సినిమా కొంపముంచారు… ఇప్పుడు రాజమౌళి పుణ్యమాని హాలీవుడ్ మార్కెట్లోకి రోడ్డు పడుతోందా? అమెరికన్, యురోపియన్ మార్కెట్ ని తెలుగు సినిమా కొల్లగొట్టేలా ఉందా?
సూపర్ స్టార్ మహేశ్ బాబు 29వ మూవీతో బ్రహ్మాండం బద్దలయ్యే పరిస్థితులు రాబోతున్నాయి. ఒకడొచ్చి రోడ్డేస్తే, తర్వాత అంతా రోడ్డు రోలర్లు, కార్లేసుకుని వెళ్లినట్టు… బాహుబలి వచ్చాకే తెలుగు సినిమా దాడి బాలీవుడ్ మార్కెట్ మీద పెరిగింది… ఏకంగా హిందీ సీనిమాలే ఆడలేనంతగా, తెలుగు సినిమాలే బాలీవుడ్ మార్కెట్ ని కబ్జా చేశాయి..
ఏక్షనా బాహుబలి వచ్చిందో కాని, ఆ సినిమా ని టేస్ట్ చేసిన నార్త్ ఇండియన్స్ సౌత్ సినిమాకు, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాకు అడిక్ట్ అయిపయారు. దెబ్బకే బాహుబలి ని చూసిన జనం, బాహుబలి2 తో టాలీవుడ్ కి ఫిదా అయ్యారు..అంటే వెంటనే పుష్ప, కార్తికేయ2, మేజర్, ఇలా పావుడజన్ తెలుగు సినిమాలు హిందీ మార్కెట్ ని కొల్లగొట్టాయి. ఆ ప్రాసెస్ లో కన్నడ మూవీ కేజీయఫ్, కేజీయఫ్ 2 కి కూడా బాలీవుడ్ లో ఎంట్రీ దొరకటమే కాదు, అక్కడబాక్సాఫీస్ షేక్ అయ్యే పరిస్థితులొచ్చాయి. కాంతారా, పొన్నియన్ సెల్వన్, విక్రమ్, లియో ఇలా ఇన్ని సౌత్ సినిమాలకు నార్త్ లో భారీ వెల్ కమ్ దొరికిందంటే, బాహుబలితో రాజమౌళి నార్త్ కి వేసిన రోడ్డే కారణం..
అలా రాజమౌళి నార్త్ గోడలు బద్దలు కొట్టాక, హిందీ సినిమాన బతికి బట్టకట్టలేనంతగా, తెలుగు, కన్నడ, తమిళ సినిమాలు నార్త్ మార్కెట్ ని కొల్లగొట్టాయి. ఓటీటీలో మాలయాళ మూవీలు దుమ్మదులిపేస్తున్నాయి… మొత్తంగా బాలీవుడ్ దుకాణం మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది
కట్ చేస్తే ఇప్పుడు రాజమౌలి కన్ను హాలీవు్డ మీద పడింది. పాన్ వరల్డ్ మూవీ తీస్తున్న తను, ఎస్ ఎస్ ఎమ్ బీ 29 ప్రాజెక్ట్ తో, హాలీవుడ్ కి రోడ్డేస్తే, అక్కడా ఈ మూవీ దుమ్ముదులిపితే, ఇక డజన్ల కొద్ది తెలుగు సినిమాలు క్యూ కడతాయి.. సో 2027 మార్చ్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు29 వ మూవీ రిలీజై అక్కడ రికార్డులు క్రియేట్ చేస్తే, ఆతర్వాత క్యూలో దేవర 2 ఉండే ఛాన్స్ ఉంది. అది ఈ ఏడాది ఎండింగ్ మొదలైనా, 2027 లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి
సుకుమార్ తో చరణ్ చేయబోయే సినిమా కూడా 2027 ఏడాది మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, దానికి రాజమౌళి వేసే రోడ్డు మీద దూసుకెళ్లే ఛాన్స్ ఉంది. ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ తీసే స్పిరిట్ కూడా 2027 లో వస్తే కనకా, పాన్ ఇండియా మీద తెలుగు సినిమాలు దాడి చేసినట్టే, పాన్ వరల్డ్ మార్కెట్ మీద తెలుగు మూవీలు దండెత్తే ఛాన్స్ఉంది. ఆలిస్ట్ లోనే దేవర 2, సలార్ 2, కల్కీ 2, స్పిరిట్, తో పాటు సుకుమార్ చరణ్ మూవీ కూడా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఇవన్నీ జరగాలంటే పాన్ ఇండియానా బాహుబలి ఊపినట్టున పాన్ వరల్డ్ మార్కెట్ ని సూపర్ స్టార్ మహేశ్ బాబు 29వ మూవీ కుదిపేయాలి.