మూడేళ్ళుగా అదే పని, డేటింగ్ పై నోరు విప్పిన గిల్
భారత క్రికెట్ లో గత కొంతకాలంగా యువ ఓపెనర్ శుభమన్ గిల్ నిలకడగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లోనూ అదరగొడుతున్నాడు. అదే టైమ్ లో అతని పర్సనల్ లైఫ్ గురించి కూడా అందరిలోనూ ఆసక్తి పెరిగింది.

భారత క్రికెట్ లో గత కొంతకాలంగా యువ ఓపెనర్ శుభమన్ గిల్ నిలకడగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లోనూ అదరగొడుతున్నాడు. అదే టైమ్ లో అతని పర్సనల్ లైఫ్ గురించి కూడా అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఎవరితో డేటింగ్ చేస్తున్నాడు, ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు వంటి విషయాలపై ఆరా తీయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో అతడి పై డేటింగ్ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. శుభ్‌మన్ గిల్.. బాలీవుడ్ భామలతో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు ఆ మధ్యలో ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. మొదటగా.. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. కానీ ఆ తర్వాతే పలువురు ముద్దుగుమ్మల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సారా అలీఖాన్, రిద్ధిమా పండిట్, అవనీత్ కౌర్ ఇలా పేర్లు వినిపించాయి. గిల్ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెగ ప్రచారం సాగింది. అంతటా అతడి పెళ్లి గురించే చర్చ ఎక్కువైంది.
ఈ నేపథ్యంలో తాను ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడో స్పష్టత ఇచ్చాడు.రిలేషన్ షిప్ స్టేటస్ పై బాంబ్ పేల్చాడు. తాను మూడేళ్లుగా సింగిల్‌గానే ఉన్నానని చెప్పాడు. తనపై వస్తున్న రూమర్స్ గురించి పట్టించుకోనని, ఎందుకంటే అవి నిజం కావని తనకు తెలుసన్నాడు. తాను మూడేళ్లకు పైగా సింగిల్‌గానే ఉన్నాననీ, చాలా మందితో ముడిపెడుతూ రూమర్స్ వస్తున్నాయన్నాడు. ఆశ్చర్యమేమిటంటే కొన్నిసార్లు తాను ఎప్పుడూ చూడని, కలవని వ్యక్తులతో కూడా లింక్ చేస్తున్నారని వ్యాఖ్యానించాడు. క్రికెట్ కారణంగా రిలేషన్‌షిప్‌లో ఉండేందుకు తనకు టైమ్ లేదని గిల్ చెప్పాడు. గత మూడేళ్ళుగా ప్రొఫెషనల్ కెరీర్‌పైనే ఫోకస్ పెట్టానన్నాడు. సంవత్సరంలో 300 రోజులు ప్రయాణాలు చేస్తూ ఉండటం వల్ల రిలేషన్‌షిప్‌లో ఉండటానికి తనకు సమయం లేదని గిల్ క్లారిటీ ఇచ్చాడు.
గ్రౌండ్ లో గిల్ ఫీల్డింగ్ చేస్తున్న టైమ్ లో సారా పేరుతో ఫ్యాన్స్ నినాదాలు చేశారు. సహచర క్రికెటర్లు కూడా ఈ విషయంలో గిల్ ను టీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వీటన్నింటినీ గిల్ చాలా లైట్ తీసుకున్నాడు. రూమర్స్ అనేది ఓ ఆటోమేటిక్ స్విచ్ లాంటిదన్నాడు. గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఆటపైనే తన ఫోకస్ ఉంటుందని, ఇతర విషయాలు పట్టించుకోనన్నాడు.