కాబోయే భార్యతో అఖిల్ అక్కినేని రొమాంటిక్ పోజ్.. జైనాబ్ రావ్జీతో ఘాటు కౌగిట్లో..!
గత రెండు మూడు రోజులుగా బాగా ట్రెండ్ అవుతున్నాడు అఖిల్ అక్కినేని. దానికి ప్రత్యేకంగా కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి ఆయన కొత్త సినిమాలు లెనిన్ టీజర్ రిలీజ్ అయింది. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

గత రెండు మూడు రోజులుగా బాగా ట్రెండ్ అవుతున్నాడు అఖిల్ అక్కినేని. దానికి ప్రత్యేకంగా కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి ఆయన కొత్త సినిమాలు లెనిన్ టీజర్ రిలీజ్ అయింది. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో తిరుగకుతున్న మాస్ యాక్షన్ ప్రేమ కథ ఇది. ప్రేమను మించిన యుద్ధం లేదు అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా వస్తుంది. లెనిన్ కోసం పూర్తిగా మేకో వర్ అయ్యాడు అఖిల్. కచ్చితంగా ఈసారి బాక్సాఫీస్ బద్దలు కొడతా అంటున్నాడు అక్కినేని వారసుడు. ఇక ఈయన ట్రెండ్ అవ్వడానికి మరొక కారణం మొన్న ఏప్రిల్ 8న ఆయన పుట్టిన రోజు కావడం. తన బర్త్డేను కాబోయే భార్య జునైబ్ తో సెలబ్రేట్ చేసుకున్నాడు అఖిల్.
ఇద్దరు కలిసి బీచ్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఒకరినొకరు గట్టిగా హత్తుకొని మై లవ్ అంటూ పోస్ట్ చేశారు. ఈ ఇద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది. చైతు పెళ్లి అయిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి అఖిల్ మీదకు వెళ్ళింది. వీళ్ళ పెళ్లి ఎప్పుడు.. ఎక్కడ ఉండబోతుంది.. ఎలా ప్లాన్ చేస్తున్నారు అంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు. ఇదే ఎక్కువగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ వైపు వెళ్తున్నారు సెలబ్రిటీస్. అఖిల్ పెళ్లి కూడా అలాగే జరగబోతుందని తెలుస్తుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రావ్డీ కూతురు జైనాబ్ రావ్జీతో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు అఖిల్. వీళ్ళ ప్రేమ గురించి తెలిసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే వయసు అఖిల్ కంటే జైనాబ్ 9 సంవత్సరాల పెద్దది. అందుకే తన ప్రేమ కథను సీక్రెట్‌గా కొనసాగించాడు అక్కినేని వారసుడు. అఖిల్, జైనాబ్ నిశ్చితార్థ వేడుక నవంబర్ 26, 2024న కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. అప్పుడే పెళ్లి తేది కూడా ఫిక్స్ చేశారు. ఇరు కుటుంబాలు ఒక మాట అనుకొని పెళ్లికి ఏర్పాట్లు భారీగా చేస్తున్నారని తెలుస్తుంది.
ఇప్పటికే తమ పెళ్లి షాపింగ్ కోసం అఖిల్, జైనాబ్ దుబాయ్ వెళ్లి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ మధ్యే ఎయిర్ పోర్టులో కూడా ఇద్దరు కలిసి కనిపించారు. రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. చాలా తక్కువ మందితో అఖిల్ పెళ్లి జరగబోతుందని తెలుస్తోంది. హైదరాబాదులో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు అఖిల్. అందులో ఒకటి ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణుకథ సినిమా చేసిన మురళీ కిషోర్ అబ్బురుతో ఇందాక మనం మాట్లాడుకున్న లెనిన్ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. దీని తర్వాత యువి క్రియేషన్స్ లో అనిల్ అనే కొత్త దర్శకుడితో భారీ విజువల్ వండర్ చేయబోతున్నాడు అఖిల్. దీనికి ధీర అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కాకపోతే ఈ సినిమా స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాకపోవడంతో మురళి కిషోర్ అబ్బూరు సినిమాను ముందుకు తీసుకొచ్చాడు అఖిల్.