హిట్ 3 ఫస్ట్ రివ్యూ.. టాక్ ఏంటి.. నాని 100 కోట్లు సేఫ్ అయినట్టేనా..?
ఏ సినిమా విడుదలైనా కూడా ఎలా ఉంది అని అడుగుతారు ప్రేక్షకులు.. కానీ అలా అడగకుండా థియేటర్ కు నమ్మకంగా వెళ్లే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది నాని మాత్రమే.

ఏ సినిమా విడుదలైనా కూడా ఎలా ఉంది అని అడుగుతారు ప్రేక్షకులు.. కానీ అలా అడగకుండా థియేటర్ కు నమ్మకంగా వెళ్లే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది నాని మాత్రమే. ఈయన బ్రాండ్ ఇప్పుడు ఎలా ఉంది అంటే.. నాని నటించిన కాదు నిర్మించిన కూడా కళ్ళు మూసుకొని థియేటర్ వైపు వెళ్లిపోతున్నారు ఆడియన్స్. తన జడ్జిమెంట్ ఆ రేంజ్ లో ఉంటుంది. తాజాగా హిట్ 3 సినిమాతో ప్రేక్షకులకు ముందుకి వస్తున్నాడు నాని. మే 1న ఈ సినిమా విడుదల కానుంది. వెంకటేష్ తో సైంధవ్ లాంటి డిజాస్టర్ తర్వాత శైలేష్ కొలను తెరకెక్కించిన సినిమా ఇది. అయితే హిట్ 3 శైలేష్ పేరు మీద కాకుండా కేవలం నాని బ్రాండ్ తో విడుదలవుతుంది. పైగా ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే. దాంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమా మీద దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టాడు నాని. ఆయన కెరీర్లో ఇప్పటివరకు హైయెస్ట్ బడ్జెట్ సినిమా ఇదే. అది కూడా బయట నిర్మాతకు రిస్క్ ఇవ్వకుండా సొంత బ్యానర్లో చేసుకున్నాడు నాచురల్ స్టార్. హిట్ 3 ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో జరుగుతున్నాయి. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
మొక్కుబడిగా కాకుండా బాధ్యతగా అన్ని రాష్ట్రాలకు వెళ్లి తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు నాని. దానికోసం ఆయా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలను కూడా ప్రమోషన్ కోసం వాడుకుంటున్నాడు. మలయాళంలో ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ విడుదల చేస్తున్నాడు. ఇక తమిళం హిందీలో కూడా మంచి నిర్మాతల చేతుల్లో తన సినిమాలు పెట్టాడు ఈయన. కచ్చితంగా హిట్ 3 బ్లాక్ బస్టర్ అవుతుందని బలంగా నమ్ముతున్నాడు నాని. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. దీనికి ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఈ సినిమాకు తన కొడుకును అయితే తీసుకురాను అంటూ నాని ఇంతకు ముందే చెప్పాడు. ఈ లెక్కన సినిమా కేవలం 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు మాత్రమే. మామూలుగా అయితే నాని సినిమా ఇంటిల్లిపాది కలిసి చూసేలా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అలాంటి సినిమా చేయలేదు నాని. ఇక హిట్ 3 సెన్సార్ రివ్యూ విషయానికి వస్తే.. సినిమా చాలా వైలెంట్ గా వచ్చింది అంటున్నారు వాళ్ళు. కథ మొత్తం శ్రీనగర్, జమ్మూ ప్రాంతంలోనే జరుగుతుంది.
తలలు పగలగొట్టి వెనకాల.. మొత్తం ఓపెన్ చేసి చంపే ఒక సీరియల్ కిల్లర్ ను పట్టుకోడానికి ప్రభుత్వం అర్జున్ సర్కార్ అనే స్పెషల్ ఆఫీసర్ ను అపాయింట్ చేస్తుంది. ఆ కేసు చేపించే క్రమంలో అర్జున్ కు ఎదురైనా అనుభవాలే ఈ సినిమా. మోస్ట్ రూత్ లెస్ కాప్ గా ఇందులో నటిస్తున్నాడు నాని. యాక్షన్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో వర్క్ అవుట్ అయ్యాయి. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా వెళ్లినట్టు అనిపించినా.. సెకండాఫ్ మాత్రం చాలా వేగంగా అయిపోయింది అంటున్నారు సెన్సార్ సభ్యులు. ముఖ్యంగా ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ సినిమాకు ప్రాణం అని తెలుస్తుంది. సెన్సార్ బోర్డు నుంచి అబోవ్ యావరేజ్ టాక్ వచ్చింది. అక్కడి నుంచి ఈ టాక్ వచ్చింది అంటే.. బయట బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు నాని ఫ్యాన్స్. మరి అది జరుగుతుందా లేదా అనేది మే 1న తెలుస్తుంది.