గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్సాఫీస్ కలెక్షన్స్.. అజిత్ ఫ్యాన్స్ కు పూనకాలు ఖాయం..
తమిళ స్టార్ హీరో అజిత్ నుంచి కొన్ని సంవత్సరాలుగా సరైన సినిమా రాలేదు. ఆయన వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ.. అభిమానులకు నచ్చిన సినిమాలు మాత్రం చేయడం లేదు.

తమిళ స్టార్ హీరో అజిత్ నుంచి కొన్ని సంవత్సరాలుగా సరైన సినిమా రాలేదు. ఆయన వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ.. అభిమానులకు నచ్చిన సినిమాలు మాత్రం చేయడం లేదు. అప్పట్లో మాస్ కమర్షియల్ సినిమాలతో దుమ్ము లేపిన అజిత్.. ఆ తర్వాత స్టైలిష్ ఫార్ములా అంటూ అటువైపు వెళ్లి డిజాస్టర్ సినిమాలు ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత ఈయన నుంచి వచ్చిన ఒక సినిమా చూసి పండగ చూసుకుంటున్నారు అభిమానులు. అదే గుడ్ బ్యాడ్ అగ్లీ. తాజాగా విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు దర్శకులకు పెద్దగా టెన్షన్ ఉండదు.. వాళ్ళ ఇమేజ్ వాడుకుంటూ పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా చేస్తే చాలు.. మిగిలింది ఫ్యాన్స్ చూసుకుంటారు. అజిత్ విషయంలో అధిక్ రవిచంద్రన్ అదే చేశాడు. దాదాపు 10 ఏళ్లుగా మిస్సయిన వాళ్ల వింటేజ్ అజిత్ ను ఫ్యాన్స్ కు తిరిగిచ్చేసాడు.
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అజిత్ స్క్రీన్ ప్రజెన్స్ చూసి విజిల్స్ వేస్తున్నారు ఇతర హీరోల అభిమానులు కూడా. ఆ రేంజ్ లో రఫ్ ఆడించాడు అజిత్. కథ చాలా రొటీన్.. కుటుంబం కోసం తన పాత లైఫ్ వదిలేసిన ఒక గ్యాంగ్ స్టర్.. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కథ. చాలా సింపుల్ లైన్ తీసుకున్న కూడా అజిత్ ఇమేజ్ కు తగ్గట్టు దాన్ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే పరుగులు పెట్టించాడు. చాలావరకు అజిత్ పాత సినిమాల రిఫరెన్స్ లు వాడుకున్నాడు. అది కూడా అభిమానులకు ఫుల్ కిక్కిచ్చే విషయం. మన దగ్గర ఏమో కానీ తమిళనాడులో మాత్రం అజిత్ స్వాగ్ చూసి థియేటర్లు తగలబడి పోతాయి. సీట్లలో కూర్చుని ఈ సినిమా చూడడం కష్టమే. ఒక్క ముక్కలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఓజి సినిమా కూడా ఇలా ఉండాలి అని కోరుకుంటున్నారు అభిమానులు.
ఫస్టాఫ్, సెకండ్ హాఫ్ అని తేడా లేదు.. సినిమా అంతా అజిత్ స్వాగ్ కనిపించింది. ప్రతి 10-15 నిమిషాలకు ఒకసారి హై మూమెంట్ ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. అజిత్ నెక్స్ట్ లెవెల్.. కేవలం ఆయన కోసమే సినిమా చూడొచ్చు. త్రిష ఓకే.. సునీల్ క్యారెక్టర్ బాగుంది. దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఓవరాల్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ.. అజిత్ ఫ్యాన్స్ కు ఫీస్ట్. చెన్నైలో మొదటి రోజే నాలుగు కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. వరల్డ్ వైడ్ గా 80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఎలా చూసుకున్నా కూడా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో అజిత్ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించడం ఖాయం.