Mega Movies: ఒకేసారి 4 మెగా సినిమాలు.. మెగా ఫ్యాన్స్ కి పండగ..
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ రెండు వారాల గ్యాప్ లో ఊపేసేందుకు వస్తున్నారు. ఈవిషయంలో మెగా మామల దారిలో సాయితేజ్, వైష్ణవ్ తేజ్ నడవబోతున్నారు. వరున్ తేజ్ కూడా సీన్ లోకి వస్తుండటంతో, ఆగస్ట్ నెల మెగా మంథ్ గా మారబోతోంది.

Mega Family Movies Ready To Release in july and August
ఒకే నెలలో 5 గురు మెగా హీరోలు, నాలుగు సినిమాలతో దండెత్తితే ఎలా ఉంటుంది. మెగాసునామీనే. అదే ఇప్పుడ జరగబోతోంది. అంటే జులైలోనో, లేదంటే ఆగస్ట్ లోనే ఈ పరిస్థితి ఉండదు. రెండు నెలల్లో 5 మూవీలు రాబోతున్నాయి. కాకపోతే బ్రో మూవీ విడుదల తేదీ నుంచి వరుణ్ తేజ్ మూవీ విడుదల తేదీ వరకు లెక్కేస్తే 30 రోజులొస్తున్నాయి.
సో అలా చూస్తే ఈనెల 28 నుంచి వచ్చే నెల 25 వరకు 4 మెగా సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈనెల 28 న సాయితేజ్, పవన్ కళ్యాణ్ కలిసి చేసిన బ్రో రాబోతోంది. ఆతర్వాత 12 రోజుల గ్యాప్ తో మెగాస్టార్ చిరంజీవీ తమన్నా, కీర్తి సురేష్ కలిసి చేసిన భోళా శంకర్ రానుంది. ఆల్రెడీ చిరు అండ్ కో తమ పాత్రలకు డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేశారు.
ఇక ఆగస్ట్ 11న భోళా శంకర్ రావటమే ఆలస్యం. ఆతర్వాత వారం గ్యాప్ లో ఆదికేశవ్ మూవీతో వైష్ణ్ తేజ్ రాబోతున్నాడు. అ వెంటనే ప్రవీన్ సత్తారు మేకింగ్ లో వరున్ తేజ్ చేసిన గాండీవ ధారి అర్జున రిలీజ్ కాబోతోంది. మొత్తంగా 30 రోజుల లోపే 5 గురు మెగా హీరోలు, నాలుగు సినిమాలతో దండెత్తడం కన్ఫామ్ అయ్యింది.