RRR పోస్టర్ తో ఆస్కార్ ట్వీట్.. ఇది కదా ఇండియన్ సినిమాకు అసలైన గౌరవం అంటే..!

పాటొచ్చి పదేళ్లయిన ఇంకా పవర్ తగ్గలేదు అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది గుర్తుంది కదా..! ఇప్పుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాలు చూసినా కూడా ఇదే అనిపిస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2025 | 10:39 AMLast Updated on: Apr 12, 2025 | 10:39 AM

Oscar Tweet With Rrr Poster Isnt This A True Respect For Indian Cinema

పాటొచ్చి పదేళ్లయిన ఇంకా పవర్ తగ్గలేదు అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది గుర్తుంది కదా..! ఇప్పుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాలు చూసినా కూడా ఇదే అనిపిస్తుంది. ఈ సినిమా విడుదలై మూడు సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా ఇప్పటికే ట్రిపుల్ ఆర్ మత్తులోనే ఉంది హాలీవుడ్. మనవాళ్లు ఈ సినిమాను మరిచిపోయి ఇతర సినిమాలతో బిజీ అయిపోయారు. త్రిబుల్ ఆర్ తర్వాత ఇటు రాజమౌళి మహేష్ బాబు సినిమాతో బిజీ అయిపోతే.. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా చేసి ఇప్పుడు వార్ 2 కూడా పూర్తి చేస్తున్నాడు నెక్స్ట్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా లైన్ లో ఉంది. ఇక రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ తో రావడమే కాకుండా ఇప్పుడు పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇలా ఎవరికి వాళ్లు ఫుల్ బిజీగా ఉన్నా.. హాలీవుడ్ కు మాత్రం ఇంకా త్రిబుల్ ఆర్ మత్తు వదలడం లేదు.

ఇప్పటికీ ఆ సినిమాను పొగుడుతూనే ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు ఆ సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆస్కార్ అధికారిక పోస్టర్ మీద ట్రిపుల్ ఆర్ సినిమా పోస్టర్ పడింది. ఇదే విషయాన్ని వాళ్ళు అధికారికంగా ట్వీట్ చేశారు. అసలు విషయం ఏంటంటే ఇప్పటివరకు ఆస్కార్ అవార్డుల కేటగిరీలో స్టంట్ డిజైన్ లేదు. ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేస్తున్నారు. దానికోసమే ట్రిపుల్ ఆర్ పోస్టర్ వాడుకున్నారు. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ యానిమల్స్ తో ఎంట్రీ ఇచ్చే సీన్ ఉంటుంది కదా.. దాని వాళ్ళు స్టంట్ డిజైన్ పోస్టర్ పబ్లిసిటీ కోసం వాడుకున్నారు. ఇప్పటినుంచి ఆస్కార్లో స్టంట్ డిజైన్ కేటగిరి కూడా ఉంటుంది అంటూ ట్రిపుల్ ఆర్ సినిమా పోస్టర్ అందులో జోడించారు. హాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన యాక్షన్ సినిమాలు ఉన్నా కూడా.. వాటన్నింటినీ కాదని మన రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాలోని యాక్షన్ సీన్ వాడుకున్నారు అంటే.. హాలీవుడ్ మీద ఈ సినిమా ప్రభావం ఎంత ఉందో అర్థం అవుతుంది.

కేవలం ఇప్పుడు మాత్రమే కాదు ఆ మధ్య ఫిఫా కూడా త్రిబుల్ ఆర్ లో నటించిన మన ఎన్టీఆర్ పేరును తమ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. ఫుట్బాల్ దిగ్గజాలు నైమర్, తావేజ్, రోనాల్డో పుట్టినరోజు ఒకేరోజు కావడంతో.. ముగ్గురి పేర్లలోని మొదటి అక్షరాలు కలుపుతూ NTR అంటూ ఫిఫా తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అప్పట్లో ఎన్టీఆర్ దీన్ని లైక్ చేయడంతో పాటు షేర్ కూడా చేశాడు. అంతేకాదు హాలీవుడ్ దగ్గర దర్శకులు క్రిస్టఫర్ నోలేన్, జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ లాంటి వాళ్ళు త్రిబుల్ ఆర్ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు ఆస్కార్ ట్విట్టర్లో స్టంట్ డిజైన్ కోసం మన సినిమాను వాడుకున్నారు. ఇది మన ఇండియన్ సినిమాకు జరిగిన గౌరవం అంటున్నారు సగటు సినీ అభిమానులు.